News


సెన్సెక్స్‌ నష్టం 73 పాయింట్లు

Monday 18th November 2019
news_main1574072199.png-29678

మార్కెట్‌ను ప్రభావితం చేయగలిగిన అంశాలేవి లేకపోవడంతో సోమవారం సూచీలు స్వల్ప నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 73 పాయింట్ల స్వల్ప నష్టంతో 40284 వద్ద, నిఫ్టీ 11 పాయింట్లను కోల్పోయి 11884 వద్ద స్థిరపడ్డాయి. అటో, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ఫార్మా, మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. వాటితో పాటు రియల్టీ, ఐటీ, మీడియా షేర్లు కూడా స్వల్పంగా ర్యాలీ చేశాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నష్టంతో 16 పాయింట్లు నష్టపోయి 31 వేల దిగువున 30994 వద్ద స్థిరపడింది. 
330 పాయింట్లు రేంజ్‌లో సెన్సెక్స్‌:- 
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ నేడు లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 20 పాయింట్ల లాభంతో 40,431 వద్ద, నిఫ్టీ 11,915 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆరంభంలో మెటల్‌, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీతో సూచీలు కొంతవరకు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 186 పాయింట్ల లాభంతో 40,542 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 11,946 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అనంతరం ఎఫ్‌ఎంజీసీ, అటో, ఐటీ, ప్రైవేట్‌ బ్యాంక్‌ రంగ బ్యాంక్‌ షేర్ల అమ్మకాలతో పాటు అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌ షేర్ల నష్టాల ట్రేడింగ్‌...సూచీలను లాభాలను హరించివేసింది. ఫలితంగా ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(40,542) నుంచి 320 పాయింట్లు నష్టపోయి 40,222 వద్ద, నిఫ్టీ డే హై (11,946) నుంచి 79 పాయింట్లను కోల్పోయి 11,867.60 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి.

హీరోమోటోకార్ప్‌, ఎంఅండ్‌ఎం, బ్రిటానియా, బజాజ్‌ అటో, యస్‌బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 4.50శాతం వరకు నష్టపోగా, బీపీసీఎల్‌, హిందాల్కో, యూపీఎల్‌, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 3శాతం నుంచి 4.50శాతం వరకు లాభపడ్డాయి. 



You may be interested

వడ్డీ రేట్లు తగ్గితే మరింత ర్యాలీ!

Monday 18th November 2019

‘వడ్డీ రేట్లు మరింతగా తగ్గితే కార్పొరేట్లకు లబ్ది చేకూరుతుంది. దీంతోపాటు, అధిక వృద్ధి అంచనాలు వలన వచ్చే ఏడాది పీఈ విస్తరణ జరుగుతుంది. ఫలితంగా మార్కెట్లు పెరగడం కొనసాగుతుంది’ అని మార్కెట్‌ విశ్లేషకుడు అజయ్‌ బగ్గా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు.  బాటమ్‌ ఔట్‌కు దగ్గర్లో ఆర్థిక వ్యవస్థ .. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లపై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. ప్రస్తుత ర్యాలీని బ్యాంక్‌ షేర్లు నడిపిస్తున్నాయి. బ్యాంక్‌ల ట్రెజరీ లాభాలు స్థిరంగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా బ్యాంక్‌ ఎన్‌పీఏలు

ఎస్సార్‌ కేసు పరిష్కారం..... ఎస్‌బీఐ,ఐసీఐసీఐ బ్యాంక్‌లపై సానుకూలం!

Monday 18th November 2019

ఎస్సార్‌ స్టీల్‌కు సం‍బంధించి అక్టోబర్‌ 2018 రిజల్యూషన్‌ ప్రణాళిక ప్రకారమే నడుచుకోవాలని సుప్రీం కోర్టు తీర్పివ్వడంతో శుక్రవారం సెషన్‌లో ర్యాలీ చేసిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు, సోమవారం సెషన్‌లో కూడా ఆ ర్యాలీ కొనసాగిస్తున్నాయి. ఈ తీర్పుతో ఎస్సార్‌ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి ఆర్సెలర్‌ మిట్టల్‌కు మార్గం సుగమమైంది. సుప్రీం తీర్పుతో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు అధికంగా లాభపడనున్నాయి. ఫలితంగా చాలా వరకు బ్రోకరేజిలు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌పై బుల్లిష్‌గా ఉన్నాయి.

Most from this category