News


ఆగని పతనం ..!

Monday 23rd March 2020
Markets_main1584943796.png-32631

మార్కెట్లో కొనసాగుతున్న అమ్మకాలు 
సుమారు 45 నిమిషాల​ట్రేడింగ్‌ నిలిపివేత తదుపరి ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు మళ్లీ భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం గం.10.42ని.ల వద్ద తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో మార్కెట్లలో అదే అమ్మకాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ మునుపటి ముగింపు (29915.96)తో పోలిస్తే 3,414.60 పాయింట్లు (11.41 శాతం) నష్టపోవడంతో 26501.36 వద్ద,  నిఫ్టీ గత ముగింపు(8745.45)తో 968.15 పాయింట్ల(దాదాపు 11శాతం)ను కోల్పోయి 7778.00 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  

కరోనా భయాలు స్టాక్‌ మార్కెట్లను వెంటాడుతున్న తరుణంలో నేటి ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 26924.11 వద్ద,  నిఫ్టీ 7903.00 వద్ద లోయర్‌ సర్యూట్‌ను తాకాయి. సెబీ నిబంధనల ప్రకారం సూచీలు 10శాతం పతనమైన లోయర్‌ సర్క్యూట్‌ను తాకడంతో ట్రేడింగ్‌ను 45నిమిషాల పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అన్ని రంగాలకు చెందిన సూచీల్లో అమ్మకాలు వెల్లువ కొనసాగుతున్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 15శాతం నష్టపోయి 20వేల మార్కును కోల్పోయి 17,295.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ఏడాది కనిష్టానికి 857 షేర్లు

Monday 23rd March 2020

సోమవారం ఎన్‌ఎస్‌ఈలో 857 షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయి. వీటిలో 20 మైక్రాన్స్‌, 3ఐ ఇన్ఫోటెక్‌, 3ఎం ఇండియా, 5 పైసా క్యాపిటల్‌, 63 మూన్స్‌ టెక్నాలజీస్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, ఆర్తి డ్రగ్స్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌, అవాస్‌ ఫైనాన్సియల్స్‌, ఏబీబీ ఇండియా, ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌, ఏసీసీ, యాక్షన్‌ కన్‌స్ట్రక‌్షన్‌ ఎక్విప్‌మెంట్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, ఏడీఎఫ్‌ ఫుడ్స్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అడోర్‌

హుష్‌.. రుపీ- 76నూ కోల్పోయింది

Monday 23rd March 2020

95 పైసల పతనం 76.20కు జారిన రూపాయి సరికొత్త కనిష్టమిది కరోనా సునామీ.. దేశీ కరెన్సీకీ షాకిస్తోంది. ఇప్పటికే ఫారెక్స్‌ మార్కెట్ చరిత్రలో రూపాయి తొలిసారి 75 మార్క్‌ను తాకగా.. తాజాగా 76 కంటే దిగువకు పడిపోయింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఉదయం 10.40 ప్రాంతంలో 95 పైసలు కోల్పోయింది. డాలరుతో మారకంలో 76.15ను తాకింది. ఇది సరికొత్త కనిష్టంకావడం గమనార్హం.  కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలన్నీ షట్‌డౌన్‌ బాటలో

Most from this category