News


అనూహ్య అమ్మకాలు: నష్టాల్లోకి సూచీలు

Friday 25th October 2019
Markets_main1571989348.png-29140

ఉదయం నుంచి రిలీఫ్‌ ర్యాలీ చేస్తున్న సూచీలు... మిడ్‌సెషన్‌ ఒక్కసారి మొదలైన అమ్మకాలతో అనూహ్యంగా నష్టాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లలతో పాటు బ్యాంకింగ్‌, ఫార్మా రంగ షేర్లల్లో ఒక్కసారి అమ్మకాలు నెలకొనడంతో సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రపంచ బ్యాంక్‌ తాజాగా ప్రకటించిన ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకుల్లో మన దేశం 63వ స్థానాన్ని సొంతం చేసుకోవడటంతో ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూలతలున్నా,  సూచీలు లాభాలతో మొదలయ్యాయి. మార్కెట్‌ ప్రభావితం చేసే అంశాలేవి లేకపోవడంతో మిడ్‌సెషన్‌ వరకు సూచీలు ర్యాలీ సజావుగా జరిగింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 221 పాయింట్లు పెరిగి 39,241.61 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 11,646.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. తదుపరి మార్కెట్లో నెలకొన్న అనూహ్య అమ్మకాలతో సూచీల లాభాలన్ని హరించుకుపోయాయి. మధ్యాహ్నం గం.1:00లకు సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(39,241.61) నుంచి 470 పాయింట్లును కోల్పోయి 38,801.04 వద్ద, నిఫ్టీ ఇంట్రాడే హై(11,647) నుంచి 137 పాయింట్ల నష్టంతో 11,517 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌, ఫార్మా, ఆర్థిక, అటో, ఎఫ్‌ఎంజీసీ షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. మరోవైపు ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, మీడియా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. 
హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్‌, యస్‌బ్యాంక్‌, టాటామోటర్స్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 2.50శాతం నుంచి 8శాతం నష్టపోయాయి. ఐఓసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, బీపీసీఎల్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

భారతీ ఇన్ఫ్రాటెల్‌ 10శాతం క్రాష్‌..!

Friday 25th October 2019

టవర్ల విలీన ప్రక్రియ వాయిదా ఎఫెక్ట్‌ భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లోకి ఇండస్ టవర్స్‌ను విలీనానికి మరి కొంతకాలం గడువును పొడిగించినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో భారతీ ఇన్‌ఫ్రాటెల్ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 10శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.240.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్న జరిగిన బోర్డు సమావేశంలో ఇండస్‌ టవర్స్‌ విలీన గడువును మరో 60రోజుల పాటు పొడిగించేందుకు కమిటీ డైరెక్టర్లు ఆమోదం తెలినట్లు భారతీ ఇన్ఫ్రాటెల్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం

మారుతీ సుజుకీ.. మరింత డౌన్‌సైడ్‌!

Friday 25th October 2019

బ్రోకరేజ్‌ల అంచనాలు సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు మారుతీ సుజుకీ షేరుపై పాత అభిప్రాయాన్నే కొనసాగిస్తున్నాయి. క్యు2లో కంపెనీ అనలిస్టుల అంచనాలకన్నా మిన్నగానే ఫలితాలు చూపింది. కానీ ఫలితాలు రికవరీని సూచించడం లేదంటూ చాలా బ్రోకరేజ్‌లు షేరుపై బేరిష్‌ అంచనాలనే కొనసాగిస్తున్నాయి.  - మారుతీపై యూబీఎస్‌ అమ్మొచ్చు రేటింగ్‌ ఇచ్చింది. టార్గెట్‌ ధరను రూ. 5700గా నిర్ణయించింది. తాజా ఫలితాలు అంచనాలను మించినా, వాల్యూషన్లు ఇంకా ఖరీదుగానే ఉన్నాయని తెలిపింది.  -

Most from this category