News


ఐదురోజుల లాభాలకు బ్రేక్‌

Thursday 12th September 2019
Markets_main1568284304.png-28337

11000 దిగువున ముగిసిన నిఫ్టీ
166 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన అమ్మకాలతో మార్కెట్‌ గురువారం నష్టాలతో ముగిసింది. నిఫ్టీ 11000 దిగువున 54.65 పాయింట్లు నష్టంతో 10,981.05 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 166 పాయింట్లు పతనమై 37,104.28 వద్ద ముగిసింది. నేడు మార్కెట్‌ ముగింపు అనంతరం అనంతరం వెలువడనున్న ద్రవ్యోల్బణ గణాకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ మిడ్‌సెషన్‌ నుంచి అమ్మకాలకు మొగ్గుచూపారు.  ఐదురోజుల ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడటం, నేడు యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించడటం బలహీనపరిచాయి. ఫలితంగా అటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, ప్రభుత్వరంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫార్మా, ఆర్థిక, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దత లభించింది. ఇంట్రాడేలో సెనెక్స్‌ 387 పాయింట్లు స్థాయిలో 37,048.67 - 37,435.15 రేంజ్‌లో కదలాడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 117 పాయింట్లు రేంజ్‌లో 10,964.95 - 11,081.75 శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ-50 ఇండెక్స్‌లోని మొత్తం 50 షేర్లకు 35 షేర్లు నష్టాలతో ముగిశాయి. 
జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతి సుజుకీ, టాటామోటర్స్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం నష్టపోయాయి. సన్‌ఫార్మా, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 1.50శాతం నుంచి 3.65శాతం లాభపడ్డాయి. 



You may be interested

కనిష్ట స్థాయికి స్టాక్స్‌...! జున్‌జున్‌వాలా

Thursday 12th September 2019

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ప్రస్తుతానికి కనిష్ట స్థాయి పూర్తయిందని (బోటమ్డ్‌ అవుట్‌) ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేష్‌ జున్‌జున్‌వాలా పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది రుతుపవానాలు బాగున్నాయి. బ్యాంకుల్లోకి నిధుల వెల్లువ ఉంది. బ్యాంకుల క్రెడిట్‌ 15 శాతం పెరగనుంది. ఎన్‌పీఏల నుంచి బయట పడుతున్నాం’’ అని రాకేశ్‌ జున్‌జున్‌వాలా పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఆయన తన అభిప్రాయాలను తెలియజేశారు.   కేంద్ర ప్రభుత్వ పాలసీలకు జున్‌జున్‌వాలా మద్దతుగా నిలిచారు. నరేంద్రమోదీ ప్రభుత్వం మంచి

మార్కెట్‌ పతనంలోనూ ‘‘సిప్‌’’ ఆపలేదు.

Thursday 12th September 2019

మార్కెట్‌ పతనంలోనూ రీటైల్‌ ఇన్వెస్టర్లు ‘‘సిప్‌’’లు కట్టడం ఆపలేదు. జాతీయ, అంతర్జాతీయంగా ప్రతికూలతలతో గత కొద్దినెలలుగా ఈక్విటీ మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనైప్పటికీ., మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ‘‘సిప్‌’’ల ద్వారా స్థిరమైన ప్రవాహాలొచ్చాయి. ఈ సిప్‌ ప్రవాహాల్లో అధిక మొత్తం రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి, మెట్రో నగరాలు బయటి ప్రాంతాలైన బీ-30 నగరాలను నుంచి వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. మార్కెట్లో అస్థిరత నెలకొన్నప్పటికీ వారు పెట్టుబడులను కొనసాగించడంలో సహనాన్ని చూపినట్లు ఇండస్ట్రీ వర్గాలు

Most from this category