News


12000-12500 మధ్య ఉన్నంత వరకు స్ట్రాంగిల్స్‌ అమ్మొచ్చు!

Thursday 23rd January 2020
Markets_main1579777252.png-31144

ఆప్షన్‌ నిపుణుల సూచన
నిఫ్టీ స్వల్పకాలానికి 12000- 12500 పాయింట్ల రేంజ్‌లోనే కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆప్షన్‌ డేటా చూస్తే ఈ రేంజ్‌ జనవరి సీరిస్‌ వరకు కొనసాగవచ్చని చెబుతున్నారు. ఈ సీరిస్‌ ముగిసేందుకు మరో వారం మాత్రమే గడువున్నందున నిఫ్టీలో స్ట్రాంగిల్స్‌ విక్రయించే వ్యూహాలు మంచివని సూచిస్తున్నారు.(షార్ట్‌ స్ట్రాంగిల్‌- స్వల్పదూరంలోని అవుట్‌ఆఫ్‌ద మనీ పుట్‌, కాల్‌ను విక్రయించడం) ఈ రేంజ్‌ బ్రేక్‌ అయ్యేవరకు స్ట్రాంగిల్‌ సెల్లింగ్‌ లాభాలనిస్తుందని విశ్లేషిస్తున్నారు. నిఫ్టీ ప్రస్తుతం నెగిటివ్‌ ధృక్పధంతో వుందని, కానీ ఇండికేటర్లు ఇంకా బలమైన సంకేతాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. మరోవైపు ఎఫ్‌ఐఐలు ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో షార్ట్స్‌ ఎక్కువగా తీసుకుంటున్నాయి. ఎక్స్‌పైరీకి వారం మాత్రమే ఉన్నందున ఐవీ(ఇంప్లైడ్‌ ఒలటిలిటీ) తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిఫ్టీ బోలింగర్‌ బ్యాండ్‌ మధ్య, దిగువ రేఖలకు మధ్యన కదలాడుతోంది. దిగువ అవధి దాదాపు 12000 పాయింట్ల వద్ద ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి మద్దతు దొరకవచ్చు. ఇండికేటర్లలో ఇచిమోకు క్లౌడ్‌ ఇంకా బేరిష్‌నెస్‌ను నిర్ధారించలేదు. ఎంఏసీడీ, ఆర్‌ఓసీ మాత్రం నెగిటివ్‌గా ఉంటున్నాయి. ఆప్షన్స్‌లో మాక్స్‌పెయిన్‌ 12200 పాయింట్ల వద్ద కనిపిస్తోంది. అంటే ఈ స్థాయి వద్ద బేర్స్‌, బుల్స్‌ హోరాహోరీగా ఉండొచ్చు. బ్యాంకు నిఫ్టీలో కూడా బేరిష్‌ ధృక్పధం పెరుగుతోంది. గురువారం నిఫ్టీ 12200 పాయింట్ల దిగువన క్లోజయింది. 



You may be interested

ఐడీఎఫ్‌సీ నుంచి స్మాల్‌క్యాప్‌ ఫండ్‌

Thursday 23rd January 2020

ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ‘ఐడీఎఫ్‌సీ ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఫండ్‌’ పేరుతో స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది నూతన ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో). ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 17 వరకు పెట్టుబడులకు ఇది అందుబాటులో ఉంటుంది. ఎన్‌ఎఫ్‌వో క్లోజ్‌ అయిన తర్వాత ఐడీఎఫ్‌సీ ఎమర్జింగ్‌ ఫండ్‌లో ఇన్వెస్టర్లు ఎందుకు పెట్టుబడులు పెట్టాలన్న దానికి ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ పలు కారణాలు కూడా తెలియజేసింది. ‘‘లార్జ్‌క్యాప్‌, ‍స్మాల్‌క్యాప్‌ కంపెనీల మధ్య

పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల జోరు

Thursday 23rd January 2020

ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల ర్యాలీ గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్ల అమ్మకాలు ఒత్తిడికి లోనైతే, ఇతర రంగాల షేర్లు పెరిగాయి. వీటిలో అధికంగా పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు జోరు చూపించాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్ల మద్దతు లభించడంతో నిఫ్టీ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.24 శాతం పెరిగి  2,439.90 వద్ద ముగిసింది.సెంట్రల్‌ బ్యాంక్‌ 2.43 శాతంతో 19.00 వద్ద, స్టేట్‌

Most from this category