News


ఈ పీఎస్‌యూ షేర్లు ఆకర్షణీయం!

Thursday 17th January 2019
Markets_main1547718625.png-23641

సీఎల్‌ఎస్‌ఏ సిఫార్సు
దేశీయ మార్కెట్లో కొన్ని ఎంపిక చేసిన పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన రిస్కురివార్డును ఆఫర్‌ చేస్తున్నాయని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. పలు పీఎస్‌యూ షేర్లు వాటి ఆల్‌టైమ్‌ లో వద్ద ట్రేడవుతున్నాయని తెలిపింది. ఈ రేటు వద్ద వాటి పీఈలు చాల తక్కువగా ఉన్నాయని, అందువల్ల రివార్డు బాగుంటుందని వివరించింది. నిఫ్టీతో పోలిస్తే ఈ పీఎస్‌యూల వాల్యూషన్లు దాదాపు 50 శాతం తక్కువగా ఉన్నాయని తెలిపింది. ఇలా ఆకర్షణీయంగా ఉన్న పీఎస్‌యూల్లో ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా ఉన్నాయని, పీఎస్‌యూ బ్యాంకుల్లో ఎస్‌బీఐ చౌకగా లభిస్తోందని తెలిపింది. చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సైతం చౌకగానే ఉన్నా, స్పాట్‌ మార్కెటింగ్‌ మార్జిన్ల ప్రభావం వీటిపై ఎక్కువని అందువల్ల వీటితో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

ఎంపిక చేసిన పీఎస్‌యూ షేర్లు బాగున్నా, ప్రధాన మార్కెట్ల పరిస్థితి పెద్దగా బాగాలేదని అభిప్రాయపడింది. మార్కెట్లు ఇంకా పలు నెగిటివ్‌ అంశాలను జీర్ణం చేసుకోలేదని పేర్కొంది. దేశీయ నిధుల ప్రవాహం మందగించడం, మార్కెట్‌ డీరేటింగ్‌ ప్రమాదం పొంచిఉండడం, ఎన్నికల వేళ ప్రజాకర్షక పథకాల కారణంగా విత్తలోటు పెరగడం వంటి అనేక సమస్యలున్నాయని తెలిపింది. ఇవన్నీ కలిసి మార్కెట్‌ను కుంగదీయవచ్చని అంచనా వేసింది. దీనికితోడు వర్దమాన దేశాల మార్కెట్లలో ఇండియా మార్కెట్‌ ఇప్పటికీ చారిత్రక సరాసరి పీఈ విలువ కన్నా అధిక పీఈ వద్ద ట్రేడవుతోందని వివరించింది. అందువల్ల ఇన్వెస్టర్లు ఆచితూచి ఇన్వెస్ట్‌ చేయాలని సూచించింది. 



You may be interested

10900పైన నిఫ్టీ ముగింపు

Thursday 17th January 2019

మూడోరోజూ లాభాలే ఆదుకున్న హెవీవెయిట్‌ షేర్ల ర్యాలీ ఆద్యంతం ఒడిదుడుకుల ట్రేడింగ్‌ను సాగించిన సూచీలు చివరకు స్వల్ప లాభంతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 52 పాయింట్ల లాభపడి 36,374 వద్ద, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 10,905 వద్ద ముగిసింది. సూచీలకు ఇది వరుసగా మూడో రోజూ లాభాల ముగింపు కావడం విశేషం.  యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ అండతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 27500లపై ముగిసింది. డాలర్‌

జీవితకాల గరిష్టానికి యాక్సిక్‌ బ్యాంక్‌

Thursday 17th January 2019

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ షేరు టార్గెట్‌ ధరను పెంచడంతో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు గురువారం 2శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో షేరు రూ.668.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. జనవరి 1 నుంచి కొత్త ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అమితాబ్ చౌధరి బ్యాంకు అభివృద్ధికి గుణాత్మకమైన మార్పులు చేపడతారని కంపెనీ బ్రోకరేజ్‌ సంస్థ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో షేరు 15శాతం ఆదాయాన్ని సమకూరుస్తుందని

Most from this category