News


కరోనా వైరస్‌ దెబ్బకు బేర్‌మన్న బుల్‌

Friday 28th February 2020
Markets_main1582886147.png-32168

సెన్సెక్స్‌ 1,448.37 పాయింట్లు
4ఏళ్లలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసిన నిఫ్టీ

ఈక్విటీ మార్కెట్లను కరోనా వ్యాధి భయాలు వీడటం లేదు. ఫలితంగా దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 1,448.37 పాయింట్లు నష్టపోయి 38297.29 వద్ద, నిఫ్టీ 431.50 పాయింట్లు కోల్పోయి 11201.80 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ గడిచిన నాలుగేళ్లలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. సూచీలు వరుసగా ఆరోరోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 111 పాయింట్ల నష్టంతో వద్ద, నిఫ్టీ 111 పాయింట్లను కోల్పోయి 111 వద్ద స్థిరపడింది. చైనాతో ఇతర దేశాల్లో కరోనా వైరస్ వ్యాధి తగ్గుముఖం పట్టడానికి బదులుగా వ్యాధి వ్యాప్తి మరింత ఉధృతం కావడంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ మాంద్యం వైపు వెళుతున్న సూచనలు స్పష్టంగా కనిపించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో విపరీతంగా అమ్మకాలు నెలకొన్నాయి. అమెరికా, యూరప్‌, ఆసియాల్లో ప్రధాన మార్కెట్లు 4శాతం వరకు నష్టాన్ని చవిచూశాయి. దేశీయ పరిణామాల విషయానికొస్తే... ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 6నెలల కనిష్టష్టానికి చేరుకోవడం, నేడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసికపు జీడీపీ, గణాంకాలతో పాటు జనవరి నెల 8 కీలక మౌలిక రంగ గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లను నుంచి ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఉపసంహరణ తదితర కారణాలు మార్కెట్‌ పతనానికి కారణమయ్యాయి. పలితంగా మార్కెట్‌ ముగిసే సరికి సూచీలు తమ జీవితకాలపు అతిపెద్ద ఏడో నష్టాల ముగింపును చవిచూశాయి. ఈ వారం మొత్తం మీద నిఫ్టీ 627 పాయింట్లను, సెన్సెక్స్‌ 2065 పాయింట్లను కోల్పోయాయి. సూచీలు 2008 తరువాత ఒకవారంలో అతిపెద్ద నష్టాన్ని చూడటం ఇదే తొలిసారి కావడం విశేషం.

అన్ని రంగాలకు చెందిన ఇండెక్స్‌ నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా మెటల్‌ ఇండెక్స్‌ 7.50శాతం నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 3.25శాతం నష్టపోయి 29, 204 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ -50 ఇండెక్స్‌లో టాటామోటర్స్‌, టెక్‌ మహీంద్రా, హిందాల్కో, టాటా మోటర్స్‌, వేదాంత షేర్లు 8శాతం నుంచి 13.50శాతం నష్టాన్ని చవిచూశాయి. మరోవైపు మారుతి సుజుకీ, ఐఓసీ షేర్లు మాత్రమే 0.10శాతం నుంచి అరశాతం లాభంతో ముగిశాయి. 



You may be interested

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో పరిస్థితి ఏంటి..?

Saturday 29th February 2020

కరోనా వైరస్‌ స్టాక్‌ మార్కెట్లను వణికిస్తుంటే... సరిగ్గా ఇదే సమయంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ (ఎస్‌బీఐ కార్డ్‌) ఐపీవో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఎస్‌బీఐ కార్డ్‌ ఐపీవో పట్ల ఇన్వెస్టర్లలో ఎంతో ఆసక్తి, ఉత్సాహం నెలకొని ఉంది. భారీ సబ్‌స్క్రిప్షన్‌ వస్తుందని, 50 శాతానికి తక్కువ కాకుండా ప్రీమియంతో లిస్ట్‌ అవుతుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. కానీ, కరోనా వైరస్‌ ప్రభావంతో గత కొన్ని సెషన్లుగా మార్కెట్లలో

మార్కెట్‌ భారీ పతనానికి కారణలివే...!

Friday 28th February 2020

కరోనా వ్యాధి వ్యాప్తి ఉధృతి భయాలు ఈక్విటీ మార్కెట్లను వెంటాడంతో శుక్రవారం దేశీయ ఈక్విటీ మార్కెట్‌ భారీ పతనాన్ని చవిచూసింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా మిడ్‌సెషన్‌ కల్లా సెనెక్స్‌ 1342 పాయింట్లను కోల్పోయి 38,403.53, నిఫ్టీ 399 పాయింట్లు క్షీణించి 11,233.95 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకింది. సూచీలకిది వరుసగా ఆరోరోజూ నష్టాల ట్రేడింగ్‌ కావడం గమనార్హం. అంతర్జాతీయ వృద్ధి

Most from this category