News


సెన్సెక్స్‌ 400 పాయింట్లు క్రాష్‌..

Friday 19th July 2019
Markets_main1563520148.png-27173

ఆరంభ లాభాల్ని కోల్పోయిన సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తుడటంతో సూచీల పతనం కొనసాగుతుంది. ముఖ్యంగా అటో, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌రంగాలకు చెందిన షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. మిడ్‌ సెషన్‌ సమయానికి సెన్సెక్స్‌ 419 పాయింట్లు నష్టపోయి 38,478 వద్ద, నిఫ్టీ 131 పాయింట్లు క్షీణించి 11500 స్థాయిని కోల్పోయి 11,466.45 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులున్నప్పటికీ దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విక్రయాలు వెల్లువెత్తా‍యి. ఇప్పటికి వరకు క్యూ1 ఫలితాలను వెల్లడించిన పలు కార్పోరేట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు ఆర్థిక మందగమన ఆందోళలు, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ద్రవ్య కొరత కొనసాగుతుడటం తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే నిన్న(జూలై 18న) కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ఫైనాన్స్‌ బిల్లు అంశం జరిగిన చర్చలో ‘‘విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) 2019 బడ్జెట్‌లో ప్రకటించిన పెరిగిన సర్‌ ఛార్జిని చెల్లించకుండా ఉండటానికి తమను తాము ట్రస్టులుగా కాకుండా సంస్థలుగా నమోదు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎఫ్‌పీఐలు ట్రస్టీలుగానే నమోదు చేసుకున్నట్లయితే కొత్త టాక్స్‌ సర్‌ ఛార్జీలు చెల్లించక తప్పదని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున నిధులను ఉపసంహరించకునే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 12:00లకు సెన్సెక్స్‌ 418 పాయింట్ల నష్టంతో 38,478.89 వద్ద, నిఫ్టీ 131 పాయింట్లను నష్టపోయి 11,465 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. సూచీలకు ఈస్థాయిలు రెండు వారాల కనిష్టస్థాయి.

నిఫ్టీ -50 సూచీలలో ఎంఅండ్‌ఎం, టాటామోటర్స్‌, గెయిల్‌, బజాజ్‌ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌ షేర్లు 2.50శాతం నుంచి 5శాతం నష్టపోగా, జీ లిమిటెడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టీసీఎస్‌, టైటాన్‌, ఎన్‌పీసీ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం క్షీణించాయి. 



You may be interested

స్మాల్‌క్యాప్స్‌పై తప్పుగా అంచనా వేశా: పొరింజు వెలియత్‌

Friday 19th July 2019

ఎన్నికలు టర్నింగ్‌ పాయింట్‌గా భావించా. బడ్జెట్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రేట్‌ కట్‌ పాలసీలు, బడ్జెట్‌... స్మాల్‌ క్యాప్‌లను ఆదుకోలేకపోయాయి : పొరింజు వెలియత్‌ స్మాల్‌ క్యాప్‌లలో ఇన్వెస్ట్‌ చేసి ప్రస్తుత పరిస్థితులలో వీటిని అమ్మడానికి లేదా హోల్డ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్న వారు నాలుగు ముఖ్య విషయాలను గమనించాలని స్మాల్‌ క్యాప్‌ ఇన్వెస్టింగ్‌ నిపుణుడు పొరింజు వెలియత్‌ అన్నారు.  ఆయన పోర్ట్‌ఫోలియోలో ఇంకా కొన్ని అండర్‌ పెర్ఫార్మ్‌ స్టాకులున్నాయని తెలిపారు.   ఇవి గమనించాల్సి అవసరం ఉంది...    

పసిడి పైపైకి

Friday 19th July 2019

ప్రపంచమార్కెట్లో కొద్దిరోజుల క్రితం నమోదుచేసిన ఆరేళ్ల గరిష్టస్థాయి(1450 డాలర్లు)ని పసిడి ధర తొలిసారి అధిగమించింది. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత విధింపు అంచనాలు మరింత బలపడటంతో పాటు, తాజాగా పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి రావడంతో నేటి ఆసియా ట్రేడింగ్‌లో 26 డాలర్ల మేర లాభపడింది. ఆసియాలో ఉదయం సెషన్స్‌లో ఔన్స్‌ పసిడి ధర గత ముగింపు ధర(అమెరికాలో) 1428 డాలర్లలో పోలిస్తే 17డాలర్లు పెరిగి 1445 డాలర్ల వద్ద ట్రేడ్‌

Most from this category