News


మూడురోజుల లాభాలకు బ్రేక్‌

Wednesday 12th June 2019
Markets_main1560334492.png-26256

మార్కెట్‌ ర్యాలీ మూడు రోజుల ముచ్చటగానే మిగిలింది. సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 193 పాయింట్ల నష్టంతో 39,757 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లను కోల్పోయి 10906 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని నెలకొన్న ప్రతికూల సంకేతాలకు తోడు సూచీల మూడు రోజుల ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, నేటి మార్కెట్‌ ముగింపు అనంతరం విడుదల కానున్న ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత తదితర అంశాలను మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. బలహీనంగా ప్రారంభమైన మార్కెట్‌లో ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే అమ్మకాలను కట్టుబడటంతో సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 227 పాయింట్లను నష్టపోగా, నిఫ్టీ 100 పాయింట్లను కోల్పోయి 11,866.35 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఇంట్రాడేలో ఒక్క ఎఫ్‌ఎంజీసీ, మెటల్‌ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ఈ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 300 పాయింట్లు నష్టపోయి 31,012.85 వద్ద స్థిరపడింది. 
హీరోమోటోకార్ప్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫ్రాటెల్‌, యస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 1.50శాతం నుంచి 8శాతం వరకూ నష్టపోగా, టీసీఎస్, వేదాంత, ఓఎన్‌జీసీ, గెయిల్‌, టాటాస్టీల్‌ షేర్లు అరశాతం నుంచి 2శాతం వరకూ లాభపడ్డాయి. 



You may be interested

ఏ రంగం ఆకర్షణీయం..?

Thursday 13th June 2019

ఎన్నికల అంకం పూర్తయ్యి మునుపటి ప్రభుత్వమే మరింత బలంగా కేంద్రంలో కొలువుదీరింది. దీంతో స్టాక్‌ మార్కెట్లు కొత్త శిఖరాలను తాకి, ఆ తర్వాత కన్సాలిడేషన్‌లోకి వెళ్లినట్టు కనిపిస్తున్నాయి. కొన్ని రంగాలు ఖరీదైన వ్యాల్యూషన్లకు చేరగా, కొన్ని ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిపుణుల అభిప్రాయాల ఆధారంగా రంగాలవారీ విశ్లేషణ ఇలా ఉంది.    ఆటోమొబైల్‌ ఆటోమొబైల్‌ రంగం ప్రస్తుతం 18.1 పీఈ వద్ద ట్రేడవుతోంది. చారిత్రక సగటు పీఈ 16.9 కంటే 7 శాతం

కనిష్ఠ స్థాయి నుంచి కోలుకుంటున్న సూచీలు

Wednesday 12th June 2019

బెంచ్‌మార్క్‌ సూచీలు కనిష్ఠ స్థాయిల నుంచి కోలుకున్నాయి. నిఫ్టీ 11900 స్థాయిలోనే ట్రేడవుతోంది. మధ్యహ్నం 3.04 గంటలకు సెన్సెక్స్‌ 197.64 పాయింట్లు లేదా 0.49శాతం నష్టంతో 39752.82 వద్ద, నిఫ్టీ 63.70 పాయింట్లు లేదా 0.53 శాతం నష్టంతో 11901 వద్ద ట్రేడవుతున్నాయి. మొత్తంగా 953 షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా, 1421 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 137 షేర్లలో ఎటువంటి మార్పులేదు.  

Most from this category