News


సెనెక్స్‌ లాభం 263 పాయింట్లు

Friday 30th August 2019
Markets_main1567160696.png-28117

  • 75 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

లాభనష్టాల మధ్య ట్రేడైన సూచీలు మిడ్‌సెషన్‌ నుంచి కొనుగోళ్ల మద్దతు చివరికి లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 263.86 లాభంతో 37,332.79 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 11,023.25 వద్ద ముగిసింది. అన్నిరంగాలకు చెందిన షేర్లు లాభాల్లో ముగిశాయి. ఫార్మా షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండటంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభంతో 27,423.30 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 10,874.80 - 11,042.60  రేంజ్‌లో, సెన్సెక్స్‌ 36,829.81 -  37,397.97 శ్రేణిలో కదలాడింది.   

489 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌ :-
జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల నేపథ్యంలో రెండు రోజులు వరుసగా పతనం అనంతరం నేడు మార్కెట్‌ లాభంతో మొదలైంది. నేడు సెప్టెంబర్‌ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రేడర్లు కొత్త పొజిషన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతుండంతో మిడ్‌సెషన్‌ నుంచి మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా ఫార్మా, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు భారీగా ర్యాలీ చేశాయి. అనంతరం గరిష్ట స్థాయిల వద్ద ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో మార్కెట్లో ఒక్కసారిగా అ‍మ్మకాలు మొదలయ్యాయి. ఫలితంగా సూచీలు ఉదయం ట్రేడింగ్‌లో ఆర్జించిన లాభాల్ని మిడ్‌సెషన్‌ సమయానికి హరించుకుపోయాయి. ఒక దశలో నిఫ్టీ 73 పాయిం‍ట్లు నష్టపోయి 10,875 వద్ద, సెన్సెక్స్‌ 239 పాయింట్లు కోల్పోయి 36,830 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు పతనమయ్యాయి. 

మిడ్‌సెషన్‌ అనంతరం యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం, రూపాయి రికవరీ తదితర అంశాలు ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా మార్కెట్లో మళ్లీ మళ్లీ కొనుగోళ్లు మొదలయ్యాయి. అన్ని రంగ చెందిన షేర్లకు సంపూర్ణ కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా మెటల్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు రాణించాయి. దీనికి తోడు మార్కెట్‌ చివరి అరగంట కొనుగోళ్ల సూచీలు దూసుకుపోయాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ఇంట్రాడే కనిష్టం(36,830) నుంచి 563 పాయింట్లు పెరిగి 37,398 వద్ద, నిఫ్టీ కనిష్ట స్థాయి(10,874.80) నుంచి 173 పాయింట్లు పెరిగి 10,948.30 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్‌ ముగిసే సరికి సెనెక్స్‌ 37,332.79 వద్ద, నిఫ్టీ 11,023 వద్ద స్థిరపడ్డాయి.

టాటాస్టీల్‌, ఇండస్‌ఇండ్‌, జీ లిమిటెడ్‌, సన్‌ఫార్మా, యస్‌ బ్యాంక్‌ షేర్లు 3.50శాతం నుంచి 5.50శాతం వరకు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీ, ఐషర్‌మోటర్స్‌, కోల్‌ ఇండియా, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 1.50శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి. 
 



You may be interested

ఎఫ్‌అండ్‌వోలో ఎక్కువ రోలోవర్‌ వీటిల్లోనే...

Friday 30th August 2019

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌వో) విభాగంలో డేటాను పరిశీలించడం ద్వారా ట్రేడర్ల యాక్టివిటీని అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోలోవర్ల పరిమాణం ఆయా స్టాక్స్‌ కదలికలపై రానున్న రోజుల్లో చూపించగలదు. దీనిపై సెంట్రమ్‌ బ్రోకింగ్‌ టెక్నికల్‌, డెరివేటివ్స్‌ అనలిస్ట్‌ జయ్‌ పురోహిత్‌ విశ్లేషణ ఇలా ఉంది.    ముఖ్యంగా షార్ట్‌ పొజిషన్లను కొన్నింటిని రోలోవర్‌ చేసుకున్నారు. సూచీలు జూలై నెలలో అమ్మకాలు చవిచూడగా, ఆగస్ట్‌ సిరీస్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది.

2008 రిపీటా? ఛాన్సేలేదు..

Friday 30th August 2019

ఎకానమీ చాలా బలపడింది మాంద్యాన్ని తట్టుకునే శక్తి ఉంది నిపుణుల అంచనా లాంగ్‌టర్మ్‌ పోర్టుఫోలియోలు నిర్మించుకోవాలని సూచన వీలయినంత తొందరలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తుందని దాదాపు ఇన్వెస్టర్లంతా మానసికంగా ఫిక్సయినట్లు కనిపిస్తోంది. ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతల పుణ్యమాని ఆరంభమైన మాంద్య భయాలు నానాటికీ విస్తరించాయి. దీంతో పలు మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. మన ఈక్విటీలు సైతం ఇటీవలి కాలంలో బాగా నష్టాలు చవిచూశాయి. చాలా మంచి పోర్టుఫోలియోలు సైతం నెగిటివ్‌లోకి మారాయి. ఈ నేపథ్యంలో

Most from this category