News


సెన్సెక్స్‌ కొత్త రికార్డు... ఐదో రోజూ లాభాలే..

Thursday 31st October 2019
Markets_main1572518271.png-29264

బ్యాంకింగ్‌, ఐటీ, ఫార్మా రంగ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ 5రోజూ లాభంతో ముగిసింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఆయా రంగాల్లో హెవీవెయిట్‌  షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల్ని ఆర్జించాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 340 పాయింట్ల లాభపడి 40,392 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది జూన్‌4నాటి 40,312 పాయింట్ల రికార్డుస్థాయిని తాజాగా అధిగమించడం ద్వారా కొత్త రికార్డును సెన్సెక్స్‌ నెలకొల్పింది. అయితే మరో బెంచ్‌మార్క్‌ సూచి నిఫ్టీ మాత్రం కొత్త రికార్డుకు ఇంకా దూరంగానే వుంది.  ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయి (12,103) మరో 150 పాయింట్ల వెనుక  11,945.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నిఫ్టీ  నమోదు చేసింది. అయితే సూచీలు గరిష్టస్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతుండటంతో ట్రేడర్ల లాభాల స్వీకరణ, నేడు అక్టోబర్‌ ఎఫ్‌అండ్‌ఓ సీరీస్‌ ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్త కారణంగా చివరి అరగంటలో మెటల్‌, ఆర్థిక, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా సూచీల లాభాలు కొంత వరకు హరించుకుపోయినప్పటికీ..., లాభంతోనే ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 77.18 పాయింట్ల లాభంతో 40,129 వద్ద, నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 11,881.20 వద్ద స్థిరపడ్డాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బ్యాంక్‌ నిఫ్టీ 44పాయింట్లు లాభపడి 30వేలపైన 30,031.40 వద్ద స్థిరపడింది. 
ఇన్ఫోసిస్‌, గ్రాసీం, ఎస్‌బీఐ, జీ లిమిటెడ్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 4శాతం నుంచి 23.77శాతం వరకు లాభపడ్డాయి. టెక్‌మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటాస్టీల్‌, ఐఓసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

మార్కెట్‌ ర్యాలీకి కారణాలివే!

Thursday 31st October 2019

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ గురువారం (అక్టోబర్‌ 31) సెషన్‌లో తాజా జీవిత కాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. ఈ ఏడాది జూన్‌ నెలలో 40,312 స్థాయి వద్ద ఏర్పరిచిన జీవిత కాల గరిష్ఠాన్ని సెన్సెక్స్‌ ఈ రోజు సెషన్లో అధిగమించింది. ఇంట్రాడే గరిష్ఠామైన 40,344 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని ఏర్పర్చింది. అంతర్జాతీయంగా పాజిటివ్‌ సెంటిమెంట్‌ బలపడడంతోపాటు, కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడం‍తో సెప్టెంబర్‌ త్రైమాసికంలో కార్పోరేట్‌ లాభాలు పెరిగాయి. పండుగ సీజన్‌ ప్రభావంతో

‘‘జీ’’ 12శాతం అప్‌

Thursday 31st October 2019

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు గురువారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 12.30శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.236.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తన మాతృసంస్థ సంస్థ ఎస్సెల్‌ గ్రూప్‌ ప్రమోటర్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌లో 10శాతం వాటా అమ్మకం గురించి తగిన సమాచారం ఇవ్వకపోవడంతో రుణదాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. లావాదేవీ పూర్తయ్యేవరకూ తనఖాలో వున్న  ప్రమోటర్ వాటాను ఎస్క్రో ఖాతాలో ఉంచే ప్రతిపాదనను తొలగించారు. అయినప్పటికీ ఈ షేరు కొనుగోళ్లకు

Most from this category