News


మూడోరోజూ లాభాల ముగింపే...

Thursday 13th December 2018
Markets_main1544697348.png-22901

రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లపై తగ్గింపు ఆశలతో మార్కెట్‌ మూడోరోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 150.57 పాయింట్ల లాభంతో 35929.64 వద్ద, నిఫ్టీ సూచీ 54 పాయింట్ల లాభంతో 10791.50 వద్ద ముగిసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త గవర్నర్‌ శక్తికాంత్‌ వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో అన్ని రంగాల షేర్లలో షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. అయితే మెటల్‌, ఫార్మా షేర్లలో అశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు. ఫలితంగా ఫార్మా ఇండెక్స్‌ స్వల్పలాభంతో గట్టెక్కగా, మెటల్‌ ఇండెక్స్‌ మాత్రం నష్టాలతో ముగిసింది. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.50శాతం లాభపడింది. బ్యాంక్‌ నిఫ్టీ 172.50 పాయింట్ల లాభంతో 26,816.35 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ సూచీ ఇంట్రాడేలో 316 పాయింట్ల రేంజ్‌లో కదలాడగా, నిప్టీ సూచీ 101 పాయింట్ల స్థాయిలో ట్రేడైంది.
300 పాయింట్ల లాభపడిన సెన్సెక్స్‌:-
ప్రపంచమార్కెట్ల సానుకూలతలకు తోడు, దేశీయ ద్రవ్యోల్బణ, పారిశ్రామిక గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో నేడు మార్కెట్‌ భారీ లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 245 పాయింట్ల లాభంతో 36,024 వద్ద, నిప్టీ సూచీ 73 పాయింట్లు పెరిగి 10,810 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను షురూ చేశాయి.
ఒక్క ఫార్మా రంగం తప్ప అన్ని రంగాలు కొనుగోళ్లతో కళకళలాడాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త గవర్నర్‌ శక్తికాంత్‌ వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో పాటు,  నిధుల కొరతతో కొట్టిమిట్టాడుతున్న బ్యాంకులకు మూలధన సాయంపై కూడా ఆశలు రేకత్తడంతో బ్యాంకింగ్‌, నాన్‌- బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లు ర్యాలీ చేశాయి. అలాగే వడ్డీరేట్ల తగ్గింపు ఆశలతో అటో రంగ షేర్లు కూడా జోరదంకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ద్రవ్యత్వ సమస్య, రణ భారం, ఎంఎస్‌ఎస్‌ఈలకు ఆర్థిక తోడ్పాటు తదతర అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ బ్యాంకర్లతో గవర్నర్‌ శక్తికాంత్‌ సమావేశాన్ని నిర్వహించారనే వార్తలతో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. మిడ్‌సెషన్‌ అనంతరం యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభంతో అన్ని రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఫలితంగా మిడ్‌సెషన్‌ సమయానికి సెన్సెక్స్‌ 316 పాయింట్ల లాభపడి 36వేల పైన 36,095ల వద్ద, నిఫ్టీ 101 పాయింట్ల ఆర్జించి 10838 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది.

సగం లాభం మాయం:-
సూచీల గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో ట్రేడింగ్‌ ముగింపు సమయానికి సగం లాభాలు హరించుకుపోయాయి. మరోవైపు లాభాలతో ప్రారంభమైన యూరప్‌ మార్కెట్లు తిరిగి నష్టాల బాట పట్టడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలను మొగ్గుచూపడం కూడా సూచీల నష్టాలకు కారణమయ్యాయి. ఒకానొకదశలో సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం స్థాయి(36,095.56) నుంచి 300 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ సూచీ సైతం 91 పాయింట్లను కోల్పోయాయి. అయితే చివరి గంటలో బ్యాంకింగ్‌ షేర్లలో తిరిగి కొనుగోళ్లు జరగడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. చివరికి నిఫ్టీ 10800 కోల్పోయి 54 పాయింట్ల లాభంతో 10,791.55 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ సైతం ఇంట్రాడేలో అందుకున్న 36వేల మార్కును కోల్పోయి 150.57 పాయింట్ల లాభంతో  35,929 వద్ద ముగిసింది.
మారుతి, విప్రో, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, గ్రాసీం, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 3నుంచి 5.50శాతం లాభపడగా, టీసీఎస్‌, టాటాస్టీల్‌, యూపీఎల్‌, సన్‌ఫార్మా, యస్‌బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 6శాతం నష్టపోయాయి.You may be interested

ఇండియా వృద్దిపై మూడీస్‌ హెచ్చరిక!

Thursday 13th December 2018

భారత ఆర్థిక వృద్ధికి ఎన్‌బీఎఫ్‌సీల సమస్యలు ప్రతిబంధకాలు కావచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మూడీస్‌ హెచ్చరించింది. ఎన్‌బీఎఫ్‌సీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ ఇక్కట్లు దేశ వృద్ధిరేటును కుంటుపరుస్తాయని అభిప్రాయపడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ కేవలం 7 శాతానికి కాస్త అటుఇటుగా ఉండొచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది ఆశిస్తున్న 7.4 శాతం వృద్ధి రేటు అంచనా కన్నా వచ్చే ఏడాది అంచనాలు తక్కువని మూడీస్‌ చీఫ్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌

వచ్చే ఏడాది ఓ మోస్తరు రాబడులే

Thursday 13th December 2018

వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో ఎన్నికలు ఉండటం వల్ల మార్కెట్లు రేంజ్‌బౌండ్‌లో ఉంటాయని, రెండో అర్ధ భాగంలో మోస్తరు రాబడులను అందిస్తాయని ఏబీఎస్‌ఎల్‌ ఎంఎఫ్‌ కో-సీఐవో మహేశ్‌ పాటిల్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాదిలో స్థూల ఆర్థికాంశాలు మెరుగుదలను చూడొచ్చన్నారు. గత రెండు నెలల కాలం నుంచే పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. గత రెండు త్రైమాసికాలను గమనిస్తే

Most from this category