సెన్సెక్స్ నష్టం 463 పాయింట్లు
By Sakshi

ఫెడ్ రిజర్వ్ పావుశాతం వడ్డీరేట్ల కోత మార్కెట్ వర్గాలను మెప్పించకపోవడంతో గురువారం స్టాక్ సూచీలు భారీ నష్టంతో ముగిసాయి. సెన్సెక్స్ 463 పాయింట్లు నష్టపోయి 37,018.32 వద్ద, నిఫ్టీ 138 పాయింట్లను కోల్పోయి 10,980 వద్ద స్థిరపడ్డాయి. నిన్నరాత్రి అమెరికా దాదాపు 11ఏళ్ల తరువాత కీలక వడ్డీరేట్లపై పావు శాతం తగ్గించింది. అనంతరం రేట్ల కోతపై ఛైర్మన్ పావెల్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుత కోత తగ్గింపు తదుపరి రోజుల్లో కొనసాగకపోవచ్చు’’ అని వాఖ్యానించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సెంటిమెంట్ బలహీనపడింది. ఫలితంగా నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగియగా, నేడు ఆసియా మార్కెట్లు సైతం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అక్కడి నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ నేడు నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 37,330 పాయింట్ల వద్ద, నిఫ్టీ 60 పాయింట్లను కోల్పోయి 11,060 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో దేశీయ బలహీన పరిణామాలు సూచీలు తీవ్ర నష్టాల్లోకి నెట్టాయి. నిన్న వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన జూన్ మాసపు ఎనిమిది కీలక రంగాల పనితీరు గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడం, ఇంట్రాడేలో డాలర్ మారకంలో రూపాయి 5వారాల కనిష్టానికి పతనమవడం, ఈ ఆర్థిక సంవత్సరంలో క్యూ1(ఏప్రిల్-జూన్)లో కాలంలో దేశీయ టాక్స్ వసూళ్లు 10ఏళ్ల కనిష్టస్థాయిలో నమోదుకావడం, నేడు పలు అటో కంపెనీలు వెల్లడించిన జూలై మాసపు విక్రయ గణాంకాలు నిరుత్సాహపరడటం, నెలరోజుల నుంచి ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటంతో పాటు ఇటీవల పలు కంపెనీలు ప్రకటించిన క్యూ1 ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం తదితర అంశాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. పలితంగా ఒకదశలో నిఫ్టీ 237 పాయింట్లు నష్టపోయి 10,881.00 స్థాయికి పతనమైంది. సెన్సెక్స్ 787 పాయింట్లను కోల్పోయి 36,694.18 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. కనిష్ట స్థాయిలో షార్ట్ కవరింగ్ జరగడంతో సూచీలు కొంతమేర నష్టాలను పూడ్చుకోగలిగాయి. ఇంట్రాడేలో ఒక్క అటో ఇండెక్స్ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. అత్యధికంగా మెటల్ షేర్లు నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 424 పాయింట్లను కోల్పోయి 28,367.25 వద్ద స్థిరపడింది.
హిందాల్కో, టాటామోటర్స్, ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యూస్టీల్, వేదాంత షేర్లు 4శాతం నుంచి 5.50శాతం నష్టపోగా, రిలయన్స్, పవర్‌గ్రిడ్, ఇన్ఫ్రాటెల్, విప్రో, మారుతి షేర్లు 1.50శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి.
You may be interested
మూడో రోజూ ‘ఫ్రీజ్’ అయిన కాపీ డే
Thursday 1st August 2019కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి.సిద్ధార్థ అదృశ్యం, అటుపిమ్మట ఆత్మహత్య చేసినట్లు తర్వాత కాఫీ డే షేర్లు భారీగా పడిపోతున్నాయి. గత సెషన్లో 20 శాతం పతనమై డౌన్ సర్య్కూట్ ఫ్రీజ్ అయిన ఈ షేరు, గురువారం ట్రేడింగ్‌లో కూడా భారీగా పడిపోయింది. తాజాగా స్టాక్ ఎక్సెంజీలు కాఫీ డే షేరు డౌన్ సర్య్కూట్ ఫ్రీజ్ పరిమితిని 10 శాతానికి తగ్గించడంతో ఈ కంపెనీ షేరు విలువ గురువారం ట్రేడింగ్‌లో 10
4.5 % పతనమయిన ఎస్బీఐ
Thursday 1st August 2019ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో భారీగా అమ్మకాలకు గురయ్యాయి. నీఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ మధ్యాహ్నం 3.18 సమయానికి 2.37 శాతం నష్టపోయింది. డిపాజిటరీ వడ్టీ రేట్లను తగ్గించిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరువిలువ వరుస సెషన్లలో పడిపోయింది. గురువారం మధ్యాహ్నం 3.21 సమయానికి ఎస్బీఐ షేరు 4.59 శాతం నష్టపోయి రూ. 316.95 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు ఈ రోజు ట్రేడింగ్‌లో రూ.330.80