News


యస్‌బ్యాంక్‌ షేరులో అమ్మకాలే కొనసాగుతాయి!

Wednesday 11th December 2019
Markets_main1576046793.png-30172

రాహుల్‌ షా అంచనా
స్వల్పకాలానికి యస్‌బ్యాంక్‌ షేరులో సెల్లింగే కొనసాగవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రతినిధి రాహుల్‌ షా అంచనా వేశారు. కొన్ని నెలలుగా ఈ షేరు తీవ్ర ఒడిదుడుకులు నమోదు చేస్తుందన్నారు. మార్కెట్లు బ్యాంకు ఫండ్‌రైజింగ్‌ ప్లాన్స్‌ను డిస్కౌంట్‌ చేశాయన్నారు. అందువల్ల ఒకవేళ మంచి డీల్‌ కుదిరినా షేరులో భారీ అప్‌మూవ్‌ ఉండకపోవచ్చన్నారు. గతంలో కూడా క్యూఐపీ అనంతరం షేరు నెగిటివ్‌గా రియాక్టైన విషయాన్ని గుర్తు చేశారు. అందువల్ల షార్ట్‌టర్మ్‌లో అనేక వార్తలు వినవచ్చి షేరు తీవ్ర కదలికలు చూపవచ్చని, ఈ సమయంలో షేరు జోలికి పోవాలనుకోవడం లేదని చెప్పారు. ఆర్‌బీఎల్‌ బ్యాంకు షేరు క్యుఐపీ అనంతరం పది శాతం పడిందని, అందువల్ల యస్‌బ్యాంకు షేరులో కూడా సెల్లింగ్‌ కొనసాగవచ్చని అంచనా వేశారు. ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం బాగాలేవని, మూడునాలుగేళ్లుగా చాలా షేర్లు నెగిటివ్‌ ప్రదర్శన చూపుతున్నాయని తెలిపారు. అయితే సమీప భవిష్యత్‌లో క్యాపెక్స్‌ సైకిల్‌ పునరుజ్జీవమయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని రాహుల్‌ తెలిపారు. ఇలాంటి తరుణంలో కమ్మిన్స్‌, ఎల్‌అండ్‌టీ, థర్మెక్స్‌ షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. రియల్టీ స్టాకులపై చాలా నెగిటివ్‌గా ఉన్నామని ఆయన చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రియల్టీ రంగంలో పలు అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కానీ వీటిలో ఎంటరయ్యేందుకు సమయం ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్పొరేట్‌ బ్యాంకు షేర్లను నమ్మడం మంచిదని సలహా ఇచ్చారు. కొన్నాళ్లుగా ప్రైవేట్‌బ్యాంకులు, బీమా కంపెనీలు, ఎంఎన్‌సీ కన్జూమర్‌ స్టాకులు మంచి ప్రదర్శన చూపుతున్నాయని, ఈ రంగాలపైనే తాము పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు. You may be interested

స్థిరంగా పసిడి

Wednesday 11th December 2019

అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ఒకడాలరు స్వల్పలాభంతో 1,469 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  చైనా దిగుమతులపై అమెరికా రెండో దఫా సుంకాల విధింపు ఈ వారం చివరి రోజు(డిసెంబర్‌ 15న) అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ట్రేడర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే నేటి రాత్రి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌

ఇన్ఫీ ఉద్యోగులకు బొనాంజా!

Wednesday 11th December 2019

డిజిటల్‌ నైపుణ్యాలుంటే నజరానాలు దాదాపు 25000 మంది మిడ్‌లెవల్‌ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు, వేతనాల పెంపునందించే ఒక టాలెంట్‌ ప్లాన్‌ను ఇన్ఫోసిస్‌ ఆరంభించింది. సరికొత్త డిజిటల్‌ విభాగాల్లో నైపుణ్యాలు సంపాదించినవారిని గుర్తించి నజరానాలు అందించనుంది. డిజిటల్‌ విభాగంలో మరింత దూసుకుపోవాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే డిజిటల్‌ నైపుణ్యాలున్నవారికి పెద్దపీట వేయాలని నిర్ణయించుకుంది. ఇటీవల కాలంలో ఐటీ కంపెనీలు తమ సాం‍ప్రదాయక వ్యాపారంలో పెద్దగా పురోగతి చూపలేకపోతున్నాయి. అందుకే కంపెనీలన్నీ ఇప్పుడు డిజిటల్‌

Most from this category