39 షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్!
By D Sayee Pramodh

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 39 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్ ఏవరేజ్ కన్వర్జన్స్ డైవర్జన్స్) ఇండికేటర్ బుల్లిష్ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్ క్రాసోవర్ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా మారిన కంపెనీల్లో రైల్వికాస్నిగమ్, ఓఎన్జీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఆర్ఈసీ తదితర పీఎస్‌యూలతో పాటు హెచ్డీఎఫ్సీ, టాటామోటర్స్, ఐసీఐసీఐ లుంబార్డ్, స్ట్రైడ్స్ ఫార్మా, ఫ్యూచర్ రిటైల్; ఐబీ రియల్ఎస్టేట్ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్ బలంగా ఉందని టెక్నికల్ విశ్లేషకులు చెపుతున్నారు. ఈ షేర్లలో బేరిష్ క్రాసోవర్
బుల్లిష్ ఎంఏసీడీ ఏర్పడిన షేర్లు...
మరోవైపు 21 షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్ క్రాసోవర్ ఏర్పడింది. అశోక్‌లేలాండ్, బీపీసీఎల్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్ఐఐటీ, ముత్తూట్ ఫైనాన్స్ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్ బలహీనంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బేరిష్ ఎంఏసీడీ ఏర్పడ్డ షేర్లు..
ఎంఏసీడీ అంటే..
మార్కెట్ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్ రివర్సల్ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు. 26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్ మూవింగ్ యావరేజెస్ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్ మూవింగ్ యావరేజిని సిగ్నల్ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్ ఆధారంగా బై, సెల్ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్ చేసే విధానాన్ని బట్టి బేరిష్ క్రాసింగ్, బుల్లిష్ క్రాసింగ్‌గా చెబుతారు. మదుపరులు ఇన్వెస్ట్ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా, ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీతోపాటు ఆర్ఎస్ఐ, బోలింగర్ బ్యాండ్ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.
You may be interested
వెలుగులో మెటల్ షేర్లు ..!
Tuesday 15th October 2019మెటల్ షేర్లు మంగళవారం మిడ్‌సెషన్ నుంచి లాభాల బాట పట్టాయి. గతవారంలో జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికాతో చైనా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం సరైందేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ ప్రకటనతో మార్కెట్ వర్గాలకు వాణిజ్య యుద్ధంపై కొంతమేర అనిశ్చితి తొలిగింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో మెటల్ షేర్లు ఒక్కసారిగా లాభాల బాటపట్టాయి. ఆ సానుకూల ప్రభావంతో నేటి మిడ్‌సెషన్ నుంచి మెటల్
మార్కెట్లు అధ్వాన్న స్థితిని దాటేశాయి: దేవన్ చోక్సీ
Tuesday 15th October 2019-నిర్థిష్టమైన స్టాకులలో ర్యాలీ చూడవచ్చు మార్కెట్లు వాస్తవానికి అనుగుణంగా వాటిని అవి మార్చుకుంటాయని, ఇప్పటికే మార్కెట్లు అధ్వాన్న స్థితిని దాటేశాయని కేఆర్ చోక్సీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, ఎండీ దేవన్ ఆర్ చోక్సీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... ఐఆర్సీటీసీ ధరకు డిమాండ్-సరఫరానే కారణం.. ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్) మార్కెట్లో బంపర్ లిస్టింగ్ అయ్యింది. వాల్యుషన్ పరంగా ఈ కంపెనీ లిస్టింగ్ ప్రీమియంతో ఉంది. ఈ కంపెనీ