News


2 రోజుల నష్టాలకు చెక్‌- సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ

Tuesday 7th January 2020
Markets_main1578392552.png-30737

అన్ని రంగాలూ లాభాల్లోనే
మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ జోరు

ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. సెన్సెక్స్‌ 193 పాయింట్లు ఎగసి 40,869 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 60 పాయింట్లు బలపడి 12,053 వద్ద నిలిచింది. అమెరికా, ఆసియా మార్కెట్లు పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ గరిష్టంగా 41,230ను తాకింది. తదుపరి కొంతమేర మందగించి 40,727 వరకూ వెనకడుగు వేసింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 12,152 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకగా.. 12,005 వద్ద కనిష్టానికి చేరింది. యూరోపియన్‌ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నప్పటికీ దేశీ మార్కెట్లు చివర్లో కొంత దిగివచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

రియల్టీ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడగా.. రియల్టీ 2 శాతం ఎగసింది. మీడియా, మెటల్‌, ఫార్మా, బ్యాంక్‌ నిఫ్టీ 1-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో వేదాంతా, జీ, అల్ట్రాటెక్‌, యూపీఎల్‌, ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌ 3.7-1.4 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, ఇన్ఫోసిస్‌, ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌, టాటా మోటార్స్‌, నెస్లే, హీరో మోటో, ఓఎన్‌జీసీ 1.8-0.4 శాతం మధ్య నీరసించాయి.

సిమెంట్‌ ప్లస్‌లో
డెరివేటివ్‌ కౌంటర్లలో రామ్‌కో సిమెంట్‌, శ్రీ సిమెంట్‌, పీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, మైండ్‌ట్రీ, ఇండిగో, మదర్‌సన్‌, జీఎంఆర్‌ 5-2.7 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క బయోకాన్‌, ఎన్‌ఎండీసీ, హావెల్స్‌, కంకార్‌, టొరంట్‌ ఫార్మా, మెక్‌డోవెల్‌ 1.5-1 శాతం మధ్య క్షీణించాయి. 

చిన్న షేర్లు గుడ్‌
బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6-1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1560 లాభపడగా.. 927 నష్టాలతో ముగిశాయి. రియల్టీ కౌంటర్లలో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, సన్‌టెక్‌, ఇండియాబుల్స్‌, బ్రిగేడ్‌, డీఎల్‌ఎఫ్‌ 5-2 శాతం మధ్య ఎగశాయి.

స్వల్ప అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 104 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 24 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 1263 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 1029 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.You may be interested

ఆగని పెట్రోరంగ షేర్ల పతనం

Tuesday 7th January 2020

పెట్రో రంగ కంపెనీల షేర్ల వరుసగా పతనం మంగళవారం ట్రేడింగ్‌ సెషన్‌లోనూ కొనసాగింది. ఈ రంగానికి చెందిన బీపీఎసీల్, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ షేర్లు 2శాతం వరకు నష్టపోయాయి. ప్రపంచదేశాలకు ఎక్కువగా ముడిచమురును ఎగుమతి చేసే మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు గరిష్టస్థాయిల వద్దే ట్రేడ్‌ అవుతున్నాయి. పెరిగిన ముడిచమురు ధరల కారణంగా మార్జిన్లు క్షీణించవచ్చనే భయాందోళనలు దేశీయ ఆయిల్‌ కంపెనీలను వెంటాడాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో

2020లో సరికొత్త బుల్‌సైకిల్‌!

Tuesday 7th January 2020

నార్నొలియా అనలిస్టు శైలేంద్రకుమార్‌ కొత్త ఏడాది ఎర్నింగ్స్‌ దన్నుతో ఈక్విటీల్లో కొత్త బుల్‌సైకిల్‌ ఆరంభమవుతుందని నార్నొలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ అనలిస్టు శైలేంద్ర కుమార్‌ అంచనా వేశారు. 2013-17 కాలంలో వేగవంతమైన ర్యాలీ జరిపిన సూచీలు తర్వాత రెండేళ్లు కన్సాలిడేషన్‌ మూడ్‌లోకి మారాయన్నారు. గతేడాది సూచీల్లో 12 శాతం పెరుగుదల ఉన్నా, విస్తృత మార్కెట్‌ భాగస్వామ్యం లోపించిందన్నారు. చాలా స్టాకులు 2017 గరిష్ఠాలకు చాలా దిగువన ట్రేడవుతున్నాయన్నారు. కొత్త ఏడాది ఇవన్నీ పుంజుకుంటాయని,

Most from this category