News


డీవీఆర్‌ షేర్లకు కొత్త నిబంధనలు !

Tuesday 25th June 2019
Markets_main1561439150.png-26552

  • సెబీ కసరత్తు 


న్యూఢిల్లీ: డిఫరెన్షియల్‌  ఓటింగ్‌ రైట్స్‌(డీవీఆర్‌) షేర్లకు సంబంధించి కొత్త నిబంధనలను రూపొందించాలని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ యోచిస్తోంది. కంపెనీపై తమ నియంత్రణను కోల్పోకుండానే డీవీఆర్‌ షేర్ల జారీ ద్వారా ప్రస్తుతం ప్రమోటర్లు నిధులు సమీకరించుకోవచ్చు. డీవీఆర్‌ షేర్లు ఈక్విటీ షేర్లలాగానే ఉంటాయి. కానీ ఓటింగ్స్‌ రైట్స్‌ తక్కువగా ఉంటాయి. తమ కంపెనీ బలవంతపు టేకోవర్‌కు గురి కాకుండా ఉండటం కోసం సాధారణంగా ప్రమోటర్లు ఈ డీవీఆర్‌ షేర్లను జారీ చేస్తారు. అయితే ఓటింగ్‌ రైట్స్‌ అధికంగా ఉండే డీవీఆర్‌ షేర్లను జారీ చేయడానికి టెక్నాలజీ కంపెనీలకు అనుమతి ఇవ్వాలని సెబీ యోచిస్తోంది. రెగ్యులర్‌ ఈక్విటీ షేర్ల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ, ఓటింగ్‌ రైట్స్‌ అధికంగా ఉండే డీవీఆర్‌ షేర్ల జారీ ద్వారా కంపెనీపై ప్రమోటర్లు తమ నియంత్రణను కోల్పోరు.  

టెక్నాలజీ కంపెనీలకు ప్రయోజనం...! 
ఈ కొత్త నిబంధనలు టెక్నాలజీ కంపెనీలకు ప్రయోజనకరమని నిపుణులంటు‍న్నారు. సాధారణంగా టెక్నాలజీ కంపెనీల విజయం పూర్తిగా ప్రమోటర్లపైననే ఆధారపడి ఉంటుంది. కంపెనీకి కావలసిన నిధుల కోసం  రుణాలు తీసుకోవడం కంటే షేర్ల జారీ ద్వారానే నిధుల సమీకరణకు ఈ ప్రమోటర్లు మొగ్గు చూపుతారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ప్రమోటర్లకే నియంత్రణ ఉండేలా కొత్త నిబంధనలను సెబీ రూపొందిస్తోంది. ఈ నెల 27న(గురువారం) జరిగే  సెబీ బోర్డ్‌ సమావేశంలో ఈ కొత్త నిబంధనలపై చర్చ జరగనున్నది. అనంతరం ఒక సంప్రదింపుల పత్రాన్ని రూపొందిస్తారు. దీనిపై అందరి అభిప్రాయాలను ఆహ్వానిస్తారు. ఈ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నిబంధనలను సెబీ అందుబాటులోకి తెస్తుంది. 

 



You may be interested

ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల్లో 60 శాతం పెరుగుదల

Tuesday 25th June 2019

న్యూఢిల్లీ: జాతీయ బ్యాంకుల్లో ఈ ఏడాది మార్చి నాటికి ఐదేళ్ల కాలంలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 60 శాతం పెరిగి 8,582 మంది ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సంఖ్య 5,349 మంది అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని వారిని/సంస్థలను

స్టార్టప్‌లకు మైక్రోసాఫ్ట్‌ దన్ను

Tuesday 25th June 2019

ఎమ్‌ 12 వెంచర్‌ ఫండ్‌ ద్వారా స్టార్టప్‌లకు కొత్త విలువ  బెంగళూరు: స్టార్టప్‌ల తర్వాతి దశ వృద్ధికి ఇతోధికంగా తోడ్పాడతామని టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. తమ ఎమ్‌12 అనే వెంచర్‌ ఫండ్‌ ద్వారా భారత్‌లో స్టార్టప్‌లకు కొత్త విలువ సృష్టిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి పేర్కొన్నారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ల వృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నామన్నారు. స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి తగిన సాంకేతిక నైపుణ్యాన్ని

Most from this category