News


ఏడురోజుల లాభాలకు బ్రేక్‌

Tuesday 5th November 2019
Markets_main1572949582.png-29371

  • 54 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌
  • 11900 పైన ముగిసిన నిఫ్టీ
  • ఫార్మా, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు 

మార్కెట్‌ ఏడురోజుల లాభాలకు మంగళవారం బ్రేక్‌ పడింది. ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి స్వల్పంగా నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 54 పాయింట్లను కోల్పోయి 40,248.23 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 11,917 వద్ద స్థిరపడింది. ఒక్క ఎఫ్‌ఎంసీజీ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫార్మా, మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లలో ఎక్కువగా విక్రయాలు జరిగాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో 113 పాయింట్లు నష్టపోయి 30,219.85 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో నేడు మార్కెట్‌ పాజిటివ్‌గానే ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో కిత్రం రోజు రికార్డు స్థాయి వద్ద ముగిసిన సెన్సెక్స్‌ నేడు మరో 164 పాయింట్లు లాభపడి 40,466.55 వద్ద, నిఫ్టీ సైతం 38 పాయింట్లు పెరిగి 11,979 వద్ద ఇంట్రాడే గరిష్టాలను చేశాయి. అనంతరం సూచీల గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఉదయం ఆర్జించిన లాభాలు హరించుకోవడంతో పాటు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఫార్మా, ఐటీ షేర్ల అ‍మ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ గరిష్టస్థాయి(40,466) నుంచి 403 పాయింట్లను కోల్పోయి 40,053.55 వద్ద, నిఫ్టీ గరిష్టం(11,979) నుంచి 117 పాయింట్లు నష్టపోయి 11,900 దిగువను 11,862 వద్ద కనిష్టాన్ని నమోదు చేశాయి. అయితే అనూహ్యంగా చివరి అరగంటలో మళ్లీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రికవరి అయ్యాయి. 

ఐషర్‌మోటర్స్‌, సన్‌ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 2శాతం నుంచి 3.70శాతం వరకు నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌, యస్‌బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం వరకు లాభపడ్డాయి. 



You may be interested

మూడేళ్ల కనిష్ఠానికి బంగారం డిమాండ్‌

Tuesday 5th November 2019

ఇండియాలో ఊహించినట్టుగానే బంగారం డిమాండ్‌ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని డబ్యూజీసీ(వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌) మంగళవారం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలలో ఆదాయాలు తగ్గడంతో పాటు, బంగారం ధరలు రికార్డు స్థాయిలకు చేరుకోవడంతో బంగారానికి డిమాండ్‌ తగ్గుతోందని తెలిపింది. ఈ ఏడాది బంగారం డిమాండ్‌ గతేడాదితో పోల్చుకుంటే 8 శాతం పడిపోయి 700 టన్నులకు చేరుకుందని, ఇది 2016 తర్వాత కనిష్ఠ స్థాయి అని డబ్యూజీసీ ఇండియా ఆపరేషన్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ సోమసుందరమ్‌

సెన్సెక్స్‌ చార్టులో ‘‘గోల్డెన్‌ క్రాస్‌’’

Tuesday 5th November 2019

బుల్లిష్‌నెస్‌కు సంకేతం డైలీ చార్టుల్లో అక్టోబర్‌ 30న సెన్సెక్స్‌ గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పరిచింది. చార్టుల్లో ఇలాంటి క్రాసోవర్‌ ఏర్పడడం బుల్‌ర్యాలీ కొనసాగింపునకు సంకేతంగా నిపుణులు చెబుతుంటారు. స్వల్పకాలిక ట్రెండ్‌ ఇండికేటర్‌ దీర్ఘకాలిక ట్రెండ్‌ ఇండికేటర్‌ను క్రాసోవర్‌ చేయడాన్ని గోల్డెన్‌క్రాస్‌గా చెబుతారు. ముఖ్యంగా 40 రోజుల డీఎంఏ ఇండికేటర్‌ 200 రోజుల డీఎంఏ ఇండికేటర్‌ను పైవైపుగా ఖండిస్తూపోతే గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడినట్లు పరిగణిస్తారు. ఇది ఒక బలమైన బుల్లిష్‌ ఇండికేటర్‌గా నిపుణులు భావిస్తుంటారు.

Most from this category