News


స్వల్ప లాభంతో సరి

Friday 15th November 2019
Markets_main1573814208.png-29621

ఇంట్రాడేలో ఆర్జించిన లాభాల్ని నిలుపుకోవడంలో సూచీలు విఫలమయ్యాయి. ఐనప్పటికీ ఈ వారాంతపు రోజైన శుక్రవారాన్ని లాభంతో ముగించాయి. సెన్సెక్స్‌ 70 పాయింట్లు లాభంతో 40,356.69 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 11,895 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 266 పాయింట్లు(0.87శాతం) ఎగిసి 31,016.50 వద్ద స్థిరపడింది. అలాగే ఫార్మా, ఆర్థిక, మీడియా, రియల్టీ రంగ షేర్ల కూడా లాభడ్డాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, అటో, మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న దేశీయ సూచీలు నిన్నటి లాభాల ముగింపునకు కొనసాగింపుగా సూచీలు లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి అన్నిరంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 364 పాయింట్ల వరకు లాభపడి 40,650.06 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు వరకు ఎగసి 11,973.65 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. మిడ్‌సెషన్‌ వరకు సాఫీగా సాగిన సూచీలు.. చివరి గంటలో అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా సూచీలు ఉదయం ఆర్జించిన లాభాల్ని కోల్పోయాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 70 లాభంతో నిఫ్టీ  23 పాయింట్లు లాభాల్ని సరిపెట్టుకున్నాయి. గతవారాంతాన మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ బ్రోకరేజ్‌ సంస్థ భారత అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి నెగిటివ్‌కు సవరించడంతో ఈ వారం మొత్తం సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 32 పాయిం‍ట్లు పెరిగ్గా, నిఫ్టీ 13 పాయింట్లు లాభపడింది.

గ్రాసీం, జీ లిమిటెడ్‌, ఎస్‌బీఐ, భారతీఎయిర్‌టెల్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 3శాతం నుంచి 9.71శాతం వరకు లాభపడ్డాయి. వేదాంత, మారుతి సుజుకీ, బీపీసీఎల్‌, హీరోమోటోకార్ప్‌, ఐఓసీ షేర్లు 1.30శాతం నుంచి 4శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

బ్యాంకుల నెత్తిన టెల్కోల పిడుగు!?

Friday 15th November 2019

ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌కు భారీగా రుణాలిచ్చిన బ్యాంకులు ప్రభుత్వ సాయం అందకుంటే ఇక్కట్లేనంటున్న నిపుణులు సుప్రీంకోర్టు తాజాతీర్పుతో ఏజీఆర్‌ రూపంలో టెలికం కంపెనీల నెత్తిన పడిన ఆర్థిక భారం అంతిమంగా బ్యాంకులను చుట్టుకోవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏజీఆర్‌ తీర్పుతో క్యు2లో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు ఉమ్మడిగా దాదాపు రూ. 74వేల కోట్ల నష్టం ప్రకటించాయి. దీంతో ఈ రెండిటికి అప్పులిచ్చిన బ్యాంకుల పరిస్థితి ఎలాఉంటుందోనన్న అనుమానాలు పెరిగాయి. ఈ రెండు కంపెనీలకు కలిపి

వోడాఫోన్‌ ఐడియా..కనిష్టం నుంచి 49శాతం అప్‌

Friday 15th November 2019

దేశీయ కార్పోరేట్‌ చరిత్రలో ఒక తైమాసికంలో అతిపెద్ద నికర నష్టాన్ని ప్రకటించిన వోడాఫోన్‌ ఐడియా షేరు శుక్రవారం మిడ్‌సెషన్‌ కల్లా తిరిగిలాభాల్లోకి మళ్లింది. ఏజీఆర్‌ ప్రభావంతో వొడాఫోన్‌ ఐడియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో భారీ నష్టాలను ప్రకటించింది. ఈ క్యూ2లో రూ.50,921 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో తమ నష్టాలు రూ.4,874 కోట్లని కంపెనీ వెల్లడించింది.

Most from this category