News


తాజా ప్యాకేజీ ఈ రంగాలకు సానుకూలం

Sunday 15th September 2019
Markets_main1568570546.png-28383

ఆర్థిక రంగ వృద్ధిని పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో విడత పలు రంగాలకు ప్రోత్సాహకర చర్యలతో ముందుకు వచ్చింది. రియల్‌ ఎస్టేట్‌, ఎగుమతుల రంగాలకు ప్రధానంగా పన్నుల రాయితీలు, ఫండింగ్‌, ఉద్దీపన చర్యలను ప్రకటించింది. రియల్‌ ఎస్టేట్‌ రంగ ప్రాజెక్టులు ముందుకు వెళ్లేందుకు రూ.20,000 కోట్ల నిధి, ఎగుమతులకు పన్ను రాయితీల కోసం రూ.50,000 కోట్లు ప్రకటించింది. ఈ చర్యలు ముఖ్యంగా ఎనిమిది రంగాలకు సానుకూలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా హౌసింగ్‌, టెక్స్‌టైల్‌, సిమెంట్‌, ఇన్‌ఫ్రా, మెటల్స్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగాల కంపెనీలకు మేలు చేస్తాయని భావిస్తున్నారు. 

 

మన దేశానికి ఏటా 30 లక్షల గృహాలు అవసరం. టాప్‌ 8 పట్టణాల్లో ఎనిమిది లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో 35 శాతం రూ.45 లక్షల్లోపు విభాగంలోనివే. ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం రియల్‌ ఎస్టేట్‌ రంగానికే ఇబ్బందులు కలిగించలేదు.. జాప్యం కారణంగా కొనుగోలుదారులు ఇళ్లు డెలివరీ తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ అనిశ్చితుల్లో ప్రభుత్వం నిధిని ఏర్పాటు చేస్తుండడం ఉపశమనం కల్పిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలతోపాటు టెక్స్‌టైల్స్‌, బ్యాంకులు ప్రభుత్వ చర్యలు లబ్ధి పొందుతాయి. 

- వినీత్‌ శర్మ, నార్నోలియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌

 

ఒత్తిళ్లలో ఉన్న రంగాలపై ప్రభుత్వం తన దృష్టిని సారించింది. రియల్‌ ఎస్టేట్‌, ఎంఎస్‌ఎంఈ, ఎగుమతి ఆధారిత యూనిట్లకు చర్యలు ప్రకటించింది. అసంపూర్ణ ప్రాజెక్టులకు లాస్ట్‌ మైల్‌ ఫండింగ్‌ పేరుతో చేసిన రూ.10,000 కోట్లు మంచి చేస్తుంది. బ్యాంకర్లతో భేటీ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి మరిన్ని చర్యలు వస్తాయని అంచనా వేస్తున్నాం. ఈసీబీ నిబంధనలను సరళీకరించడం నిధుల ప్రవాహానికి దారితీస్తుంది. ఎంఎస్‌ఎంఈ, ఎగుమతులపై ప్రభుత్వ దృష్టి ఎక్కువగా ఉంది. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు, మెటల్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఎగుమతి కంపెనీలకు ప్రభుత్వ చర్యలు మేలు చేస్తాయి.

- రాజీవ్‌ సింగ్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సీఈవో

 

లాస్ట్‌మైల్‌ ఫండింగ్‌ పేరుతో ఆర్థిక మంత్రి ప్రకటించిన నిధి పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు వీలు కల్పిస్తుంది. నిధుల కొరత సమస్యతో ఆగిన ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వ చర్యలు ఊరటనిస్తాయి. ప్రభుత్వ చర్యలు నిధుల సంబంధిత అంశాలపైనే కేంద్రీకృతం అయ్యాయి. టెక్స్‌టైల్స్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ స్టాక్స్‌పై దృష్టి సారించొచ్చు.

- సంజీవ్‌ జైన్‌, సన్‌నెస్‌ క్యాపిటల్‌ వీపీ

 

హౌసింగ్‌ రంగానికి ప్రభుత్వం ప్రకటించిన చర్యలు మోర్ట్‌గేజ్‌ కంపెనీలకు సానుకూలం. ప్రత్యేక నిధి కేటాయించడం అసంపూర్ణ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు వీలు కల్పిస్తుంది. అందుబాటు ధరల ఇళ్లకు ఈసీబీ మార్గదర్శకాలను సరళతరం చేయడం కార్మికుల ఆధారిత ఎగుమతి రంగాలకు జనవరి నుంచి అమల్లోకి వచ్చే ఆర్‌వోడీటీఈపీ పథకం మరింత అనుకూలం.

- ఎస్‌.రంగనాథన్‌, ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 100 పాయింట్లు డౌన్‌

Monday 16th September 2019

సౌదీ అరేబియలో రెండు చమురు ఉత్పాదక కేంద్రాలపై గత శనివారం టెర్రరిస్టులు...ద్రోణులతో జరిపిన దాడుల ప్రభావంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర భగ్గుమన్న నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 100 పాయింట్లు క్షీణించింది. ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం ఉదయం 8.50 గంటలకు 11,005 పాయింట్ల వద్ద కదులుతోం‍ది. గత శుక్రవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సెప్టెంబర్‌ ఫ్యూచర్‌ ముగింపు ధర 11,115 పాయింట్లతో పోలిస్తే

నాణ్యమైన స్టాక్స్‌ కొనుగోలుకు ఇదే సమయం

Sunday 15th September 2019

గత ఏడాదిన్నర కాలంలో దేశ ఈక్విటీలు ఎన్నో ఉత్థాన పతనాలను చూశాయి. దీంతో ఎంతో మంది రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. అంతేకాదు మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ గత రెండేళ్ల నుంచి ఇన్వెస్ట్‌ చేస్తున్న వారికి నష్టాలే కనిపిస్తున్నాయంటే స్టాక్స్‌లో ఎంత దిద్దుబాటు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నెల రోజుల వ్యవధిలో మూడు విడతల్లో ఎన్నో రంగాలకు చర్యలను ప్రకటించడం జరిగింది. ఇవన్నీ

Most from this category