News


సెన్సెక్స్‌ 807 పాయింట్లు క్రాష్‌

Monday 24th February 2020
Markets_main1582540121.png-32048

  • 242 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • మరోసారి ఈక్విటీ మార్కెట్లను ముంచిన కరోనా వైరస్‌ భయాలు
  • ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లల్లో కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలు మరోసారి తెరపైకి సోమవారం దేశీయ మార్కెట్‌ భారీ నష్టాలను మూటగట్టుకుంది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ ఏకంగా 807 పాయింట్లను కోల్పోయి 40,363 వద్ద, నిఫ్టీ 242 పాయింట్ల నష్టంతో 11850 దిగువన 11,838 వద్ద ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు 2శాతం పతనమయ్యాయి. దక్షిణ కొరియాలో కరోనా వైరస్‌ అంటువ్యాధి సోకిన వారి సంఖ్య 700పైగా నమోదుకాగా, మృతుల సం‍ఖ్య ఏడుకి చేరుకోవడంతో ఈ దేశంలో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించారు. యూరప్‌ ఖండంలోనూ ఈ వ్యాధి శరవేగంగా వ్యాప్తిచెందింది. గతవారం చివరరోజున ఇటలీలో 3గ్గురికి మాత్రమే సోకిన కరోనా వైరస్‌ వ్యాధి సోమవారం అనూహ్యంగా 150 మందికి చేరినట్లు ఈ దేశవ్యాధికారులు ప్రకటించడంతో ప్రపంచమార్కెట్లో వృద్ధి మందగమన భయాలు తలెత్తాయి. ఈ వారంలో చివరి రోజున వెలువడనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక జీడీపీ గణాంకాలు అంచనాల కన్నా తక్కువగా నమోదు కావచ్చనే అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. అంతర్జాతీయ వృద్ధి భయాలతో అత్యధికంగా మెటల్‌ షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 5.50శాతం పతనమైంది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 3.50శాతం నిఫ్టీ అటో ఇండెక్స్‌ 3శాతం క్షీణించాయి. బ్యాంకింగ్‌రంగ షేర్ల పతనంతో బ్యాంక్‌నిఫ్టీ ఇండెక్స్‌ 1.50శాతం క్షీణించింది. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ సైతం 2శాతం, నిఫ్టీ ఎమ్‌ఎంజీసీ ఇండెక్స్‌ 1.50శాతం నష్టంతో ముగిశాయి.

నిఫ్టీ -50 ఇండెక్స్‌లో టాటామోటర్స్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, వేదాంత, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ షేర్ల 5శాతం నుంచి 7.50శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని  ఏ ఒక్క షేరు కూడా లాభపడకపోవడం గమనార్హం. 



You may be interested

కరోనా ప్రభావంతో నిఫ్టీ కంపెనీల లాభాలు 3-5 శాతం తగ్గొచ్చు

Monday 24th February 2020

ఫార్మా రంగం ఆకర్షణీయం దివీస్‌, ఆర్తి లబ్ది పొందవచ్చు ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ రంగం ఓకే - మోతీలాల్‌ ఓస్వాల్‌ పీఎంఎస్‌ కరోనా వైరస్‌ సంక్షోభాన్ని అప్పుడే పూర్తిగా అంచనా వేయలేమంటున్నారు మనీష్‌ సొంతాలియా, సీఈవో మోతీలాల్‌ ఓస్వాల్‌  పీఎంఎస్‌. మార్కెట్లు, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ రంగం, కరోనా వైరస్‌ తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. ప్రపంచ మార్కెట్లపై కరోనా వైరస్‌ అత్యధిక ప్రభావాన్ని చూపే అవకాశముంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లు

కునాల్‌ బోత్రా నుంచి 3స్టాక్‌ సిఫార్సులు

Monday 24th February 2020

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం సెన్సెక్స్‌ ఏకంగా 807 పాయింట్లను కోల్పోయి 40,363 వద్ద, నిఫ్టీ 242 పాయింట్ల నష్టంతో 11850 దిగువున 11,838 వద్ద ముగిశాయి. ఈ నేపథ్యంలో  ప్రముఖ మార్కెట్‌ అనలిస్ట్‌ కునాల్‌ బోత్రా ట్రేడింగ్‌ పరంగా మూడు స్టాక్స్‌ను ఆయన సూచించారు. అందులో ఎస్‌బీఐ, మణప్పురం షేర్లను కొనమని సిఫార్సు చేస్తూ, ఎస్‌ఆర్‌ఎఫ్‌ షేరును విక్రయించమని సలహానిచ్చారు. ఇప్పుడు ఆయా షేర్లపై బోత్రా సంపూర్ణ విశ్లేషణలు

Most from this category