STOCKS

News


సెన్సెక్స్‌ డబుల్‌- ఈ 4 మిడ్‌క్యాప్స్‌.. కేక

Thursday 2nd January 2020
Markets_main1577947427.png-30614

నిఫ్టీ హాఫ్‌ సెంచరీ
కొత్త ఏడాదిలో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి వీలుగా ఈ నెల 15కల్లా ప్రాథమిక దశ ఒప్పందం కుదరనున్న వార్తలు ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పైనా అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేశారు. దీంతో ఉదయం 11.45 ప్రాంతంలో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ చేయగా.. నిఫ్టీ సైతం హాఫ్‌ సెంచరీ చేసింది. 207 పాయింట్లు ఎగసి 41,513కు చేరగా..నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 12,246 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో పలు మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. జాబితాలో అపోలో హాస్పిటల్స్‌, క్లారియంట్‌ కెమికల్స్‌, అపోలో పైప్స్‌, ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం...

అపోలో హాస్పిటల్స్‌
అపోలో మ్యూనిచ్‌ హెల్త్‌ కంపెనీలో 51.2 శాతం వాటా విక్రయానికి సీసీఐ, ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏల నుంచి అనుమతి లభించినట్లు పేర్కొనడంతో అపోలో హాస్పిటల్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అపోలో హాస్పిటల్స్‌ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 1494 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1503ను సైతం అధిగమించింది. అపోలో మ్యూనిచ్‌లో వాటాను హెచ్‌డీఎఫ్‌సీకి బదిలీ చేసేందుకు నియంత్రణ సంస్థలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు అపోలో హాస్పిటల్స్‌ తెలియజేసింది. 

క్లారియంట్‌ కెమికల్స్‌
సహచర కంపెనీ క్లారియంట్‌ ఇండియాకు ఎడిటివ్స్‌ బిజినెస్‌ను విక్రయించినట్లు తెలియజేసిన నేపథ్యంలో క్లారియంట్‌ కెమికల్స్‌ షేరు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో క్లారియంట్‌ కెమికల్స్‌ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 399 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 402ను సైతం అధిగమించింది. స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ క్లారియంట్‌లో ప్రమోటర్లకు 51 శాతం వాటా ఉంది.

అపోలో పైప్స్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో అమ్మకాలు 15 శాతం పెరిగి 10,712 ఎంటీపీఏను తాకినట్లు అపోలో పైప్స్‌ తాజాగా వెల్లడించింది. ఫిటింగ్స్‌ తదితర విలువ జోడింపు విభాగంసహా వివిధ ప్రొడక్టుల విక్రయాలు ఇందుకు సహకరించినట్లు తెలియజేసింది. భవిష్యత్‌లోనూ ఈ ధోరణి కొనసాగనున్నట్లు అంచనా వేసింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అపోలో పైప్స్‌ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 363 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 368 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రమోటర్లకు 47.11% వాటా ఉంది.

ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌
ఐదేళ్లపాటు ఏడాదికి 1.69 ఎంటీ చొప్పున బొగ్గు సరఫరాలకు వీలుగా దీర్ఘకాలిక కోల్‌ లింకేజీలను పొందినట్లు వెల్లడించిన నేపథ్యంలో ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ షేరు దాదాపు 11 శాతం దూసుకెళ్లి రూ. 56 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 58ను సైతం అధిగమించింది.You may be interested

2020లో నిఫ్టీ@ 14, 400!

Thursday 2nd January 2020

బ్రోకరేజ్‌ల అంచనా దేశీయ సూచీలు 2019ని 12- 14 శాతం లాభాలతో ముగించాయి. ఇదే జోరు కొత్త ఏడాదిలో కూడా కొనసాగుతుందని, నిఫ్టీ 2020లో 14400 పాయింట్లను చేరుతుందని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. నిఫ్టీ 2019 ముగింపుతో పోలిస్తే దాదాపు 18 శాతం మేర కొత్త ఏడాది లాభపడవచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. నిఫ్టీ ప్రస్తుతం కీలకమైన టార్గెట్‌ 12300ను తాకిందని, ఈ దశలో కొంత వెనకంజ వేసి 11900-

ట్రేడ్‌ డీల్‌ ఎఫెక్ట్‌: మెటల్‌ షేర్ల మెరుపులు

Thursday 2nd January 2020

17శాతం పెరిగి హిందూస్థాన్‌ కాపర్‌ షేరు అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య ఒప్పందం పురోగతి సాధిస్తుందనే అంచనాలో గురువారం మార్కెట్లో మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. ఏడాదిన్నరగా చైనాతో సాగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అడుగులు వేస్తుందని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. అందులో ఇటీవల చైనాతో కుదుర్చుకున్న తొలిదశ వాణిజ్య

Most from this category