News


కరోనాకు చెక్‌- సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ

Wednesday 29th January 2020
Markets_main1580294466.png-31310

41,200కు చేరిన సెన్సెక్స్‌ 
74 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 

ఎట్టకేలకు కరోనా భయాలకు చెక్‌ పడింది. యాపిల్‌ అండతో మంగళవారం అమెరికా మార్కెట్లు లాభపడగా..  బడ్జెట్‌పై ఆశలతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ చేసింది. వెరసి మళ్లీ 41,000 స్థాయిని అధిగమించింది. 232 పాయింట్లు పెరిగి 41,199 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 74 పాయింట్లు జమ చేసుకుని 12,130 వద్ద స్థిరపడింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో మార్కెట్లు రోజంతా హుషారుగా కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,335 వరకూ ఎగసింది. ఒక దశలో 41,108 వద్ద కనిష్టానికి చేరింది. ఈ బాటలో నిఫ్టీ 12,170- 12,104 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. గత రెండు రోజులుగా కరోనా వైరస్‌ భయాలతో మార్కెట్లు పతనమైన కారణంగా ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌కు దిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది కూడా మార్కెట్లు బలపడేందుకు సహకరించినట్లు తెలియజేశారు.

ఫార్మా ఒక్కటే
ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ పుంజుకోగా.. ఫార్మా నామమాత్ర నష్టంతో నిలిచింది. ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఆటో, రియల్టీ, బ్యాంక్స్‌ 1.3-0.4 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, నెస్లే ఇండియా, ఐటీసీ, అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌ 7-1.6 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఐషర్‌ మోటార్స్‌ 4.5 శాతం పతనంకాగా.. యస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్‌, టైటన్‌, సిప్లా, గ్రాసిమ్‌, సన్‌ ఫార్మా 1.5-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ అప్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో టాటా మోటార్స్‌ డీవీఆర్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎస్కార్ట్స్‌, పిడిలైట్‌, మారికో, బీహెచ్‌ఈఎల్‌ 5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోవైపు రామ్‌కో సిమెంట్‌, ఎన్‌ఐఐటీ టెక్‌, మెక్‌డోవెల్‌, డిష్‌ టీవీ, గోద్రెజ్‌ సీపీ, ఐడియా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 5-1.5 శాతం మధ్య నష్టపోయాయి. కాగా.. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.5 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1290 లాభపడగా.. 1219 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు)  దాదాపు రూ. 1358 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 712 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 439 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు నామమాత్రంగా రూ. 10.5 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే.  
 



You may be interested

అబ్బో!  తయారీ కంపెనీలకు ఇన్ని అనుమతులా?

Wednesday 29th January 2020

తయారీ కంపెనీలకు 2 వేల అనుమతులు  ఫిక్కీ అధ్యయనం న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా కంపెనీ లేదా ఫ్యాక్టరీని నెలకొల్పాలంటే అనేక నిబంధనలకు లోబడి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో 1,984 నిబంధనలు అధిగమించాల్సి ఉంటుందని  ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎఫ్‌ఐసీసీఐ) జరిపిన అధ్యయనం వెల్లడించింది. దాదాపు రెండు వేల వరకు ఉన్న ఈ నిబంధనలను అనుసరించి కొత్త తయారీ కంపెనీని ప్రారంభించాలంటే అధిక

అంచనాలు దాటిన బజాజ్‌ ఫైనాన్స్‌

Wednesday 29th January 2020

డిసెంబర్‌ త్రైమాసికానికి బజాజ్‌ ఫైనాన్స్‌ లాభం 52 శాతం పెరిగి రూ. 1614కోట్లకు చేరింది. బలమైన ఎన్‌ఐఐ, ఏయూఎంతో కంపెనీ మంచి లాభాలు చూపింది. ఈ సమయంలో నికర వడ్డీ ఆదాయం 42 శాతం దూసుకుపోయి రూ. 4537కు చేరింది. కొత్త లోన్స్‌లో వృద్ధి 13 శాతంగా నమోదయింది. కస్టమర్‌ ఫ్రాంచైజీ 24 శాతం మేర పెరిగినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ లాభం రూ. 1523 కోట్లుంటుందని, ఎన్‌ఐఐ రూ.

Most from this category