STOCKS

News


వచ్చే జూన్‌నాటికి సెన్సెక్స్‌@ 45,000!

Thursday 8th August 2019
Markets_main1565247866.png-27638

మోర్గాన్‌స్టాన్లీ
మార్కెట్లో బేర్‌ భయాలు కమ్ముకున్న తరుణంలో అంతర్జాతీయ బ్రోకింగ్‌ దిగ్గజం మోర్గాన్‌స్టాన్లీ భిన్నమైన ధృక్పథాన్ని వెలిబుచ్చుతోంది. డీలా పడిన ఇన్వెస్టర్లకు కొంత ఉత్సాహాన్నిచ్చే అంచనాలు వేస్తోంది. తాజా పతనం తర్వాత మార్కెట్లు బాటమ్‌అవుట్‌కు దగ్గర్లో ఉన్నాయని మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడింది. క్రమంగా మార్కెట్లు కోలుకుంటాయని, తిరిగి బుల్‌రన్‌ ఆరంభమై వచ్చే జూన్‌ నాటికి సెన్సెక్స్‌ 45వేల పాయింట్లను చేరుతుందని అంచనా వేసింది. బుల్స్‌ చెలరేగితే జూన్‌నాటికి సెన్సెక్స్‌ 50వేల పాయింట్లకు చేరినా ఆశ్చర్యం లేదని తన తాజా నివేదికలో పేర్కొంది. ఒకవేళ బేర్స్‌ పట్టుకొనసాగితే మాత్రం జూన్‌నాటికి సెన్స్‌క్స్‌ 35వేల పాయింట్లను చేరవచ్చని అభిప్రాయపడింది. అయితే బేర్‌ కేస్‌కు అవకాశాలు తక్కువని తెలిపింది. 
పలు షేర్ల ధరలు బాటమ్‌ అవుట్‌కు దగ్గరవుతున్నాయని వాల్యూషన్‌, సెంటిమెంట్‌ ఇండికేటర్స్‌ సూచిస్తున్నాయని, అయితే ఎకానమీలో మందగమన రిస్కులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయని మోర్గాన్‌స్టాన్లీ నివేదిక వివరించింది. ప్రస్తుతం ఈక్విటీల్లో రిస్కురివార్డు నిష్పత్తి కొనుగోళ్లకు అనుకూలంగా ఉందని, అయితే షేర్ల ధరల్లో V ఆకారపు రికవరీ రావడమనేది విధానకర్తల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని విశ్లేషించింది. ఇన్వెస్టర్లు కొంత ఓపిక వహిస్తే వచ్చే ఏడాదిలో మంచి లాభాలు చూడవచ్చని తెలిపింది. బడ్జెట్లో సూపర్‌రిచ్‌పై సర్‌చార్జి విధింపుతో దేశీయ మార్కెట్లో అమ్మకాల వెల్లువ వచ్చింది. నెల రోజుల్లోనే సూచీలు దాదాపు 10 శాతం పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండియా ఈక్విటీలు ఆకర్షణీయంగా ఉన్నాయని మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది. క్రూడ్‌ ధరల పతనం, ట్రేడ్‌ టెన్షన్లు నెలకొన్న నేపథ్యంలో ఇతర ఈక్విటీల కన్నా ఇండియానే బాగుందని తెలిపింది. 


 పోర్టుఫోలియలో ఫైనాన్షియల్స్‌, కన్జూమర్స్‌, ఇండస్ట్రియల్స్‌ రంగాల షేర్లను చేర్చుకోవచ్చని సూచించింది. షేర్ల పరంగా బజాజ్‌ ఆటో, ఎంఅండ్‌ఎం, మారుతీసుజుకీ, డాబర్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, అశోక్‌లేలాండ్‌, ఇంటర్‌గ్లోబ్‌ఏవియేషన్‌, ఎల్‌అండ్‌టీ, ఏసియన్‌పెయింట్స్‌, సన్‌ఫార్మా షేర్లపై పాజిటివ్‌గా ఉన్నట్లు తెలిపింది. You may be interested

బ్రోకరేజిల ‘బై’ సిఫార్సులు..లాభాల్లో హెచ్‌సీఎల్‌

Thursday 8th August 2019

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ క్యూ1 ఫలితాలు నిరాశపరిచినప్పటికి ఈ కంపెనీ స్టాకుపై బ్రోకరేజిలు ‘బై’ కాల్‌ను కొనసాగించడంతో హెచ్‌సీఎల్‌ షేరు విలువ గురువారం మధ్యాహ్నం 12.29 సమయానికి 4.52 శాతం లాభపడి రూ. 1,068.85 వద్ద ట్రేడవుతోంది.  ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1లో ఆపరేటింగ్‌ ఆదాయం తగ్గడంతో, కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 7.6  శాతం క్షీణించి రూ. 2,220 కోట్లుగా నమోదయ్యింది. కాగా గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ

సిప్లా షేర్లకు ఫలితాల షాక్‌

Thursday 8th August 2019

తొలి త్రైమాసికపు ఫలితాలు నిరాజనకంగా నమోదుకావడంతో పాటు బ్రోకరేజ్‌ సంస్థలు షేర్ల కొనుగోలు టార్గెట్‌ ధరను కుదించడంతో దేశీయ ఔషధ దిగ్గజం సిప్లా లిమిటెడ్‌ షేర్లు గురువారం 5శాతం పతనమయ్యాయి. నేడు ఎన్‌స్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.504.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ క్యూ1 ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన క్యూ1లో కంపెనీ 6శాతం స్వల్ప వృద్ధితో రూ.478.2 కోట్ల నికర లాభాన్ని

Most from this category