News


సెన్సెక్స్‌ ప్లస్‌, నిఫ్టీ మైనస్‌

Wednesday 20th March 2019
Markets_main1553077869.png-24718

ఏడురోజుల సుధీర్ఘ ర్యాలీ తర్వాత సూచీలు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 23 పాయిం‍ట్ల లాభంతోనూ 38387 వద్ద, నిఫ్టీ 11 నష్టంతోనూ 11521 వద్ద స్థిరపడ్డాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ 65పాయింట్లు లాభపడి 29,832 వద్ద స్థిరపడింది. సూచీలు వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు తోడు  ఫెడరల్‌ రిజర్వ్ పాలసీ సమీక్ష, చైనా, అమెరికా మధ్య వాణిజ్య వివాద చర్చలు తదితరాల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఐటీ, ఆర్థిక, ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఫార్మా, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, అటో, మీడియా, మెటల్‌, ప్రైవేట్‌, ఎఫ్‌ఎంజీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ వరుసగా 8వ రోజూ లాభాలతో మొదలైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 11,503 - 11,556 రేంజ్‌లో కదలాడగా, సెన్సెక్స్‌ 38,316 - 38,490 స్థాయిలో కదలాడింది.
ఎల్‌ అండ్‌ టీ, డాక్టర్‌రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌, హిందాల్కో, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 2శాతం నుంచి 5శాతం లాభపడగా, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్‌, జీ లిమిటెడ్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 3శాతం నుంచి 5.50శాతం నష్టపోయాయి.You may be interested

ఆటో స్టాక్స్‌ కొనుగోళ్లకు ఇది అనువైన సమయమా?

Wednesday 20th March 2019

ఆటో స్టాక్స్‌ ఎర్నింగ్స్‌ పట్ల ఆశావహ అంచనాలు లేకపోయినప్పటికీ సమీప కాలంలో ఆకర్షణీయంగా మారొచ్చన‍్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కరెక్షన్‌ నేపథ్యంలో స్టాక్స్‌ చౌకగా మారాయని, దీర్ఘకాలం కోసం వీటిని ఎంచుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఏడాది బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇప్పటి వరకు 5.7 శాతం మేర ర్యాలీ చేయగా, ఇదే కాలంలో ఆటో ఇండెక్స్‌ 5.52 శాతం పడిపోయింది. కారణం అమ్మకాలు బలహీనంగా ఉండడం వల్లే.

ఆ ఏడు మార్కెట్ల కన్నా ఇండియాలోకే ఎక్కువ

Wednesday 20th March 2019

విదేశీ సంస్థాగత నిధుల ప్రవాహం మార్చి ఆరంభం నుంచి దేశీ మార్కెట్లోకి విదేశీ నిధులు(ఎఫ్‌పీఐ) ప్రవాహం ఒక్కమారుగా ఊపందుకుంది. ఈ నెల్లో ఎఫ్‌పీఐలు దాదాపు 22వేల కోట్ల రూపాయలను ఇండియా ఈక్విటీల్లోకి కుమ్మరించారు. ఫిబ్రవరిలో ఎయిర్‌స్ట్రైక్స్‌ అనంతరం ఎన్నికల్లో స్థిర ప్రభుత్వం వస్తుందన్న నమ్మకాలు పెరిగాయి. దీంతో ఎఫ్‌ఐఐలు ఒక్కమారుగా నికర కొనుగోలుదారులుగా మారారు. బీజేపీ చూపిన తెగువ ఎన్నికల్లో మరో 30,40 సీట్లు పెంచుకునేందుకు అవకాశాలు కల్పించిందని, అందువల్ల ఎన్‌డీఏ

Most from this category