News


సెన్సెక్స్‌ 792, నిఫ్టీ 224 పాయింట్లు అప్‌

Monday 26th August 2019
Markets_main1566814195.png-28025

ఆర్థిక మంత్రి ప్యాకేజీకి జైకొట్టిన మార్కెట్‌

11050పై ముగిసిన నిఫ్టీ

కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలు మార్కెట్‌ను మురిపించడంతో పాటు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు తెరపైకి రావడంతో సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 793 పాయింట్ల లాభంతో 37,494 వద్ద ముగిసింది. నిఫ్టీ 228  పాయింట్లు పెరిగి 11050 పైన 11,057.85  వద్ద స్థిరపడింది. దాదాపు 3నెలల అనంతరం సూచీలు ఒక ట్రేడింగ్‌ సెషన్‌లో ఈ స్థాయిలో లాభాలను ఆర్జించడటం ఇదే తొలిసారి. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజాన్ని నింపేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఎఫ్‌పీఐలపై పెంచిన సర్‌ఛార్జీని ఉపసంహరించుకోవడం, బ్యాంకులకు రూ.70వేల కోట్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా భారీ లాభంతో మొదలైంది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 663 పాయింట్ల లాభంతో 37,364 వద్ద, నిఫ్టీ 171 పాయింట్ల లాభంతో 11,000 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. అయితే అగ్రరాజ్యాలై అమెరికా -చైనాల మధ్య మరింత ముదిరిన వాణిజ్య యుద్ధం, మూడీస్‌ రేటింగ్‌ సం‍స్థ ఈఏడాది దేశీయం జీడీపీ వృద్ది అంచనాను 6.2శాతానికి తగ్గించడం తదితర కారణాలతో పాటు సూచీలు గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణతో ప్రారంభమైన గంటలోనే లాభాల్ని తుడిచి పెట్టుకుపోయాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌  మెటల్‌, ఐటీ, ఫార్మా, అటో రంగాల షేర్లు అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్ఠం నుంచి 872 పాయింట్లను కోల్పోయి 36,492 వద్ద, నిఫ్టీ 244 పాయింట్లు నష్టపోయి 10,756.55 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అమెరికా - చైనాల జరుగుతున్న వాణిజ్య యుద్ధ పరిష్కారం దిశగా త్వరలో చర్చలు జరగవచ్చనే అంశంతో తెరపైకి రావడంతో అమెరికా ఫ్యూచర్స్‌ ఒక్కసారిగా లాభాల్లోకి రావడంతో ఆసియా మార్కెట్లపై కొంతవరకు అమ్మకాల ఒత్తిడి తగ్గింది. మిడ్‌సెషన్‌ సమాయానికి కల్లా అమెరికా ఫ్యూచర్లతో పాటు యూరప్‌ మార్కెట్ల లాభాల్లోకి మళ్లడంతో ఇన్వెస్టర్లకు, ట్రేడర్లు మరింత విశ్వాసాన్నిచ్చింది. అలాగే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మూడో రోజూ దిగిరావడం, నేడు ఆర్‌బీఐ మిగిలు నిధుల వినియోగం ప్రభుత్వానికి చెల్లించాల్సిన డివిడెండ్లను సిఫార్సుకు ఏర్పాటు చేసిన జలాన్‌ కమిటి తన నివేదికను ఆర్‌బీకి సమర్పిచునున్న నేపథ్యంలో ఆర్‌బీఐ బోర్డు నుంచి సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉండటం లాంటి సానుకూలాంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 37,544.48 వద్ద, నిఫ్టీ 11,070.30 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. మిడ్‌సెషన్‌ అనంతరం ఒక్క మెటల్‌ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల ర్యాలీ ఏ దశలోనూ తగ్గలేదు.  బ్యాం‍కింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. ఫలితంగా బ్యాంక్‌ ఎన్ఎస్ఈలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ దాదాపు 992 పాయింట్లు పెరిగి 27,951.35 వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో ఫైనాన్స్‌ రంగ సూచీ అత్యధికంగా 4శాతం లాభపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 10,756.55 - 11,070.30 రేంజ్‌లో, సెన్సెక్స్‌ 36,492.65 - 37,544.48 శ్రేణిలో కదలాడింది. 

అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యస్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు 5శాతం నుంచి 5.50శాతం లాభపడగా, వేదాంత, టాటాస్టీల్‌, హీరోమోటోకార్ప్‌, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం వరకు నష్టపోయాయి. You may be interested

4 వారాల్లో లాభాలనిచ్చే 12 స్టాకులు

Monday 26th August 2019

ఆర్ధిక మంత్రి శుక్రవారం ఉద్దీపన చర్యలను ప్రకటించడంతో సోమవారం మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నా 2.10 సమయానికి నిఫ్టీ 50 205 పాయింట్లు లాభపడి 11,034.90 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 735.58 పాయింట్లు లాభపడి 37,436.74 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా నిఫ్టీ రోజువారీ ఎంఏసీడీ ‘బై’ మోడ్‌లో ఉందని సీఎంటీ టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ జే ఠక్కర్, - ఏవీపీ ఈక్విటీ రీసెర్చ్,  ఆనంద్ రాఠి  షేర్స్‌ అండ్‌ స్టాక్‌

కొనుగోళ్లకు ఇదే మంచి తరుణం!

Monday 26th August 2019

ఇంత నెగిటివ్‌ వాతావరణం ఎప్పుడూ చూడలేదు రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా మార్కెట్లలో ప్రస్తుతం కనిపిస్తున్నంత నిరాశాపూరిత వాతావరణం ఎప్పుడూ చూడలేదని ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా చెప్పారు. పరిస్థితి చూస్తే చాలా అతి నిరాశ నిండినట్లు కనిపిస్తోందన్నారు. ఇలాంటి తరుణమే కొనుగోళ్లకు సరైన అవకాశమని సూచించారు. అయితే వెనువెంటనే సూచీల్లో రీబౌన్స్‌ ఉంటుందని భావించడం లేదని, క్రమానుగత మెరుగుదల ఉండొచ్చని అంచనా వేశారు. ఆర్థిక మంత్రి తాజా ప్రకటనతో సోమవారం సూచీలు భారీ లాభాల్లో

Most from this category