News


నిఫ్టీ ఐదో రోజూ లాభంతోనే ముగింపు

Wednesday 11th September 2019
Markets_main1568197549.png-28311

రాణించిన అటో, బ్యాంకింగ్‌ రంగ షేర్లు

ఇంట్రాడేలో ఆర్జించిన లాభాల్ని నిలుపుకోవడంతో సూచీలు విఫలమైనప్పటి సూచీలు లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 125 పాయింట్లు లాభంతో 37,270.82 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 11,035.70 వద్ద స్థిరపడ్డాయి. సూచీలకిది వరుసగా 5రోజూ లాభాల ముగింపు. అలాగే నిఫ్టీ వరుసగా రెండోరోజూ 11000 స్థాయిపైన, సెన్సెక్స్‌ సూచి సెప్టెంబర్‌లో తొలిసారిగా 37,200 పాయింట్లపైన ముగిసింది. అటో, మెటల్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక, ఫార్మా, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం లాభపడి 27776 వద్ద స్థిరపడింది. రూపాయి బలహీనతతో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మీడియా రంగ షేర్లలో అమ్మకాలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు లభించడటంతో సెన్సెక్స్‌ ఒకదశలో 200 పాయింట్లు పెరిగి 37,343.46 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 11,054.80 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. అయితే చివరిగంటలో కొంతమేర అమ్మకాలు జరగడంతో సూచీలు లాభాలు తగ్గాయి. 

జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, మారుతి, ఐషర్‌ మోటర్స్‌, టాటామోటర్స్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 4శాతం నుంచి 13శాతం లాభపడ్డాయి. జీ లిమిటెడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, గెయిల్‌, విప్రో, ఓఎన్‌జీసీ షేర్లు 2.50శాతం నుంచి 3శాతం నష్టపోయాయి.



You may be interested

డెడ్‌లైన్‌కు ముందే బీఎస్‌-6 ఇంధనం

Thursday 12th September 2019

డెడ్‌లైన్‌కు ముందే అందుబాటులోకి కసరత్తు చేస్తున్న  చమురు కంపెనీలు ప్రమాణాల అప్‌గ్రేడ్‌కు రూ.30,000 కోట్ల వ్యయం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత్‌ స్టేజ్‌–6 (బీఎస్‌) ప్రమాణాలు దేశంలో 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా బీఎస్‌–6 ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందా లేదా అన్న ఆందోళన వాహన తయారీ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఈ విషయంలో ధీమాగా ఉన్నాయి. డెడ్‌లైన్‌ లోగానే

బీటా ర్యాలీతో బాగుపడేవి ఇవే!

Wednesday 11th September 2019

అంతర్జాతీయంగా ఈక్విటీలకు సానుకూలతలు కనిపిస్తున్నాయని, అందువల్ల దేశీయ మార్కెట్లో కూడా షార్ట్‌టర్మ్‌లో బీటా ర్యాలీ వస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. ర్యాలీ అంచనాల నేపథ్యంలో హైబీటా ఉండి, వడ్డీరేట్ల ప్రభావితమయ్యే స్టాకులు మంచి దూకుడు చూపుతాయని పేర్కొంది. అలాంటి ఏడు స్టాకులను సూచించింది. అవి... ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌. (బీటా అనేది స్టాక్‌ ఒడిదుడుకులను మార్కెట్‌ సాపేక్ష దృష్టితో లెక్కించే సాధనం.

Most from this category