News


ఆరంభ లాభాలు ఆవిరి

Monday 2nd December 2019
news_main1575281950.png-30005

సూచీలు సోమవారం ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. ఫలితంగా మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 8పాయింట్లు స్వల్ప లాభంతో 40,802 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 12050 దిగువన 12,048 వద్ద ముగిసింది. ఒక్క మెటల్‌ తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా అటో రంగ షేర్లు  అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల క్షీణతతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 75 పాయింట్లు నష్టపోయి 32వేల దిగువన 31,871.45 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌తో టెలికాం రంగ షేర్ల దన్నుతో నేడు మార్కెట్‌ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 280 పాయింట్ల లాభంతో 41,073 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 12,137 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గతవారంలో కేంద్రం విడుదల చేసిన రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి గణాంకాలు 6ఏళ్ల కనిష్టానికి దిగజారడం, నవంబర్‌ నెల వాహన విక్రయ గణాంకాలు మిశ్రమంగా నమోదు కావడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల రికవరి, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఫ్లాట్‌ ప్రారంభం తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఫలితంగా మిడ్‌సెషన్‌ కల్లా సూచీలు ప్రారంభలాభాల్ని కోల్పోయాయి. మిడ్‌సెషన్‌లో పరిమితి శ్రేణిలో కదలాడిన సూచీలు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌  40,707 - 41,094 రేంజ్‌లో, నిఫ్టీ ఇండెక్స్‌ 12,023 - 12,137 శ్రేణిలో కదలాడాయి.


ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫ్రాటెల్‌, ఐషర్‌ మోటర్స్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 6.50శాతం నష్టపోయాయి. ఏషియన్‌ పేయింట్స్‌, గ్రాసీం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 2శాతం నుంచి 4శాతం లాభపడ్డాయి. 



You may be interested

యస్‌ బ్యాంకు.. జోష్‌నివ్వని నిధుల సమీకరణ!

Tuesday 3rd December 2019

యస్‌ బ్యాంకు 2 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణకు నిర్ణయం తీసుకున్నట్టు చేసిన ప్రకటన సోమవారం స్టాక్‌ ధరకు జోష్‌నివ్వలేకపోయింది. సగటు ధర ప్రకారం చూస్తే ఒక్కో షేరును రూ.77 ధర వద్ద కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కానీ, షేరు మాత్రం బీఎస్‌ఈలో 6 శాతానికి పైగా నష్టపోయి రూ.64.05 వద్ద క్లోజయింది. యస్‌ బ్యాంకు షార్ట్‌లిస్ట్‌ చేసిన ఇన్వెస్టర్లు అందరికీ ఆర్‌బీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే విషయమై విశ్లేషకుల్లో

32,000పైకి వెళ్లి, కిందకు దిగిన బ్యాంక్‌ నిఫ్టీ

Monday 2nd December 2019

సూచీలు ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం మిడ్‌సెషన్‌ కల్లా 32,000 మార్కును కోల్పోయింది. నేడు ఈ ఇండెక్స్‌ క్రితం ముగింపు(31946.10)తో పోలిస్తే 62 పాయింట్ల లాభంతో 32వేల పైన ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం సెషన్‌లో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో 178 పాయింట్లు(0.25శాతం) పెరిగి 32024.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. అనంతరం మార్కెట్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడికి కారణంగా

Most from this category