News


అటూఇటుగా మొదలై..లాభాల్లోకి

Monday 3rd February 2020
Markets_main1580702687.png-31457

సెన్సెక్స్‌ లాభాల సెంచరీ
నిఫ్టీ 33 పాయింట్లు అప్‌

బడ్జెట్‌ రోజు వారాంతాన కుప్పకూలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేటి ట్రేడింగ్‌లో కోలుకున్నాయి. అయితే తొలుత అటూఇటుగా ప్రారంభమయ్యాయి. తదుపరి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో వెనువెంటనే జోరందుకున్నాయి. ఉదయం 9.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. 134 పాయింట్లు ఎగసి 39,870ను తాకగా.. నిఫ్టీ 33 పాయింట్లు పుంజుకుని 11,695 వద్ద ట్రేడవుతోంది. పలు సెలవుల తదుపరి ఓపెన్‌ అయిన చైనీస్‌ షాంఘై ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 8 శాతం కుప్పకూలింది. పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా రెపో కోత ద్వారా వ్యవస్థలోకి 173 బిలియన్‌ డాలర్ల విలువైన నిధులను పంప్‌చేయడం గమనార్హం!


ఫార్మా ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా, మెటల్స్‌ 1-0.7 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, ఏషియన్‌ పెయింట్స్‌, కోల్‌ ఇండియా, ఇండస్‌ఇండ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎయిర్‌టెల్‌, సన్‌ ఫార్మా, బీపీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 2.5-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌, ఐటీసీ, హీరో మోటో, ఐషర్‌, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆర్‌ఐఎల్‌, యాక్సిస్‌ 2.8-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.
మ్యాక్స్‌ జోరు
డెరివేటివ్స్‌లో మ్యాక్స్‌ ఫైనాన్స్‌ 6 శాతం జంప్‌చేయగా, అమరరాజా, ఎస్కార్ట్స్‌, బయోకాన్‌, సీమెన్స్‌, బెర్జర్‌ పెయింట్స్‌, ఏసీసీ 4.5-2 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క జస్ట్‌ డయల్‌, బీఈఎల్‌, ఆయిల్‌ ఇండియా, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఐడియా, యస్‌ బ్యాంక్‌ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో 687 షేర్లు నష్టపోగా.. 586 లాభాలతో కదులుతున్నాయి.You may be interested

క్రమం తప్పకుండా ఆదాయం కోసం..

Monday 3rd February 2020

క్రమం తప్పకుండా ఆదాయం కోసం.. ఆశించే రాబడి, రిస్క్‌ కొలమానాలు వీటి ఆధారంగానే ఎంపిక ఎఫ్‌డీలు, యాన్యుటీ ప్లాన్లు, ఎస్‌డబ్ల్యూపీలు ఎస్‌సీఎస్‌ఎస్‌, వయవందనయోజన పథకాలు కాల వ్యవధి, రాబడి వేర్వేరు పదవీ విరమణ చేసిన వారికి ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం కోసం కచ్చితంగా ఒక ఏర్పాటు అనేది ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ ప్రయోజనాలు ఉంటాయి. ప్రైవేటు రంగంలోని వారికి సైతం పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ కోసం ఈపీఎఫ్‌వో అందించే

ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

Monday 3rd February 2020

(ధీరేంద్ర కుమార్‌ సీఈవో వ్యాల్యూ రీసెర్చ్‌) ప్ర: నేను గత కొంత కాలంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అయితే వీటి రాబడులు ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వీటిల్లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించమంటారా ? ఆపేయమంటారా ? ఒకవేళ అపేస్తే, ఏ కేటగిరీ ఫండ్స్‌లోకి మళ్లించమంటారు? -సిద్ధార్థ, హైదరాబాద్‌  జ: దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనకుంటేనే మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. కనీసం ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పాటు

Most from this category