స్టాక్ ఎక్సేంజ్‌ల్లో నిఘా, పర్యవేక్షణ పెంపు
By Sakshi

న్యూఢిల్లీ: ఈ వారంలోనే ఎన్నికల ఫలితాలు రానున్నందున స్టాక్స్ ధరల్లో తీవ్ర ఆటుపోట్లకు అవకాశాల నేపథ్యంలో సెబీ, స్టాక్ ఎక్సేంజ్‌లు తమ నిఘా చర్యలను పటిష్టం చేశాయి. ‘‘ఎగ్జిట్ పోల్స్ తర్వాత మొదటి ట్రేడింగ్ సెషన్ అయిన సోమవారం కోసం అత్యంత నిఘా, పర్యవేక్షణ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. గురువారం నాటికి మరింత పెంచుతాం’’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. పోల్ ఫలితాలు మార్కెట్లపై ప్రభావం చూపించే అవకాశాలున్నందున, పర్యవేక్షణ అధికం చేయడం ద్వారా కృత్రిమ చర్యలు, అధిక వోలటాలిటీకి చెక్పెట్టొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లోక్‌సభ ఫలితాలు వచ్చే ఈ నెల 23 వరకు అధిక నిఘా, పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
You may be interested
తక్షణ నిరోధం 38,600...మద్దతు 37415
Monday 20th May 2019అమెరికా-చైనాల మధ్య వాణిజ్యపోరు తీవ్రతరంకావడంతో ప్రపంచ మార్కెట్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలోనే భారత్‌లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్ ఆదివారంనాడు వెలువడ్డాయి. అత్యధిక శాతం ఎగ్జిట్‌పోల్స్...అధికార ఎన్డీఏనే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చన్న అంచనాలు వెలువరించడంతో ఈ సోమవారం మన మార్కెట్ గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే ఛాన్సుంది. కానీ 23న వెలువడే వాస్తవ ఎన్నికల ఫలితాలు ఏమాత్రం మార్కెట్ అంచనాల్ని చేరలేకపోయినా, పెద్ద పతనం సంభవించే ప్రమాదం కూడా వుంటుంది. ఎన్నికల ఫలితాలు
మా మనసంతా మైండ్‌ట్రీ మీదే
Monday 20th May 2019మరోసారి స్పష్టం చేసిన ఎల్అండ్టీ నాయక్ పెద్ద ఐటీ సంస్థగా మారుస్తామని ప్రకటన న్యూఢిల్లీ: మైండ్‌ట్రీ కొనుగోలు అన్నది తమకు అత్యంత ముఖ్యమైనదిగా ఎల్అండ్టీ గ్రూపు చైర్మన్ ఏఎం నాయక్ పేర్కొన్నారు. మైండ్‌ట్రీలో ఎల్అండ్టీ వాటా 26 శాతానికి చేరిందని, అదనపు వాటా కోసం ఓపెన్ ఆఫర్ మరో పది రోజుల్లో ప్రారంభం అవుతుందని తెలిపారు. ‘‘అవకాశాల కోసం ఎప్పుడూ చూస్తుంటాం. అయితే, ప్రస్తుతానికి మా మనసంతా మైండ్ట్రీపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ