News


‘మెటల్స్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ స్టాక్స్‌.. హాట్‌’

Thursday 26th December 2019
Markets_main1577300002.png-30436

మెటల్స్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ స్టాక్స్‌ 2020లో బ్రహ్మాండమైన రాబడులు ఇచ్చే అవకాశాలున్నాయని ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో మన మార్కెట్లు ఏ విధంగా ఉంటాయన్న విషయమైన ఆయన తన అభిప్రాయాలను ఓ ప్రముఖ వార్తా సంస్థతో పంచుకున్నారు.

 

2020లో మార్కెట్ల గమనం..
12-15 శాతం ర్యాలీని అంచనా వేస్తున్నాం. అయితే అన్ని నెలల్లోనూ రాబడులు ఒకే విధంగా ఉండకపోవచ్చు. కొన్ని నెలల్లో అంచనాల కంటే ఎక్కువే ఉండొచ్చు. కొన్ని నెలల్లో కరెక్షన్లు ఉండొచ్చు. మొత్తానికి వచ్చే ఏడాది మార్కెట్లలో ర్యాలీని అంచనా వేస్తున్నాం. రుణ మార్కెట్‌ వాతావరణం మెరుగు పడుతుండడం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కేసు పరిష్కారం, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం, స్క్రాపింగ్‌ విధానం, ప్రముఖ ఐపీవోలు అనేవి ముఖ్యమైన చోదకాలుగా ఉంటాయి. 

 

బ్రోడర్‌ మార్కెట్ల పనితీరు?
మిడ్‌, స్మాల్‌క్యాప్‌లు గడిచిన ఏడాది కాలంలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొన్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న అంచనాలతో వచ్చే ఏడాది ఇవి రికవరీ కావచ్చు. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే అది స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీలకు లాభాలను అందిస్తుంది. 

 

2020లో 50 శాతానికి పైగా రాబడులను ఇచ్చేవి?
2020లో మెటల్స్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో ర్యాలీ ఉంటుంది. మెటల్స్‌లో వేదాంత, హిందుస్తాన్‌ జింక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ మంచి బలాన్ని చూపిస్తాయి. ఎందుకంటే మెటల్స్‌ సైకిల్‌ బోటమ్డ్‌ అవుట్‌ (ధరల క్షీణత ముగిసింది) అయింది. అంతర్జాతీయంగా ఈ సైకిల్‌లో అప్‌ట్రెండ్‌ కూడా మొదలైంది. అలాగే, వినియోగం ఊపందుకుంటే ఈ స్టాక్స్‌కు అదనపు బలం చేకూరుతుంది. అదే సమయంలో మధ్య స్థాయి హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు కూడా ఒక్కసారి వ్యవస్థలోకి నగదు ప్రవాహం పెరిగితే మంచి ర్యాలీ చేస్తాయి.

 

మార్కెట్‌పై ప్రభావం చూపించే రిస్క్‌లు
ద్రవ్యోల్బణం, డాలర్‌ బలపడడం, జీఎస్‌టీ వసూళ్ల ధోరణి, పెద్ద ఐపీవోలు (మార్కెట్లో లిక్విడిటీని తగ్గిస్తాయి), పన్ను తగ్గించడం వల్ల మూలధన వ్యయాల పునరుద్ధరణ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి తాజా పెట్టుబడులు ఇవన్నీ మార్కెట్‌పై ప్రభావం చూపించేవే. 

 

కొత్త సంవత్సరంలో వచ్చే ఐపీవోలు
గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే 2020లో అధిక కంపెనీలు, ఎక్కువ మొత్తంలో నిధులను ఐపీవో ద్వారా సమీకరించొచ్చు. హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌, ఎస్‌బీఐ కార్డ్స్‌, బర్గర్‌కింగ్‌ వీటిల్లో ప్రముఖమైనవి. You may be interested

‍స్వతంత్ర డైరెర్టర్లు... గుడ్‌బై..!

Thursday 26th December 2019

పెరుగుతున్న రాజీనామాల సంఖ్య ఈ పదవులకు పలువురు ప్రముఖుల దూరం  కంపెనీల్లో వెలుగుచూస్తున్న స్కామ్‌లతో పరువు, ప్రతిష్ఠలు పోతాయని భయం  ప్రమోటర్ల నిర్ణయాలకు బలవుతామనే సంశయం ఎన్‌ఎస్‌ఈ ఇన్ఫోబేస్‌ డాట్‌కామ్‌ వెల్లడి దేశీ కార్పొరేట్‌ రంగంలో తాజాగా వెలుగుచూస్తున్న కుంభకోణాలు, అవకతవకలు... బోర్డు రూమ్ సంక్షోభానికి దారితీస్తోంది. స్కామ్‌ల పాపం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో కంపెనీల నుంచి వైదొలగుతున్న ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో

మిడ్‌క్యాప్‌లో ఐసీఐసీఐ డైరెక్ట్‌ సిఫారసులు

Thursday 26th December 2019

నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ దిద్దుబాటు చానల్‌ను అధిగమించే దశలో ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ విశ్లేషించింది. గత రెండేళ్ల ధరల క్షీణత చానల్‌ను బ్రేకవుట్‌ చేసే విధంగా బుల్‌ మార్కెట్‌ సంకేతాన్ని ఇచ్చినట్టు తెలిపింది. లార్జ్‌క్యాప్‌ కంపెనీలు 2019లో మంచి పనితీరు చూపించగా, సాంకేతింగా చూస్తే మిడ్‌క్యాప్‌ నూతన బుల్‌ ట్రెండ్‌కు సమీపంలో ఉందని అభిప్రాయపడింది.   ‘‘దేశీయ బెంచ్‌మార్క్‌లు నూతన జీవితకాల గరిష్టాలను చేరాయి. ఈ ప్రక్రియలో దేశీయ, అంతర్జాతీయ అనిశ్చితులను అధిగమించాయి.

Most from this category