News


సెన్సెక్స్‌ 450 పాయింట్లు క్రాష్‌

Thursday 1st August 2019
Markets_main1564638349.png-27468

మార్కెట్లో గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో అమ్మకాలు వెల్లువలా సాగుతున్నాయి. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత విధింపు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడం, నిన్న వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన జూన్‌ మాసపు ఎనిమిది కీలక రంగాల పనితీరు గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం, రూపాయి బలహీనత తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నాయి. సెన్సెక్స్‌ 450 పాయింట్లు క్షీణించి 37,046.39 వద్ద, నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 10,983.80 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిలను తాకాయి. అన్నిరంగాలకు చెందిన షేర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మెటల్‌, ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉదయం గం.11:00లకు నిఫ్టీ 89.55 పాయింట్ల నష్టంతో 10,995.85 వద్ద, సెన్సెక్స్‌ 405 పాయింట్లను కోల్పోయి 37,075 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

కరుగుతున్న మెటల్‌ షేర్లు..

Thursday 1st August 2019

వడ్డీ రేట్ల కొత కొనసాగదని ఫెడ్‌ స్పష్టం చేయడంతో దేశియ ఈక్విటీ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం 11.05 సమయానికి 2.70 శాతం నష్టపోయి 2,518.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో జిందాల్‌ స్టీల్‌ 4.55 శాతం, వేదాంత లి. 4.54 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ లి. 3.78 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 3.26, సెయిల్‌ 2.46  శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌

మల్టీ కెమెరా స్మార్ట్‌ఫోన్ల హవా..

Thursday 1st August 2019

కెమెరాకే కస్టమర్ల తొలి ప్రాధాన్యత పాప్‌-అప్‌ మోడళ్లకు డిమాండ్‌ సామాజిక మాధ్యమాల ప్రభావం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- మంచి కెమెరా, పెద్ద స్క్రీన్, అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ, ర్యామ్‌.. ఇవీ ఇటీవలి కాలం వరకు స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్ల తొలి ప్రాధాన్యతలు. ఇప్పుడీ ట్రెండ్‌ మారిపోయింది. సామాజిక మాధ్యమాల పుణ్యమాని అత్యాధునిక పాప్‌-అప్‌, మల్టీ కెమెరా స్మార్ట్‌ఫోనే వినియోగదారుల ఏకైక డిమాండ్‌గా నిలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేవైపు నాలుగు కెమెరాలున్న

Most from this category