News


ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌

Wednesday 3rd July 2019
Markets_main1562149935.png-26771

అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలకు తోడు ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో మార్కెట్‌ బుధవారం ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్‌ 22 పాయింట్లు లాభపడి 39,839 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 6 పాయింట్లు స్వల్పంగా లాభపడి11,916 వద్ద ముగిసింది. సూచీలకు ఇది వరుసగా మూడోరోజు లాభాల ముగింపు. ఇంట్రాడేలో బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌, రియల్టీ, మీడియా షేర్లకు కొనుగోళ్లు మద్దతు లభించింది. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు లాభపడ్డాయి. ఐటీ, మెటల్‌, అటో షేర్లలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో రూపాయి బలపడటంతో ఐటీ షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో కొనుగోళ్లు కనిపించగా, లార్జ్‌ షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. 

అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య తలెత్తిన వాణిజ్య సుంకాల విధింపు వివాదాలు ఏ మేరకు ప్రభావాన్ని చూపుతాయో అని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఎకామిక్‌ సర్వే విడుదల చేయనుడంతో పాటు ఎల్లుండి కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణకు కూడా సూచీలను ఒత్తిడిని గురిచేశాయి. ఫలితంగా సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌ 212 పాయింట్ల రేంజ్‌లో 39732-39816 శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ 58 పాయింట్ల​స్థాయిలో 11887-11945 రేంజ్‌లో ట్రేడైంది. 

గ్రాసీం, జీ లిమిటెడ్‌, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ లిమిటెడ్‌ 1శాతం నుంచి 7.50శాతం లాభపడగా, డాక్టర్‌ రెడ్డీస్‌, వేదాంత, టెక్‌ మహీంద్రా, గెయిల్‌, ఐషర్‌మోటర్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 
 You may be interested

ఎఫ్‌అండ్‌ఓలో పాజిటివ్‌ సంకేతాలు!

Wednesday 3rd July 2019

జూన్‌ సీరిస్‌లో సూచీలు పెద్దగా పెను మార్పులు లేకుండా ముగిశాయి. జూన్‌ సీరిస్‌ చివరి వారంలో ఎఫ్‌అండ్‌ఓలో కొంత కదలికలు కనిపించాయి. ఈ వారం ఆరంభం కూడా సూచీలు మందకొడిగా ప్రారంభించాయి. గతంలో జరిగనట్లే ఈ వారం కూడా సూచీలు దిగువకు రాగానే కొనుగోళ్లు కనిపించాయి. దీంతో నిఫ్టీ మరోమారు 11900 పాయింట్ల పైకి చేరింది. ఈ ర్యాలీలో కొత్తగా లాంగ్స్‌ ఏర్పడినట్లు ఫ్యూచర్స్‌ గణాంకాలు చూపుతున్నాయి. బడ్జెట్‌ నేపథ్యంలో

అధిక రాబడులకు...ఎఫ్‌ఐఐలు ఇండియాకు రావాల్సిందే!

Wednesday 3rd July 2019

ఈక్విటీ పెట్టుబడులపై మంచి రాబడి సంపాదించాలని భావించే విదేశీ మదుపరులు ఇండియా ఈక్విటీలను మరువలేరని, ప్రపంచంలో భారత ఎకానమీ చాలా బలంగా కనిపిస్తోందని మాన్యులైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ అభిప్రాయపడింది. ట్రేడ్‌ వార్‌ నేపథ్యంలో చైనా అస్థిరతను ఎదుర్కొంటోందని, విదేశీ మదుపరులకు ఇప్పుడు ఒక సురక్షితమైన, పరుగులు తీసే ఎకానమీ కావాలని సంస్థ ఎండీ రానా గుప్తా చెప్పారు. భారత్‌ తన ఎకానమీకి లక్షల కోట్ల డాలర్లను జత చేస్తోందన్నారు. దీంతో

Most from this category