News


రెండేళ్లలో రిలయన్స్‌ స్టాక్‌ రెట్టింపు..?

Friday 6th September 2019
Markets_main1567709128.png-28221

జియో ఫైబర్‌ టారిఫ్‌లను ప్రకటించిన నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ప్రస్తుత స్థాయి నుంచి రెట్టింపు అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జియో ఫైబర్‌ సేవలను గురువారం కంపెనీ ఆరంభించింది. అలాగే, వివిధ రకాల ప్లాన్లను కూడా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,600 పట్టణాల్లో కంపెనీ గిగా ఫైబర్‌ సేవలు ఆరంభమయ్యాయి. 

 

‘‘ఇది నిజంగా మార్కెట్‌లో విధ్వంసం సృష్టించేది. వినియోగదారుల డేటాను పెద్ద లక్ష్యంగా చేసుకున్నారు. ఏఆర్‌పీయూ (ఓ వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం)ను ప్రస్తుత స్థాయి నుంచి 20 రెట్లు అధికంగా సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. వచ్చే మూడేళ్లలో ఈ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం రూ.2 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఎబిట్డా రూ.1-1.25 లక్షల కోట్లుగా ఉండొచ్చు’’ అని కేఆర్‌ చోక్సే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవేన్‌ చోక్సే అన్నారు. రిలయన్స్‌ స్టాక్‌ వచ్చే మూడేళ్లలో డబుల్‌ అవుతుందన్నారు.  ముకేశ్‌ అంబానీ కంపెనీ జియో 70-100 కోట్ల కనెక్షన్లను సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం గమనించాల్సిన అంశం. 

 

ఇతర అనలిస్టులు కూడా ఈ స్టాక్‌ పట్ల బుల్లిష్‌గానే ఉన్నారు. ‘‘గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే... మూడేళ్ల క్రితం చాలా మంది అనలిస్టులు భారీ పెట్టుబడుల కారణంగా జియో పట్ల ప్రతికూల ధోరణితో ఉన్నారు. కానీ ప్రస్తుతం జియో విలువ ఒక్కో షేరుకు రూ.180-200 వరకు ఉంటుందని అంచనా’’ అని షేర్‌ఖాన్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ స్ట్రాటజీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ హెడ్‌ గౌరవ్‌దువా తెలిపారు. జియో వ్యాపారానికి మరింత అదనపు ఆదాయాన్ని రిలయన్స్‌ జోడించనుండడం సానుకూలమన్నారు. జియో ఫైబర్‌ ప్లాన్లు రూ.699 నుంచి రూ.8,499 వరకు ఉండగా, 100 ఎంబీపీఎస్‌ నుంచి 1 జీబీపీఎస్‌ వేగంతో డేటా సేవలను అందించాలన్నది సంస్థ లక్ష్యం. 



You may be interested

సంపద సృష్టికి మార్కెట్‌ గురు ఇచ్చే సూచనలు...

Friday 6th September 2019

ఇన్వెస్టర్లలో చాలా మందికి రమేష్‌ దమానీ తెలిసే ఉంటారు. దేశంలో విజయవంతమైన ఇన్వెస్టర్లలో ఆయన కూడా ఒకరు. భారత ఈక్విటీ మార్కెట్లతో ఆయనకు 30 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం. వారెన్‌ బఫెట్‌, రాకేశ్‌ జున్‌జున్‌వాలా ఇలా ఇతర సక్సెస్‌ఫుల్‌ ఇన్వెస్టర్ల నుంచి విలువైన సూచనలను సైతం పొందిన వ్యక్తి. స్టాక్స్‌లో సంపద కూడబెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు తనకున్న అపారమైన మార్కెట్‌ అనుభవం నుంచి ఆయన ఇస్తున్న సూచనలు ఇవి...   ముందుగా ఆరంభించాలి...  ఇన్వెస్టర్లకు సంపద

మిశ్రమంగా ముగిసిన మార్కెట్‌

Thursday 5th September 2019

 మార్కెట్‌ గురువారం మిశ్రమంగా ముగిసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెన్సెక్స్‌ 80 పాయింట్ల నష్టంతో 36,644.42 వద్ద, నిఫ్టీ 3.25 పాయింట్ల స్వల్పలాభంతో 10,847.90 ముగిశాయి. అటో, మీడియా, ఫార్మా,, ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌, ఐటీ, ఎఫ్‌ఎంజీసీ, ఆర్థిక సర్వీసులు, రియల్టీరంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి ఎదుర్కోన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ నేడు లాభంతో

Most from this category