STOCKS

News


మార్చి నాటికి 43,000కు సెన్సెక్స్‌!?

Friday 27th September 2019
Markets_main1569523912.png-28571

దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్థానిక, అంతర్జాతీయ అంశాల కారణంగా ఇంత కాలం పాటు ప్రతికూల పనితీరు చూపించినట్టు చెప్పారు గ్లోబ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హిమాన్షుగుప్తా. కానీ, ప్రభుత్వ కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత, మంచి వర్షాలు తాజా పెట్టబడులను ఆకర్షించగలవన్నారు. దీంతో వచ్చే మార్చి నాటికి నిఫ్టీ 12,500ను పరీక్షిస్తుందని తెలిపారు. సెన్సెక్స్‌ 43,000 లక్ష్యాన్ని చేరుతుందన్నారు. 11,800 స్థాయి నిఫ్టీకి కీలకమని, దీన్ని అధిగమిస్తే మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

కార్పొరేట్‌ పన్నుకోత ఎంతో సానుకూలం..
కార్పొరేట్‌ పన్ను కోత ద్వారా ప్రభుత్వం అవసరమైన చర్యను తీసుకునేందుకు కట్టుబడి ఉందన్న దానిని తెలియజేస్తోందన్నారు హిమాన్షుగుప్తా. ఆర్థిక రంగం కోణంలో వేసిన మొదటి భారీ సానుకూల అడుగుగా దీనిని అభివర్ణించారు. కంపెనీలు తిరిగి వ్యాపారాలపై పెట్టుబడులు పెట్టే విధంగా ఇది ఫలితమిస్తుందన్నారు. లిక్విడిటీని పెంచుతుందని, రుణ భారం తగ్గేందుకు, అధిక డివిడెండ్ల పంపిణీకి దారితీస్తుందని వివరించారు. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, ముఖ్యంగా తయారీ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. 

 

ఈ స్టాక్స్‌కు ఎక్కువ లాభం
‘‘కార్పొరేట్‌ పన్ను తగ్గింపు అన్నది నిఫ్టీ 2019-20 ఎర్నింగ్స్‌ 8-10 శాతం పెరిగేందుకు దారితీస్తుంది. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకుల లాభదాయకత పెరుగుతుంది. టెలికం, ఆయిల్‌ మార్కెటింగ్‌, రిటైల్‌ బ్యాంకులు, మెటల్స్‌ స్టాక్‌ల ఎర్నింగ్స్‌ ఎక్కువగా పెరుగుతాయి. కనీసం 10-20 శాతం మేర ఈపీఎస్‌ మెరుగుపడుతుంది. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, టాటా స్టీల్‌, ఐచర్‌ మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఏషియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా ఎర్నింగ్స్‌ తక్కువ పన్ను రేటు కారణంగా పెరుగుతాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ పన్ను బాధ్యతలు వాయిదా పడడం వల్ల ఏకీకృతంగా లబ్ధి పొందుతాయి’’ అని గుప్తా వివరించారు. ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, హెచ్‌యూఎల్‌, నెస్లే పట్ల తాము సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. డీమార్ట్‌, నౌకరి, బాటా ఇండియా, వీఐపీ ఇండస్ట్రీస్‌ తదితర మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ వచ్చే ఏడాది కాలంలో మంచి పనితీరు చూపిస్తాయన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్ట్‌ వరకు నికరంగా అమ్మకాలు చేయగా, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు తర్వాత వారు కొనుగోళ్లు మొదలు పెట్టినట్టు గుప్తా తెలిపారు. ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌లో భారత్‌ స్థానాన్ని రీబ్యాలన్స్‌ చేసిన తర్వాత మరిన్ని పెట్టుబడులు భారత్‌కు తరలివస్తాయని చెప్పారు. 
 You may be interested

స్మాల్‌క్యాప్‌ రికవరీ.. ఇక్కడ చూడండి..!

Friday 27th September 2019

మార్కెట్లో స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ రికవరీ బాట పట్టాయని ప్రముఖ ఇన్వెస్టర్‌ అనిల్‌కుమార్‌ గోయల్‌ పోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే గత 16 సెషన్లకుగాను 13 సెషన్లలో స్మాల్‌క్యాప్‌ సూచీ లాభపడింది. దీంతో ఈ నెలలో ఇప్పటికే 8 శాతానికి పైగా పెరిగింది. ఇదే కాలంలో సెన్సెక్స్‌ 4.4 శాతమే పెరగ్గా, అనిల్‌కుమార్‌ గోయల్‌ పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ గత నెల రోజుల్లోనే 52 శాతం ర్యాలీ చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.    అనిల్‌కుమార్‌

మళ్లీ లాభాల ముగింపు

Thursday 26th September 2019

11550 పైన ముగిసిన నిఫ్టీ 396 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌  ఒకరోజు పతనం అనంతరం మార్కెట్‌ మళ్లీ లాభాల బాట పట్టింది. గురువారం సెన్సెక్స్‌ 396.22 పాయింట్లు పెరిగి 38,990 వద్ద, నిఫ్టీ 131 పాయింట్లు లాభపడి 11,571.20 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్ని అన్నిరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆర్థిక, మెటల్‌ రంగ షేర్లలో ఎక్కువగా కొనుగోళ్లు జరిగాయి.

Most from this category