News


రెండు నెలల కనిష్టానికి సూచీల పతనం

Friday 19th July 2019
Markets_main1563533740.png-27191

 

  • 560 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌
  • 177 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ శుక్రవారం ఆర్థిక సంవత్సరపు రెండో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. అన్నిరంగాలకు చెందిన షేర్లు అమ్మకాల సునామితో  సెన్సెక్స్‌ 560.45 పాయింట్లు నష్టపోయి 38,337 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు క్షీణించి 11,419.25 వద్ద స్థిరపడ్డాయి. ఈ సూచీలకు ఇది రెండునెలల గరిష్టస్థాయి అత్యధికంగా అటో, బ్యాంకింగ్‌, ఫార్మా, ఆర్థిక రంగ షేర్లు అమ్మకాలు వెల్లువెత్తాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 660 పాయింట్లు క్షీణతో 30000 మార్కును కోల్పోయి 29,770.35 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో నేడు మార్కెట్‌ లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 162పాయింట్లు పెరిగి 39000 పైన  39,058.73 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 11,628 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే మార్కెట్‌ ప్రారంభమైన అరగంటలోనే అనూహ్యంగా అమ్మకాలు తలెత్తడంతో సూచీల నష్టాల్లోకి మళ్లాయి. ఇప్పటికి వరకు క్యూ1 ఫలితాలను వెల్లడించిన పలు కార్పోరేట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు ఆర్థిక మందగమన ఆందోళలు, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ద్రవ్య కొరత కొనసాగుతుడటం తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. దీనికి తోడు ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించిన ‘‘సంపన్న వర్గాలపై మరింత పన్ను’’ అంశంపై నిన్న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి కీలక వాఖ్యలు చేశారు. ‘‘సంపన్న వర్గాలపై సర్‌చార్జీ’’ భారాన్ని తగ్గించుకునేందుకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమను తాము ట్రస్టులుగా కాకుండా సంస్థలుగా నమోదు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎఫ్‌పీఐలు ట్రస్టీలుగానే నమోదు చేసుకున్నట్లయితే కొత్త టాక్స్‌ సర్‌ ఛార్జీలు చెల్లించక తప్పదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. సీతారామన్‌ వివరణతో విదేశీ ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఈ అంశం మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి నిన్నటి వరకు ఎఫ్‌ఐఐలు ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.5000 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆయా అంశాల నేపథ్యంలో మార్కెట్‌ ప్రారంభంలో ఆర్జించిన లాభాల్ని కోల్పోయి ఇంట్రాడే సెన్సెక్స్‌ 626 పాయింట్లు 38,271.35 వద్ద, నిఫ్టీ 298 పాయింట్లను కోల్పోయి 11,399 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ దశలో మార్కెట్లో రికవరీ జరగకపోవడంతో సూచీలు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. 

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐషర్‌మోటర్స్‌, బజాజ్‌ఫైనాన్స్‌, బజాజ్‌ఫిన్‌ సర్వీసెస్‌, ఎంఅండ్‌ఎం షేర్లు 3.50శాతం నుంచి 4.50శాతం నష్టపోగా, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, కోల్‌ ఇండియా, టైటాన్‌, ఎన్‌టీపీసీ షేర్లు అరశాతం నుంచి 2.50శాతం లాభడ్డాయి. 

నిఫ్టీ పతనంలో ఏ షేరు వాటా ఎంత:- 
నేడు నిఫ్టీ-50 కోల్పోయిన మొత్తం 177 పాయింట్లలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల వాటా 18పాయింట్లు కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ల వాటా 17 పాయింట్లు, ఐటీసీ షేర్ల వాటా 13 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్ల వాటా 12 పాయింట్లు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 10 పాయింట్లు, బజాజ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ షేర్లు వాటా 9 పాయింట్లుగా ఉన్నాయి.



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ర్యాలీ... నిలుస్తుందా..?

Friday 19th July 2019

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపులో భాగమైన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ శుక్రవారం జీవితకాల నూతన గరిష్ట స్థాయి రూ.2,370ను నమోదు చేసింది. 7 శాతం లాభంతో రూ.2,317 వద్ద ముగిసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండడంతో గత నాలుగు రోజుల్లోనే ఈ షేర్‌ 20 శాతానికి పైగా పెరిగింది. కానీ, గత అక్టోబర్‌లో రూ.1248 కనిష్ట ధర నుంచి చూసుకుంటే 85 శాతం లాభం ఇచ్చింది. కేవలం తొమ్మిది నెలల్లోనే ఈ స్థాయి

పబ్లిక్‌ వాటా పెంపు నిబంధన అమలు కష్టమే: సెబి

Friday 19th July 2019

తాజా బడ్జెట్లో తీసుకున్న ప్రతిపాదనల వలన తమ పాత్ర తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అభిప్రాయపడింది. నిధుల కోసం ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో ... కనీస పబ్లిక్‌ హోల్డింగ్‌ను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను సెబి అమలుచేయడం కష్టమని సెబి అధికారి ఒకరు చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలే కనీస పబ్లిక్‌ హోల్డింగ్‌ను 25 శాతానికి

Most from this category