STOCKS

News


సెన్సెక్స్‌ నష్టం 216 పాయింట్లు

Friday 22nd November 2019
Markets_main1574418884.png-29792

54పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
ఐటీ షేర్లకు రేటింగ్‌ షాక్‌

వారాంతపు చివరి రోజైన శుక్రవారం సూచీలు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 54పాయింట్లు నష్టంతో 11,914.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 216 పాయింట్లను కోల్పోయి 40359.41 వద్ద స్థిరపడింది. సూచీలకి వరుసగా ఇది రెండో రోజూ నష్టాల ముగింపు. ఐటీ రంగ షేర్ల భారీ పతనం, సూచీల గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం, ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకానమీ కో అపరేషన్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌(ఓఈసీడీ) సంస్థ ఈ ఏడాదికి దేశీయ ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్‌ను 5.8శాతానికి డౌన్‌గ్రేడ్‌ చేయడం తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.  ఒకదశలో సెన్సెక్స్‌ 279 పాయింట్లు నష్టపోయి 40,295.17 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల నష్టంతో 11,884.45 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఐటీ, ప్రైవేట్‌ బ్యాంక్‌, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రముఖ రేటింగ్‌ సంస్థ గోల్డ్‌మెన్‌ శాక్స్‌ ఐటీ రంగంపై రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ఈ రంగ షేర్లు ఎక్కువగా నష్టాలను చవిచూసాయి. ఈ రంగంలోని అధిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్లు 3-2.50శాతం పతనం సూచీలకు భారీ నష్టాలను కలుగజేసింది. మరోవైపు నష్టాల మార్కెట్లోనూ మెటల్‌ షేర్లు రాణించాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు సజావుగా జరుగుతుండటంతో మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అలాగే అటో, మీడియా, రియల్టీ రంగ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఇక వారం మొత్తంగా నిప్టీ ఇండెక్స్‌ 21 పాయింట్లు లాభపడగా, సెన్సెక్స్‌ మాత్రం 2 పాయింట్లు మాత్రమే పెరిగింది.

భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పేయింట్స్‌, టీసీఎస్‌, యూపీఎస్‌ల్‌ షేర్లు 4శాతం నుంచి 2శాతం వరకు నష్టపోయాయి. జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌, ఎన్‌టీపీసీ, జీ లిమిటెడ్‌, ఐషర్‌మోటర్స్‌, టాటా స్టీల్‌ షేర్లు 2.50శాతం నుంచి 4శాతం వరకు లాభపడ్డాయి.You may be interested

బీపీసీఎల్‌కు వేటిలో వాటాలు ఉన్నాయో తెలుసా?

Friday 22nd November 2019

ప్రభుత్వ రంగ చమురు కంపెనీ బీపీసీఎల్‌లో వాటాల విక్రయానికి కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం ఇందుకు తగిన ఇన్వెస్టర్‌ వేటలో ఉంది. కంపెనీ వాటా విక్రయానికి ముందు కంపెనీ అసెట్స్‌ను వేరు చేసే పనిలోఉంది. ఇందులో భాగంగా కంపెనీకి వివిధ జేవీల్లో ఉన్న వాటాలను మదింపు చేస్తోంది. పలు పీఎస్‌యూ చమురు కంపెనీల్లాగే బీపీసీఎల్‌కు అనేక క్రాస్‌ హోల్డింగ్స్‌ ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఇతర ఆదాయాలు దాదాపు 13- 28

ఫార్మా, వినియోగం, ఆటో రంగాలకు దూరం!

Friday 22nd November 2019

‘బ్యాంకింగ్‌ సెక్టార్‌లో మేం దృష్ఠి సారించిన ఒకేఒక లార్జ్‌క్యాప్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌’ అని యస్‌ సెక్యురిటీస్‌ జాయింట్‌ ఎండీ అండ్‌ సీఈఓ, ప్రశాంత్‌ ప్రభాకర్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో.. ఫార్మాకు దూరం..  సమీపకాలంలో ఫార్మా సెక్టార్‌కూ దూరంగా ఉండాలని సలహాయిస్తున్నాం.  దీనితో పాటు ఆటో, వినియోగ రంగాలకు దూరంగా ఉండడం మంచిది. ఫార్మా సెక్టార్‌లో  మార్జిన్‌ ఒత్తిళ్లు కాకుండా యూఎస్‌ ఎఫ్‌డీఏ నియంత్రణలు అతి

Most from this category