News


లాభాల్లోంచి నష్టాల్లోకి మళ్లిన మార్కెట్‌

Tuesday 5th November 2019
Markets_main1572940623.png-29365

  • 300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌
  • 11900 దిగువకు నిఫ్టీ

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఫార్మా, ఐటీ షేర్ల అ‍మ్మకాలు మొదలవడంతో మంగళవారం మిడ్‌సెషన్‌ మార్కెట్‌ నష్టాల్లోకి మళ్లింది. దీంతో ఏడు రోజుల లాభాలకు బ్రేక్‌ పడినట్లైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో నేడే మార్కెట్‌ పాజిటివ్‌గానే ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో కిత్రం రోజు రికార్డు స్థాయిని నమోదు చేసిన సెన్సెక్స్‌ నేడు మరో 164 పాయింట్లు లాభపడి 40,466.55 వద్ద, నిఫ్టీ సైతం 38 పాయింట్లు పెరిగి 11,978.95 వద్ద ఇంట్రాడే గరిష్టాలను చేశాయి. అనంతరం సూచీల గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఫార్మా, ఐటీ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం 40,466.55 నుంచి 333 పాయింట్లు క్షీణించి 40,056 వద్ద, నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం 11,979 నుంచి 101 పాయింట్లను  కోల్పోయి, 11,878 వద్దకు దిగజారాయి. మధ్యాహ్నం గం.1:00లకు సెన్సెక్స్‌ 213 పాయింట్ల నష్టంతో 40,088.51 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు నష్టంతో 11876 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, గ్రాసీం, సన్‌ఫార్మా, జీ లిమిటెడ్‌ షేర్లు 2శాతం నుంచి 4శాతం నష్టపోయాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫ్రాటెల్‌, యస్‌ బ్యాంక్‌, యూపీఎల్‌ షేర్లు 1శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. 



You may be interested

ఎంఎస్‌సీఐ నుంచి ఈ షేర్ల తొలగింపు?!

Tuesday 5th November 2019

రుణభారం ఎక్కువ ఉన్న కంపెనీలే టార్గెట్‌... బ్రోకరేజ్‌ల అంచనా ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌స్టాన్లీ కాపిటల్‌  ఇంటర్నేషనల్‌) సూచీ నుంచి భారీ రుణభారంతో సతమతమవుతున్న దేశీయ కంపెనీల షేర్లను ఈ వారంలో తొలగిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. బాగా అప్పులపాలై ఉన్న వొడాఫోన్‌ ఇండియా, ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా లాంటి షేర్లకు ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌ నుంచి ఉద్వాసన తప్పదని బ్రోకరేజ్‌లు అభిప్రాయపడుతున్నాయి. ఇలా రుణభారంతో సతమతమయ్యే కంపెనీల షేర్లు చాలా వరకు ఇటీవల

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ షేరుకు ఫలితాల షాక్‌

Tuesday 5th November 2019

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ షేరు మంగళవారం ట్రేడింగ్‌ సెషన్‌లో 6శాతం నష్టపోయింది. కంపెనీ ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటం షేరు నష్టానికి కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.115.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ ప్రకటించిన ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒక దశలో 6శాతం నష్టపోయి

Most from this category