News


10810 దిశగా నిఫ్టీ!

Monday 30th April 2018
Markets_main1525066594.png-15996

5నాన్స్‌ డాట్‌కామ్‌ దినేశ్‌ రోహిరా అంచనా
దేశీయ ఈక్విటీ మార్కెట్లు కోలుకున్నట్లే కనిపిస్తున్నాయని 5నాన్స్‌డాట్‌కామ్‌ సీఈఓ దినేశ్‌రోహిరా అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లు అంతంతమాత్రంగా ఉన్నా.. భారత సూచీలు మాత్రం బలంగానే ట్రేడవుతున్నాయన్నారు. 
ఈ వారం దేశీయ సూచీలపై దినేశ్‌ అంచనాలు...  
శుక్రవారం పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించిన నిఫ్టీ సోమవారం గ్యాప్‌అప్‌తో ఓపెన్‌ అయింది. గత వారం మొత్తం మీద నిఫ్టీ దాదాపు 1.21 శాతం లాభపడింది. సోమవారం నిఫ్టీ 10730 పాయింట్లకు పైన ట్రేడవుతూ బలాన్ని చూపుతోంది. చార్టుల్లో భారీ మార్పులు కానరాకున్నా మొత్తం మీద బుల్లిష్‌ ట్రెండే కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్‌ పెద్దగా మారకుండా 60 స్థాయిల వద్దే ఉంది. అయితే ఎంఏసీడీ మాత్రం పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఈ వారం సూచీలు మరింత ముందుకు సాగే సంకేతాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఆటుపోట్లు కూడా ఉండొచ్చు. గరిష్ఠస్థాయిల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌, దిగువస్థానాల వద్ద కొనుగోళ్లు కనిపిస్తాయి. మార్కెట్లో బలమైన ర్యాలీ సంకేతాలు వచ్చే వరకు ఆచితూచి అడుగులు వేయడం ఉత్తమం. ప్రస్తుత పరిస్థితులు చూస్తే నిఫ్టీ త్వరలో 10810 పాయింట్లను చేరుతుందని అంచనా. ఇందుకు 10570 పాయింట్లను స్టాప్‌లాస్‌గా ఉంచుకోవాలి.
స్వల్పకాలం కోసం మూడు సిఫార్సులు
1. గ్రావిటా ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 220. స్టాప్‌లాస్‌ రూ. 187.
2. ‍ప్రకాశ్‌ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 237. స్టాప్‌లాస్‌ రూ. 205.
3. రాలీస్‌ ఇండియా: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 206. స్టాప్‌లాస్‌ రూ. 228.



You may be interested

ఫలితాలు.. క్రూడ్‌ వైపు చూపు

Monday 30th April 2018

మే 1 మార్కెట్‌కు సెలవు  ట్రేడింగ్‌ నాలుగు రోజులే   ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనాలు   హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వంటి కీలక కంపెనీల ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం మార్కెట్‌కు కీలకమని నిపుణులంటున్నారు. డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల పోకడ, అమెరికా  ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం  

స్వల్పంగా తగ్గిన పసిడి

Monday 30th April 2018

ముంబై:- డాలర్‌ స్థిరమైన ర్యాలీతో అంతర్జాతీయంగా పసిడి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌(31గ్రాములు) పసిడి ధర గత రాత్రి అమెరికా ముగింపు ధర(1,323.40 డాలర్ల)తో పోలిస్తే 1.10 డాలర్‌ తగ్గి 1,322.30 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ (91.54 వద్ద) స్థిరంగా ట్రేడ్‌ కావడం, ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల పెరుగుదల వంటి అంశాలతో పసిడి తగ్గింది. దేశీయంగానూ అదే ధోరణి:- అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లో

Most from this category