News


మూడోరోజూ కొనసాగిన ర్యాలీ

Wednesday 17th July 2019
Markets_main1563360246.png-27132

  • సెన్సెక్స్‌ లాభం 85 పాయింట్లు
  • 25 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 

మార్కెట్‌ ర్యాలీ మూడోరోజూ కొనసాగింది. సెన్సెక్స్‌ 85 పాయింట్లు పెరిగి 39,216 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 11,688 వద్ద స్థిరపడ్డాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన కోటక్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ షేర్ల ర్యాలీ సూచీలకు కలిసొచ్చింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు దిగిరావడంతో పాటు పశ్చిమాసియా రాజకీయ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం మార్కె్‌ట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ప్రపంచమార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., దేశీయ మార్కెట్‌ నేడు లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 40 పాయింట్ల లాభంతో 39,141 వద్ద,  నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11,670 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లకు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 151 పాయింట్ల మేర లాభపడి 39,284.73 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల పెరిగి 11700ల స్థాయిని అధిగమించి 11,706.65 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ‘‘నిఫ్టీ సూచీ బలమైన సాంకేతికంగా భావించే 11,630 స్థాయిని రెండు ట్రేడింగ్‌ సెషన్స్‌లోనూ అధిగమించింది. ప్రస్తుత మార్కెట్లో ఓవరాల్‌గా బుల్లిష్‌ మూడ్‌ కొనసాగుతుంది’’ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అటో, ఫార్మా షేర్లకు తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంకు నిఫ్టీ  అరశాతం ర్యాలీ చేసి 30,735.50    వద్ద స్థిరపడింది. 

ఎస్‌బీఐ, హిందాల్కో, యూపీఎల్‌, జీ లిమిటెడ్‌, ఇండియన్‌బుల్స్‌హౌసింగ్స్‌ 2.50శాతం నుంచి 3శాతం లాభపడగా, ఓఎన్‌జీసీ, మారుతి, గెయిల్‌, ఐషర్‌మోటర్స్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 5.50శాతం నష్టపోయాయి. 



You may be interested

విలువల రీత్యా ఐటీ షేర్లు బాగున్నాయి: హేమంగ్‌ జాని

Wednesday 17th July 2019

ఫార్మా రంగంపై పూర్తి పాజిటివ్‌గా ఉండొద్దు ఎఫ్‌ఎంసీజీలో వచ్చే 2-3 నెలల్లో  ఎటువంటి అప్‌మూవ్‌ లేదు ప్రస్తుతం పరిస్థితుల్లో కొన్ని కార్పోరేట్‌ బ్యాంక్‌లు, సిమెంట్‌, కొన్ని దేశియ నిర్మాణ కంపెనీలు, కొన్ని ఫార్మా కంపెనీలను పరిశీలించడం మంచిదని షేర్‌ఖాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హేమంగ్‌ జాని ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే....... ఐటీ బాగుం‍ది... త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాక  ఇన్ఫోసిస్‌ షేర్లు సానుకూలంగా స్పందించాయి.  యాక్సెంచర్ వంటి కొన్ని

ఆర్‌బీఐ నిధుల బదిలీకి పచ్చజండా?!

Wednesday 17th July 2019

పూర్తయిన జలాన్‌ ప్యానెల్‌ నివేదిక ఆర్‌బీఐ మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేయమని జలాన్‌ కమిటీ సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిమల్‌జలాన్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఈ కమిటీ నిధుల బదిలీపై చర్చించి బుధవారం తన తుది నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. మిగులు నిధులను 3-5 సంవత్సరాల కాలపరిమితిలో విడతలవారీగా కేంద్రానిక అందించాలని కమిటీ సిఫార్సు చేసిందని సదరు వర్గాలు తెలిపాయి. అయితే ఎంత మొత్తం బదిలీ

Most from this category