News


ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Friday 7th February 2020
Markets_main1581048042.png-31586

  • ఆసియా మార్కెట్లను నుంచి మిశ్రమ సంకేతాలు
  • పెరిగిన క్రూడాయిల్‌ ధరలు 
  •  నీరసంగా ప్రారంభమైన రూపాయి 

ఆర్‌బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు లేకుంగా యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటన నేపథ్యంలో దేశీయ మార్కెట్‌ శుక్రవారం ఫ్లాట్‌గా మొదలైంది. సెన్సెక్స్‌ 50 పాయింట్ల నష్టంతో 41256.03 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లను కోల్పోయి 12127.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదలతో పాటు కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలతో నేడు ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌ దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.  డాలర్‌ మారకంలో రూపాయి విలువ 7పైసలు బలహీనంగా ప్రారంభం కావడంతో ఐటీ షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభిస్తుంది. అలాగే ఎఫ్‌ఎంజీసీ షేర్లకు కూడా స్వల్పంగా లాభపడ్డాయి. ఇక మిగతా అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు నష్టపోతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం నష్టపోయి 31,153.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌, టాటా మోటర్స్‌, ఐషర్‌ మోటర్స్‌ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి.  టైటాన్‌, యూపీఎల్‌, జీ లిమిటెడ్‌, ఎన్‌టీపీసీ, హీరో మోటో కార్ప్‌ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. 



You may be interested

స్వల్పంగా పెరిగిన పుత్తడి

Friday 7th February 2020

 శుక్రవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో నిన్నటితో పోలిస్తే రూ. రూ.100పెరిగి 10 గ్రాముల బంగారం ధర రూ.40,426.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో 4డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,570 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (గురువారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)  

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Friday 7th February 2020

బ్రిటానియా ఇండస్ట్రీస్, కార్పోరేషన్‌ బ్యాంక్, ఇమామి, 3ఐ ఇన్ఫోటెక్, 63 హనిమూన్‌ టెక్నాలజీస్, ఏసీసీ, ఏడీఎఫ్‌ ఫుడ్స్, ఆల్కేమ్‌ ల్యాబ్స్, ఆశోకా బిల్డ్‌కాన్,  అబాట్‌ ఇండియా, ఎన్‌సీసీ, ఎన్‌టీపీసీ, కంటైనర్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌, వర్లఫూల్‌ ఆఫ్‌ ఇండియా, వోల్టాస్‌, ఒబెరాయ్‌ రియల్టీ, కేర్‌ రేటింగ్స్‌, ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌, ఐనాక్స్, ఎక్సెల్‌ ఇండస్ట్రీస్‌, వెంకీస్‌, మహానగర్‌ గ్యాస్‌, అపెక్స్‌ ప్రోజన్‌ ఫుడ్స్‌,

Most from this category