News


సెన్సెక్స్‌ బౌన్స్‌బ్యాక్‌

Tuesday 11th February 2020
Markets_main1581417002.png-31697

లాభాల డబుల్‌ సెంచరీ
41,000 ఎగువన ముగింపు
ఇంట్రాడేలో క్వాడ్రపుల్‌

విదేశీ సానుకూల సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 237 పాయింట్లు ఎగసి 41,216 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 76 పాయింట్లు పుంజుకుని 12,108 వద్ద స్థిరపడింది. వెరసి రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. కరోనా భయాలను వీడిన అమెరికా మార్కెట్లు సోమవారం సరికొత్త గరిష్టాలను సాధించడంతో దేశీయంగానూ మార్కెట్లు జోరందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో డబుల్‌ సెంచరీ చేసిన సెన్సెక్స్‌ వెనువెంటనే క్వాడ్రపుల్‌ను సాధించింది. 41,444 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. తదుపరి కొంత వెనకడుగువేసి 41,179 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో నిఫ్టీ 12,172 వద్ద గరిష్టాన్నీ, 12,099 వద్ద కనిష్టాన్నీ నమోదు చేసుకుంది. ఢిల్లీలో ఆప్‌ మరోసారి సంపూర్ణ మెజారిటీ సాధించడంతో కొంతమేర సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

ఎఫ్‌ఎంసీజీ డీలా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడగా.. ఎఫ్‌ఎంసీజీ 0.4 శాతం నీరసించింది. మీడియా, మెటల్‌, ఫార్మా, ప్రయివేట్‌ బ్యాం‍క్స్‌ 1.6-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్ఫ్రాటెల్‌, ఎన్‌టీపీసీ, మారుతీ, ఎస్‌బీఐ, హిందాల్కో, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో 6-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే యస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, బ్రిటానియా, నెస్లే, టీసీఎస్‌, ఐషర్‌, సన్‌ ఫార్మా, హెచ్‌యూఎల్‌ 2-0.3 శాతం మధ్య క్షీణించాయి.

ఐబీ హౌసింగ్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐబీ హౌసింగ్‌, సన్‌ టీవీ, దివీస్‌ లేబ్స్‌, గ్లెన్‌మార్క్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. మరోవైపు నాల్కో, ఐడియా, మెక్‌డోవెల్‌, ఎంఆర్‌ఎఫ్‌, పెట్రోనెట్‌, గోద్రెజ్‌ సీపీ, ఎన్‌సీసీ, అమరరాజా, ముత్తూట్‌ ఫైనాన్స్‌ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.4 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ 0.15 శాతం వెనకడుగు వేసింది. ట్రేడైన షేర్లలో 1121 లాభపడగా.. 1381 నష్టాలతో ముగిశాయి.

అమ్మకాలవైపు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 184 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 736 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు స్వల్పంగా రూ. 162 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 179 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే. You may be interested

ఐటీసీ ఈ సీరిస్‌లో రూ. 220 దాటేనా?

Tuesday 11th February 2020

సిగరెట్ల ధరలు పెంచుతుందన్న వార్తలతో ఐటీసీ షేరు మంగళవారం ఆరంభంలో  దాదాపు 3 శాతం మేర దూసుకుపోయి రూ. 216.95 వరకు ర్యాలీ జరిపింది. అయితే ఈ లాభాలను చివరకంటా నిలబెట్టుకోలేక ట్రేడింగ్‌ ఆఖరుకు కేవలం 0.97 శాతం లాభంతో రూ. 212. 60 వద్ద క్లోజయింది. బడ్జెట్లో ప్రకటించిన పన్ను భారాన్ని తట్టుకునేందుకు సిగరెట్ల రేట్లను కంపెనీ పెంచింది. ఈ నిర్ణయం కంపెనీకి పాజిటివ్‌ అయినా ఇన్వెస్టర్లు పెద్దగా

టాప్‌ బిలియనీర్ల జాబితాలోకి అవెన్యూ సూపర్‌ మార్ట్‌ అధినేత

Tuesday 11th February 2020

భారత్‌లో టాప్‌-10 బిలియనర్స్‌ జాబితాలో అవెన్యూ సూపర్‌ మార్ట్‌ అధినేత రాధాకృష్ణన్‌ ధమానీ చోటు దక్కించుకున్నారు. గతవారంలో ఫిబ్రవరి5న కంపెనీ క్యూఐపీ ఇష్యూను ప్రకటించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధర రూ.2,049 వద్ద మొత్తం రూ.4వేల కోట్లను సమీకరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రకటన నేపథ్యంలో సోమవారం షేరు 8.5శాతం పెరిగి రూ.2,484.15 వద్ద ముగిసింది. తద్వారా కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.55 లక్షల

Most from this category