News


రుచించని రేట్‌కట్‌

Thursday 4th April 2019
Markets_main1554373581.png-24976

నష్టాల్లో మార్కెట్లు
గురువారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ మరో పావుశాతం మేర వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించడం మార్కెట్‌కు పెద్దగా రుచించలేదు. దీంతో ఆద్యంతం నష్టాల్లోనే ట్రేడయిన సూచీలు ఆఖర్లో కూడా నష్టాలతోనే ముగిశాయి.

- సెన్సెక్స్‌ 192 పాయింట్ల నష్టంతో 38685 పాయింట్ల వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 11598 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంకు నిఫ్టీ 30వేలకు దిగువన 29904 పాయింట్ల వద్ద క్లోజయింది.

- నిఫ్టీ కీలక 11600 పాయింట్ల దిగువన బేరిష్‌గా ముగియడం అప్రమత్తకు సంకేతమని నిపుణుల అంచనా.

- మార్కెట్‌విస్తృతి సైతం నెగిటివ్‌గా(1073 అడ్వాన్స్‌లు, 1426 డిక్లైన్లు) ఉంది.

- డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత దిగజారి 69.02కు చేరింది.

- గురువారం ట్రేడింగ్‌లో రంగాలవారీగా చూస్తే ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా తప్ప అన్ని రంగాలు నష్టాల్లో క్లోజయ్యాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకు, ఎనర్జీ రంగాలు ఎక్కువ నష్టపోయాయి.

- షేర్లవారీగా టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, హిండాల్కో, బీపీసీఎల్‌, యస్‌బ్యాంకులు నష్టాల్లో ముగియగా, ఐబీ హౌసింగ్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, టాటామోటర్స్‌, అల్ట్రాటెక్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌లు లాభాల్లో ముగిశాయి. 



You may be interested

ఎన్‌పీఏల పరిష్కారంపై కొత్త నిబంధనలు!

Thursday 4th April 2019

- ఆర్‌బీఐ సర్క్యులర్‌ సుప్రీంకోర్టు  కొట్టివేతపై నీతిఆయోగ్‌ ప్రకటన - కేం‍ద్రం, సెంట్రల్‌ బ్యాంక్‌  రూపకల్పన చేస్తాయని వెల్లడి - కనీస ఆదాయ పథకాలకు  భారీ వృద్ధి అవసరమని వ్యాఖ్య ముంబై: మొండిబకాయిల పరిష్కారం విషయంలో కేంద్రం, బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)లు కొత్త నిబంధనలను తీసుకువస్తాయని నీతిఆయోగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమితాబ్‌ కాంత్‌ బుధవారం ఇక్కడ వెల్లడించారు. రుణ పునఃచెల్లింపుల్లో ఒక్కరోజు ఆలస్యం అయిన కంపెనీలపైనా దివాలా ప్రక్రియను ప్రారంభించాలని, 180 రోజుల

బీమా కంపెనీలపై విదేశీ ఇన్వెస్టర్ల మోజు

Thursday 4th April 2019

రూ.6,780 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్న అధిక వృద్ధి, వ్యాల్యూషన్లు  మార్చి నెలలో భారీ డీల్స్‌ కలిసొచ్చిన సానుకూల పరిస్థితులు న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు లిస్టెడ్‌ బీమా సంస్థల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రీమియం వసూళ్లలో బలమైన వృద్ధి చూపిస్తుండడం, అదే సమయలో ఈ కంపెనీల షేర్ల విలువలు భవిష్యత్తు వృద్ధి అవకాశాల కోణంలో ఆకర్షణీయంగా కనిపిస్తుండడంతో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) బీమా కంపెనీల్లో మార్చి నెలలో ఏకంగా రూ.6,780 కోట్ల మేర

Most from this category