News


మార్కెట్‌కు ‘‘ఇన్ఫీ’’ నష్టాలు

Tuesday 22nd October 2019
Markets_main1571741295.png-29061

  • 39000 దిగువన సెన్సెక్స్‌ 
  • 11600 కింద ముగిసిన నిఫ్టీ
  • 16.50శాతం నష్టపోయిన ఇన్ఫోసిస్‌ షేర్లు

మార్కెట్‌ ఆరురోజుల ర్యాలీకి ఇన్ఫోసిస్‌ షేర్ల భారీ పతనం అడ్డుపడింది. కంపెనీ యాజమాన్యం ఆదాయం, లాభాలను పెంచి చూపుతుందని విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి రావడంతో నేడు ఇన్ఫోసిస్‌ 16.50శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌ షేర్ల క్షీణత సూచీల భారీ నష్టాలకు కారణమైంది. అలాగే బ్రెగ్జిట్ ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను కొంతమేర దెబ్బతీసింది. ఫలితంగా మార్కెట్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 334 పాయింట్లను కోల్పోయి 39000 దిగువున 38,964 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 116000 దిగువున 11,590 వద్ద ముగిసింది. ఐటీ, మెటల్‌, అటో, మీడియా షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి.మరోవైపు బ్యాంకింగ్‌, ఫార్మా, ఆర్థిక, ఎఫ్‌ఎంజీసీ, రియల్టీరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 296 పాయింట్లు(1.02శాతం) పెరిగి 29,416.35 వద్ద స్థిరపడింది. మూడు రోజుల వరుస సెలవుల అనంతరం నేడు మార్కెట్‌ స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. స్వల్ప కాలంలో మార్జిన్‌లు, లాభాలను పెంచుకోడానికి అనైతిక విధానాలను అనుసరిస్తోందని ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా, కొంత మంది ఉద్యోగులు యుఎస్‌ సెక్యురిటీ ఎక్సెంజ్‌కి, ఇన్ఫోసిస్‌ బోర్డుకు లేఖలు రాయడంతో నేడు మార్కెట్‌ ప్రారంభంలోనే ఇన్ఫోసిస్‌ షేర్లు 10శాతం నష్టపోయాయి. ఇండెక్స్‌లో అధిక మిగతా అధిక షేర్లైన ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌ బ్యాంక్‌ షేర్లతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ర్యాలీ సూచీల భారీగా పతనం కాకుండా అడ్డుకున్నాయి. మిడ్‌సెషన్‌ వరకు పరిమితి నష్టాల్లో ట్రేడైన సూచీలు అనంతరం నెలకొన్న అమ్మకాల ఒత్తిడికి లోనవడం, బ్రెగ్జిట్‌ అనిశ్చితితో యూరప్‌ మార్కెట్ల మిశ్రమ ప్రారంభం కావడంతో సూచీలకు భారీ పతనం తప్పలేదు. ఒకదశలో నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 11,573.65 వద్ద, నిఫ్టీ 373 పాయింట్లు నష్టపోయి 39,298 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసింది.
నిఫ్టీ నష్టంలో ఇన్ఫోసిస్‌ వాటానే 89 పాయింట్లు:- 
విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదుతో 6ఏళ్లలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసిన ఇన్ఫోసిస్‌ షేర్లు ఇండెక్స్‌ల భారీ నష్టానికి బాసటగా నిలిచాయి. ఐటీ రంగంలో మిడ్‌క్యాప్‌ సంస్థైన ఇన్ఫోసిన్‌ షేర్ల పతనంతో నేడు రూ.5వేల కోట్లపైగా మార్కెట్‌ క్యాప్‌ను కోల్పోయి ఉంటుందని విశ్లేషకుల అంచనా. సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌ షేర్ల భారీ క్షీణత(16.30 శాతం) ఇండెక్స్‌ల పతనాన్ని శాసించింది. నేడు నిఫ్టీ పాయింట్ల పతనంలో ఒక్క ఇన్ఫోసిస్‌ షేర్ల వాటా 89 పాయింట్లు కాగా, మరోవైపు రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు ఇండెక్స్‌కు 18 పాయింట్ల వరకూ చేర్చడం వల్ల మొత్తంగా నిఫ్టీ నష్టం...ఇన్ఫోసిస్‌ నష్టపర్చిన పాయింట్ల కంటే తక్కువ వుంది. సెన్సెక్స్‌  నష్టంలో ఒక్క ఇన్ఫోసిస్‌ షేర్ల వాటా 355.77 పాయింట్లు కావడం గమనార్హం. సెన్సెక్స్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీలు దాదాపు 180 పాయింట్లు లాభం చేకూర్చడంతో ఇన్ఫోసిస్‌ నష్టపర్చిన పాయింట్లతో పోలిస్తే సెన్సెక్స్‌ మొత్తం నష్టం తక్కువగా నమోదయ్యింది. 
హెచ్‌సీఎల్‌, భారతీఎయిర్‌టెల్‌, బజాజ్‌ఫైనాన్స్‌ సర్వీసెస్‌, టాటామోటర్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 3శాతం నుంచి 16.65శాతం వరకు నష్టపోయాయి.  సిప్లా, టైటాన్‌, బీపీసీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

స్వల్పకాలంలో ఇన్ఫోసిస్‌ డీరేటింగ్‌

Tuesday 22nd October 2019

-ప్రస్తుత పరిస్థితులు తేలే వరకు దూరంగా ఉండండి: హెమాంగ్‌ జానీ, షేర్‌ఖాన్‌ ‘కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడంతో మొత్తంగా పీఎస్‌యూ స్టాకులపై సానుకూలత పెరిగింది. బీపీసీఎల్‌ పై 30శాతం నుంచి 50 శాతం ప్రీమియం ఇవ్వడానికి ఏ ఇన్వెస్టరు వెనకడుగేయడంలేదు’ అని షేర్‌ఖాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హెమాంగ్‌ జానీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ప్రీమియమైనా ఓకే..    ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడంతో పీఎస్‌యూ స్టాకులు

పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం: ఇన్ఫీ చైర్మన్‌

Tuesday 22nd October 2019

 స్వల్పకాలానికి గాను కంపెనీ మార్జిన్‌లు, లాభాలు పెరగడం కోసం ఇన్ఫోసిస్‌ అనైతిక విధానాలను అనుసరిస్తోందని గుర్తుతెలియని ఉద్యోగుల గ్రూప్‌ యుఎస్‌ నియంత్రణ, ఎక్సేంజ్‌కు, ఇన్ఫోసిస్‌ బోర్డుకు ఫీర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నీలకేని స్పందించారు. ఇన్ఫోసిస్‌పై వచ్చిన విజిల్‌ బ్లోవర్‌(కంపెనీపై ఆరోపణలు చేసేవారు) ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని స్టాక్‌ ఎక్సేంజికిచ్చిన సమాచారంలో నందన్‌ నీలకేని పేర్కొన్నారు. కాగా ఇన్ఫోసిస్‌ సీఈఓ పరేఖ్‌, సీఎఫ్‌ఓ

Most from this category