News


36,840 దిగువన డౌన్‌ట్రెండ్‌

Monday 11th February 2019
Markets_main1549868136.png-24131

  • మార్కెట్‌ పంచాంగం
  • 36,480 దిగువన డౌన్‌ట్రెండ్‌

నాలుగు నెలల నుంచి అవరోధం కల్పిస్తున్న సాంకేతిక స్థాయిల్ని గత వారం భారత్‌ సూచీలు విజయవంతంగా అధిగమించినప్పటికీ, అంతర్జాతీయ ట్రెండ్‌ బలహీనత కారణంగా  కేవలం రెండు రోజుల్లోనే మళ్లీ ఆ స్థాయిల్ని సెన్సెక్స్‌, నిఫ్టీలు వదులుకోవడం ఇన్వెస్టర్లను ఆందోళనపర్చే అంశం. యూరోజోన్‌ వృద్ధి మందగిస్తుందంటూ యూరోపియన్‌ యూనియన్‌ చేసిన హెచ్చరిక, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు సఫలంకావేమోనన్న భయాలు గత వారాంతంలో ప్రపంచ సూచీల అప్‌ట్రెండ్‌కు బ్రేక్‌వేశాయి. కొద్ది వారాలుగా విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా నికర కొనుగోళ్లు జరుపుతునప్పటికీ, అంతర్జాతీయ ఆందోళనలు, దేశీయంగా మరిన్ని కార్పొరేట్‌ గ్రూప్‌లు రుణాల చెల్లింపు డిఫాల్ట్‌అయ్యే సంకేతాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు సమీప భవిష్యత్తులో వ్యవహరించే శైలి మన మార్కెట్‌ ట్రెండ్‌కు కీలకం.  ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే,

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
ఫిబ్రవరి 8తో ముగిసిన వారంలో గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన తొలి మద్దతుస్థాయిని తగ్గిన తర్వాత వేగంగా పెరిగి లక్ష్యాన్ని బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చేరింది. కానీ లక్ష్యాన్ని చేరిన తర్వాత వేగవంతమైన పతనాన్ని చవిచూడటం సాం‍కేతికంగా ప్రతికూలాంశం. గత వారం తొలిరోజున  35,225 పాయింట్ల వరకూ పతనమైన వెంటనే వేగంగా కోలుకుని గురువారంనాటికి 37,172 పాయింట్ల స్థాయిని అందుకుంది. అటుతర్వాత మళ్లీ క్షీణించి,  చివరకు అంతక్రితంవారంకంటే 77 పాయింట్లు లాభపడి 36,546 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం 36,480 పాయింట్ల దిగువన గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమై, దిగువస్థాయిలోనే స్థిరపడితే 36,220 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌కు తొలి మద్దతు లభిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే  వేగంగా 35,740 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ రెండో మద్దతును కోల్పోయి, ముగిస్తే 35,565-35,380 పాయింట్ల శ్రేణి వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం తొలి మద్దతు పరిరక్షించుకోగలిగితే 36,885 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే మరోదఫా 37,050-37,200 పాయింట్ల శ్రేణిని పరీక్షించవచ్చు. అటుపై 37,500 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు.

నిఫ్టీ 10,925 దిగువన డౌన్‌ట్రెండ్‌
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ గత కాలమ్‌లో సూచించిన తక్షణ మద్దతుస్థాయి  10,814 పాయింట్ల వరకూ తగ్గిన తర్వాత క్రమేపీ పెరుగుతూ నాలుగు నెలల గరిష్టస్థాయి అయిన 11,118 పాయింట్ల వరకూ పెరిగింది. అయితే శుక్రవారం హఠాత్‌ పతనాన్ని చవిచూడటంతో లాభాల్లో చాలావరకూ కోల్పోయి, చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 50 పాయింట్ల లాభంతో 10,944 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం నిఫ్టీ 10,925 పాయింట్ల దిగువన ప్రారంభమై, ఆ లోపునే ముగిస్తే క్షీణత 10815 పాయింట్ల వరకూ కొనసాగవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 10,680 పాయింట్ల వరకూ తగ్గవచ్చు.  ఈ వారం నిఫ్టీ తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే 11,040 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపై మరోదఫా 11,120 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. అటుపైన 11,220 పాయింట్ల స్థాయిని నిఫ్టీ అందుకునే చాన్స్‌ వుంటుంది.You may be interested

విహార యాత్రకు సిప్‌

Monday 11th February 2019

ప్ర: నా వయస్సు 40 సంవత్సరాలు. నాకు బుద్ది మాంద్యం గల ఒక కొడుకున్నాడు. తన భవిష్యత్‌ అవసరాల నిమిత్తం  నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎలా ప్లాన్‌ చేసుకోవాలో సూచించండి? -అరవింద్‌, విశాఖపట్టణం జ: బుద్ది మాంద్యం గల బిడ్డ ఉంటే, ఆ బిడ్డ అవసరాల కోసం మీకు భవిష్యత్తులో భారీ మొత్తమే అవసరమవుతుంది. దీనికి గాను మీరు పెద్ద మొత్తంలోనే నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అందుకని వీలైనంత అధికంగా ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేయండి.

వేలానికి 23చమురు బ్లాక్‌లు

Monday 11th February 2019

ఓఏఎల్‌పీ మూడో విడత ప్రారంభం 700 మిలియన్ డాలర్ల పెట్టుబడుల అంచనా బిడ్డింగ్‌కు ఏప్రిల్ 10 గడువు  చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి గ్రేటర్ నోయిడా: ఓపెన్ ఎక్రేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద మూడో విడతలో కేంద్రం 23 చమురు, గ్యాస్, సీబీఎం బ్లాక్‌ల వేలం వేస్తోంది. దీనితో ఈ రంగంలోకి 600-700 మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు రావొచ్చని భావిస్తోంది. ఆదివారమిక్కడ పెట్రోటెక్ 2019 సదస్సులో ఓఏఎల్‌పీ మూడో రౌండును

Most from this category