News


నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌

Monday 10th February 2020
Markets_main1581307243.png-31639

  • అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు
  • సూచీలను దెబ్బతీసిన మెటల్‌ షేర్ల పతనం

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 50 పాయింట్ల నష్టంతో 41091.85 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 12083.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లకు తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లు అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. మెటల్‌ షేర్లు అత్యధికంగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ వృద్ధి భయాలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పతనం కావడంతో నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం నాటి ముగింపు(71.40)తో పోలిస్తే 6 పైసలు బలపడి 71.34 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం గం.9:20ని.లకు నిఫ్టీ 50 పాయింట్లను కోల్పోయి 12,045 వద్ద సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 40,998.15 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రైవేట్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ పావు శాతం నష్టంతో 31,121.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

చైనాలో కరోనా వైరస్‌ వ్యాధి తీవ్రత మరింత పెరిగింది. గతంలో సార్స్‌ అంటువ్యాధి సంభవించినపుడు నమోదైన మరణాల కంటే ఈసారి మరణాలు మరిన్ని ఎక్కువగా జరిగినట్లు చైనా అధికారిక గణాంకాలు తెలిపాయి. వైరస్‌ వ్యాధి భయాలతో లూనర్‌ సెలవులను పొడిగించిన కంపెనీలు నేడు తిరిగి నేడు చాలా తక్కువ సంఖ్యలో ప్రారంభమయ్యాయి. ఫలితంగా నేడు ఆసియా మార్కెట్లలో ప్రధాన మార్కెట్లన్ని నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక శుక్రవారంలో జనవరిలో ఉపాధి గణాంకాలు అంచనాలను మించినప్పటికీ ... వరుసగా గరిష్ట స్థాయిలను అందుకున్న తరుణంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే.  

టాటామోటర్స్‌, వేదాంత, ఎంఅండ్‌ఎం, జీ లిమిటెడ్‌, టాటా స్టీల్‌ షేర్లు 2శాతం నుంచి 4.50శాతం నష్టపోయాయి. వేదాంత, సిప్లా, ఇన్ఫ్రాటెల్‌, యస్‌ బ్యాంక్‌, యూపీఎల్‌ షేర్లు అరశాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. 
 



You may be interested

అవసరమైతే మరిన్ని బ్యాంకుల విలీనం

Monday 10th February 2020

5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి భారీ బ్యాంకుల తోడ్పాటు కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్య న్యూఢిల్లీ: అవసరమైన పక్షంలో మరిన్ని బ్యాంకులను విలీనం చేసే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యం సాకారమయ్యేందుకు.. కన్సాలిడేషన్ ద్వారా ఏర్పడే అంతర్జాతీయ స్థాయి బ్యాంకులు తోడ్పడగలవని ఆయన చెప్పారు. భారీ బ్యాంకులతో పెద్ద

రూ. 10వేల కోట్ల సమీకరణకు లైన్ క్లియర్‌

Monday 10th February 2020

(అప్‌డేటెడ్‌..) యస్ బ్యాంక్‌ ఈజీఎంలో షేర్‌హోల్డర్ల ఆమోదం న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్ తాజాగా రూ. 10,000 కోట్ల నిధులు సమీకరించేందుకు, అధీకృత షేర్ క్యాపిటల్‌ను రూ. 800 కోట్ల నుంచి రూ. 1,100 కోట్లకు పెంచుకునేందుకు మార్గం సుగమమైంది. బ్యాంక్ అసాధారణ సర్వసభ్య సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదనల ప్రకారం రూ. 2 ముఖవిలువ గల 450 కోట్ల ఈక్విటీ షేర్లతో రూ.

Most from this category