News


మార్కెట్‌ పతనానికి 5 కారణాలు

Tuesday 3rd September 2019
Markets_main1567498226.png-28163

జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం మిడ్‌సెషన్‌ కల్లా మార్కెట్‌ భారీ నష్టాలను చవిచూసింది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 37000, నిఫ్టీ 11000 స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్‌ 484 పాయింట్లు పతనమై 36,823.12 వద్ద  నిఫ్టీ 245 పాయింట్ల 10,878.40 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. విలీన ప్రక్రియ ప్రతిపాదన నేపథ్యంలో మొండిబకాయిలు పెరగవచ్చనే భయాలతో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అగస్ట్‌లో వాహన అమ్మకాల క్షీణత కారణంగా అటోరంగ షేర్లు నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ ఆర్థికమాంద్య భయాలతో మెటల్‌ షేర్లు కరిగిపోతున్నాయి. అయితే రూపాయి బలహీనత కారణంగా ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. 
మార్కెట్‌ పతనానికి ఐదు కారణాలు:- 
1.ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ:- దేశీయ ఆర్థిక వ్యవస్థను మందగించడంతో  తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 5 శాతంగా నమోదయ్యింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం (2018-19) తొలి త్రైమాసికంలో భారీగా 8 శాతం వృద్ధిని సాధించింది. జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పతనం కావడం అనే అంశం పెట్టుబడి, వినియోగదారుల డిమాండ్ రెండింటిలో "గణనీయమైన క్షీణతను" సూచిస్తుందని పరిశ్రమ సంస్థ ఫిక్కీ ఆగస్టు 31 న తెలిపింది. జీడీపీ గణాంకాలు మార్కెట్‌ అంచనాల కంటే తక్కువగా నమోదయ్యాయి. దీన్ని మార్కెట్లు ప్రతికూలంగా తీసుకున్నాయని రిలిగేర్‌ బ్రోకరేజింగ్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు. అయితే ఇటీవల కేంద్ర ప్రకటించిన ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇస్తాయని నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. 
2.కొలిక్కిరాని అగ్రరాజ్యాల వాణిజ్యయుద్ధం:-  ఈ సెప్టెంబర్‌ 01 నుంచి చైనా దేశాల నుంచి దిగుమతి అవుతున్న టెలివిజన్లు, షూ లపై 15శాతం అదనపు పన్ను అమెరికా విధించింది. దీనికి ప్రతీకారంగా అమెరికా నుంచి దిగుమతయ్యే క్రూడాయిల్‌ ఇతర వస్తువులపై చైనా పన్నును విధించింది. ఇరు దేశాల మధ్య డిసెంబర్‌ నుంచి మరింత అదనపు పన్నులను విధించుకోనున్నాయి. ఈ నెలలో ప్రారంభం కావల్సిన వాణిజ్య చర్యల తేదీని ఇరు దేశాల అధికారులు ఇంకా ఖరారు చేయలేదు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొంది. 
3.కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ:- దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. అధిక సంపన్న వర్గాలపై విధించిన అదనపు పన్నును కేంద్రం ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రకటించిన నాటి నుంచి రూ. 5,920 కోట్ల అమ్మకాలు జరిపారు. మొత్తానికి ఈ ఆగస్ట్‌లో రూ.17,592.28 కోట్ల పెట్టుడులను వెనక్కి తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.  
4.నిరాశ పరిచిన అటో అ‍మ్మకాలు:- ఆగస్ట్‌లో వాహన అమ్మకాల విక్రయ గణాంకాలు మార్కెట్‌ వర్గాలను నిరాశపరిచాయి. శనివారం ఆగస్ట్ మాసపు అమ్మకాలు గణాంకాలను వెల్లడించాయి. అధిక బీమా, ద్రవ్యలభ్యత కొరత, వడ్డీ వ్యయం పెరగడం, బీఎస్‌-6 ఉద్గార నిబంధనలు అమలు, రిజిస్ట్రేషన్‌ ఫీజులు పెరగడం తదితర ప్రతికూల అంశాల నేపథ్యంలో వాహన అమ్మకాలు ఆగస్ట్‌లో రెండెకల క్షీణతను నమోదుచేశాయి. వాహన, వాహన సం‍బంధిత వస్తువులపై జీఎస్టీ పన్నును తగ్గించడం ద్వారా వాహన విక్రయాలను పెంచవచ్చని పలు బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. 
5.తగ్గిన జీఎస్‌టీ వసూళ్లు:-
జీఎస్‌టీ వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యల్పంగా నమోదు నమోదయ్యాయి. ఈ నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.98,202 కోట్లకు పరిమితయ్యాయి. ఉత్పత్తి, సేవారంగంలో నెలకొన్న స్తబ్ధత కారణంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని, ఆ ప్రభావం జీఎస్‌టీ వసూళ్లపై పడినట్లు ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.You may be interested

ప్రభుత్వ బ్యాంకులపై ప్రతికూలంగా ఉన్నాం

Tuesday 3rd September 2019

-హెమాంగ్‌జానీ ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం జరిగినప్పటికి ఈ బ్యాం‍కులలో గణనీయమైన మెరుగుదల ఉంటుందని అనుకోవడంలేదని షేర్‌ఖాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హెమాంగ్‌ జానీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... విలీనం తర్వాత మెరుగుదల చూడలేదు.. ప్రభుత్వరంగ బ్యాంకు విలీనాలను ఇది వరకు చూశాం. విలీనం వలన బ్యాంక్‌ల ఆపరేటింగ్‌ లేదా వ్యాపారం పరంగా ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. బ్యాంకుల విలీనంలో ప్రభుత్వానికి స్వంత ప్రాధాన్యతలుండొచ్చు కానీ క్రింది

ప్రభుత్వ బ్యాంకుల విలీనం.. పైవేట్‌ బ్యాంకులకు మంచిదా?

Tuesday 3rd September 2019

ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన పక్రియ, వీటి ప్రత్యర్థి బ్యాంకులకు లాభాన్ని చేకూరుస్తుందని మార్కెట్‌ విశ్లేషకులు అన్నారు. విలీన పక్రియ వలన విలీన బ్యాంకుల రుణ వృద్ధి తగ్గుతుందని, ఈ బ్యాంకులలో ఉద్యోగులు, బ్రాంచులను కలిపే విలీన పక్రియ వలన స్వల్ప కాలంలో ఏర్పడే అనిశ్చితి వలన ప్రైవేట్‌ బ్యాంకులు లాభపడతాయని తెలిపారు. కాగా శుక్రవారం ఆర్థిక మంత్రి 27 ప్రభుత్వరంగ బ్యాంకులను 12కి తగ్గించనున్నట్టు

Most from this category