News


సెన్సెక్స్‌ రికార్డు ముగింపు

Monday 4th November 2019
Markets_main1572863258.png-29337

  • రాణించిన మెటల్‌, ఐటీ షేర్లు
  • కలిసొచ్చిన అంతర్జాతీయ సంకేతాలు

మార్కెట్‌ ఏడోరోజూ లాభంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం, ఇప్పటి వరకు కంపెనీలు వెల్లడించిన రెండో క్వార్టర్‌ ఫలితాలు మార్కెట్‌ను మెప్పించడం తదితర కారణాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీ షేర్ల ర్యాలీ సూచీలకు కలిసొచ్చింది. ఫలితంగా సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 318 పాయింట్లు పెరిగి 40,483 పాయింట్లు వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసి 137 పాయింట్లు లాభంతో 40,302 వద్ద ముగిసింది. ఈ స్థాయి సెన్సెక్స్‌కు రికార్డు ముగింపు కావడం విశేషం. మరో ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 99 పాయింట్లు పెరిగి 11,989 స్థాయిని అందుకుని 54 పాయింట్ల లాభంతో 11,945 వద్ద స్థిరపడింది. ఐటీ, మెటల్‌, ఆర్థిక, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు అటో, ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌, మీడియా, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు నెలకొన్నప్పటికీ.., అనంతరం కొనుగోళ్ల మద్దతు లభించిన కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ  కిత్రం ముగింపుతో పోలిస్తే కేవలం 2పాయింట్ల లాభంతో 30,332 వద్ద స్థిరంగా ముగిసింది.

ఇన్ఫోసిస్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 3.50శాతం నుంచి 6శాతం వరకు లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హీరోమోటో కార్ప్‌, మారుతి, ఐఓసీ, జీ లిమిటెడ్‌ షేర్లు 2శాతం నుంచి 4.50శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

బంగారం ఎందుకంత ఖరీదు?!

Monday 4th November 2019

నానాటికీ పెరుగుతున్న ధర చిన్నపాటి విరామాలతో అప్‌ట్రెండే శాశ్వతం నిపుణుల అంచనా     పసిడి... ,,  పురాతన కాలం నుంచి ప్రస్తుతకాలం వరకు ఏమాత్రం వన్నె తగ్గని, ఆకర్షణ కోల్పోని లోహం... వ్యక్తి లేదా దేశ ఆర్థిక సంపన్నతకు చిహ్నం... బంగారం కన్నా విలువైన లోహాలు అనేకం కనుగొనొచ్చు కానీ సామాన్య ప్రజానీకానికి సైతం తెలిసిన, అందుబాటులో ఉండే విలువైన లోహం మాత్రం పసిడే! అసలెందుకు ఈ పుత్తడికి ఇంత ఆకర్షణ.. ఎందుకీ లోహం ఇంత ఖరీదు...?

హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం 61శాతం అప్‌

Monday 4th November 2019

రెండో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మంచి ఫ‌లితాల‌ను క‌న‌బ‌రిచింది. మోర్ట్‌గేజ్ రుణాలు అందించే ఈ ప్రైవేట్‌రంగ దిగ్గజం ఈ క్యూ2లో రూ. 3,961.53 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది.  గతేడాది ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన రూ.2,467.08 కోట్లతో పోలిస్తే ఇది 60.57శాతం అధికం. ఇదే క్యూ2లో నిర్వహణ ఆదాయం 10శాతం వృద్ధి చెంది రూ.10,478.33 కోట్లను సాధించింది. గతేడాది క్యూ2లో రూ.9,494.70 కోట్లుగా నమోదైంది. ఈ క్వార్టర్‌లో నికర వడ్డీ మార్జిన్‌

Most from this category