News


11850 దిగువన ముగిసిన నిఫ్టీ

Wednesday 13th November 2019
Markets_main1573641446.png-29562

మిడ్‌సెషన్‌ నుంచి బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లలో అనూహ్య అమ్మకాలతో మార్కెట్‌ బుధవారం భారీ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 229 పాయింట్లు కోల్పోయి 40,116 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 73 పాయింట్లు నష్టపోయి 11850 దిగువున 11,840 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 574 పాయింట్లు నష్టపోయి 30,541 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,061.23 - 40,447.17 స్థాయిలో ‍కదలాడగా, నిఫ్టీ 11,823.20- 11,946.80 రేంజ్‌లో ట్రేడైంది. 

‘‘ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో స్టాక్‌మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. దీపావళి నాటి నుంచి మార్కెట్‌ అప్‌ట్రెండ్‌లో కొనసాగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఫ్రాఫిట్‌-బుకింగ్‌ను పూనుకున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ డౌన్‌ట్రెండ్‌ కొనసాగితే 11700 స్థాయిని కోల్పోయి 11,670 స్థాయి వద్ద కీలక మద్దతును తీసుకుంటుంది. అప్‌ట్రెండ్‌లో అయితే ఇండెక్స్‌ మరోసారి 12000 స్థాయిని పరీక్షిస్తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ విశ్లేషకులు రాకేష్‌ పాండే అభిప్రాయపడ్డారు. 

గ్రాసీం, అదానీ పోర్ట్స్‌, జీ లిమిటెడ్‌, గెయిల్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 3.50శాతం నుంచి 5.50శాతం వరకు నష్టపోయాయి. బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, నెస్లే ఇండియా, రిలయన్స్‌, టీసీఎస్‌, బ్రిటానియా షేర్లు 0.75శాతం నుంచి 5శాతం లాభపడ్డాయి. 



You may be interested

మూడు బ్యాంకులపై కోటక్‌ బుల్లిష్‌

Wednesday 13th November 2019

కోటక్‌ సెక్యూరిటీస్‌ మూడు ప్రైవేటు బ్యాంకులపై బుల్లిష్‌గా ఉంది. అవి ఐసీఐసీఐ బ్యాంకు, కరూర్‌వైశ్యా బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు. రానున్న కాలంలో వీటి ఆర్థిక పనితీరు బాగుంటుందని అంచనా వేస్తోంది. కోటక్‌ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ సంజీవ్‌ జర్బాడే ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇలా ఉంది.    మార్కెట్ల మూడ్‌  ఏ విధంగా ఉండనుంది? మందగమనం ఇంకా కొనసాగుతోంది. వినియోగ డిమాండ్‌ తగ్గుముఖం పట్టింది. అమ్మకాల వృద్ధిపై అందోళనలు ఉన్నాయి.

ఫండ్స్‌ కొన్న షేర్లివే!

Wednesday 13th November 2019

దేశీయ స్టాక్‌ ఫండ్లలోకి నిధుల ప్రవాహం వరుసగా రెండో నెల తగ్గుముఖం పట్టింది.  యాంఫీ గణాంకాలు ప్రకారం ఈ అక్టోబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి రూ.60.2 బిలియన్ల నిధులు వచ్చాయి. సెప్టెంబర్‌లో వచ్చిన నిధులతో పోలిస్తే ఇది 9శాతం తక్కువ. అలాగే మే తరువాత అతి తక్కువగా నిధుల వచ్చిన నెల అక్టోబరే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేశంలో టాప్‌-3 మ్యూచువల్‌ ఫండ్‌  హౌసింగ్‌లు ఏ షేర్లకు కొన్నాయా, వేటిని విక్రయించాయో ఇప్పుడు

Most from this category