News


షార్ట్‌  సెల్లింగ్....ఒకింత కఠినం  !

Saturday 21st March 2020
Markets_main1584762712.png-32603

ఒడిదుడుకులు తగ్గించేందుకే సెబీ తాజా నిర్ణయాలు 

స్టాక్‌ మార్కెట్లో చోటు చేసుకుంటున్న తీవ్రమైన ఒడిదుడుకులను నివారించేందుకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నడుం బిగించింది. మ్యూచువల్‌ ఫండ్స్‌, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు జరిపే షార్ట్‌ సెల్లింగ్‌పై పరిమితులను విధించడం ద్వారా ఒడిదుడుకులను తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది.  డెరివేటివ్స్‌ సెగ్మెంట్లోని షేర్ల మార్కెట్‌ వైడ్‌ పొజిషన్ల పరిమితిని సవరించింది. డైనమిక్‌ ప్రైస్‌బాండ్లలో సరళీకరణతో సహా మరికొన్ని మార్పులు, చేర్పులు చేసింది. సోమవారం (ఈ నెల 23) నుంచి నెల రోజుల పాటు ఈ  మార్పులు, చేర్పులు అమల్లో ఉంటాయని పేర్కొంది. స్టాక్‌ ఎక్స్చేంజ్‌లు, క్లియరింగ్‌ కార్పొరేషన్‌లు, డిపాజిటరీలతో చర్చించి  ఈ నిర్ణయాలు తీసుకున్నామని సెబీ వివరించింది. మార్కెట్‌ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని, పరిస్థితులను బట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సెబీ తాజా నిర్ణయాల కారణంగా ఇంట్రాడేలో షార్టింగ్‌ చేసే వారిపై ప్రభావం పడుతుందని నిపుణులంటున్నారు. ఒడిదుడుకులు ఒకింత తగ్గుతాయని వారంటున్నారు. వివరాలు....

  • డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌లో లేని షేర్లకు క్యాష్‌ మార్కెట్లో మార్జిన్‌ను 40 శాతం వరకూ పెంచింది. 
  • ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(ఎఫ్‌ అండ్‌ ఓ) సెగ్మెంట్లోని షేర్ల మార్కెట్‌ వైడ్‌ పొజిషన్‌ లిమిట్‌(ఎమ్‌డబ్ల్యూపీఎల్‌) ప్రస్తుతమున్న స్థాయి నుంచి 50 శాతం మేర తగ్గించింది. 
  • ఏదైనా ఒక షేర్‌  ఎమ్‌డబ్ల్యూపీఎల్‌ యుటిలైజేషన్‌ 95 శాతం మేర మించితే, ఈ షేర్‌పై నిషేధం విధిస్తారు. 
  • డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌లోని షేర్లలో డైనమిక్‌ ప్రైస్‌ బాండ్లలో మార్పులు, చేర్పులు చేసింది. 
  • మ్యూచువల్‌ ఫండ్స్‌, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు,  ట్రేడింగ్‌ మెంబర్స్‌(ప్రోప్రయిటరీ), క్లయింట్లు షార్ట్‌ పొజిషన్లపై పరిమితులు విధించింది. 
  • ఇండెక్స్‌ డెరివేటివ్స్‌ల్లో ఈ సంస్థల షార్ట్‌ పొజిషన్లు, వాటి నోషనల్‌ వేల్యూలో మించకుండా ఉండాలి. 
  • నగదు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, ఇలాంటి సాధనాల్లో ఈ సంస్థల హోల్డింగ్స్‌ను మించి ఇండెక్స్‌ డెరివేటివ్స్‌లో ఈ సంస్థల లాంగ్‌ పొజిషన్లు ఉండకూడదు. 
  • ఈక్విటీ ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుకల, ఈక్విటీ ఇండెక్స్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్టులకు చెరో రూ.500 కోట్ల అదనపు పొజిషన్‌ లిమిట్‌ను విధించింది. ఈ పరిమితులు దాటిపోతే, ఈ సంస్థలు అదనపు డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. 

షార్ట్‌ సెల్లింగ్‌ అంటే
 షార్ట్‌ సెల్లరు-భవిష్యత్తులో ధర తగ్గుతుందనే అంచనాలతో తమ వద్ద షేర్లు లేకపోయినా, వాటిని ఇతరులకు విక్రయిస్తారు. దీని కోసం కొంత మార్జిన్‌ను స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల వద్ద ఉంచుతారు. వారి అంచనాలకునుగుణంగానే ధర తగ్గగానే ఆ షేర్లను కొనుగోలు దారులకు డెలివరీ చేస్తారు. ధరల తేడా కారణంగా షార్ట్‌ సెల్లర్లు లాభపడతారు. దీంట్లో రిస్క్‌ అధికంగా, లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. వారి అంచనాలకనుగుణంగానే ధర తగ్గకుండా, పెరిగిపోతే, ఆ మేరకు వారికి భారీగా నష్టాలు వస్తాయి. 



You may be interested

రూపాయి... కొనసాగుతున్న ‘చరిత్రాత్మక’ పతనం

Saturday 21st March 2020

ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా రెండవరోజు శుక్రవారం మరింత ‘చరిత్రాత్మక’ దిగువస్థాయికి  కిందకుపడిపోయింది. గురువారం ముగింపుతో పోల్చితే 8 పైసలు బలహీనపడి 75.20కి పడిపోయింది. ఈ స్థాయిని ఎప్పుడూ రూపాయి చూడలేదు.  ఇంట్రాడేలో రూపాయి విలువ గురువారం తరహాలోనే 75.30ని తాకింది. రూపాయి క్రితం ముగింపు 75.12.  ఆరు నెలల కనిష్టానికి విదేశీ మారకపు నిల్వలు... ​కాగా దేశీయ విదేశీ మారకపు నిల్వలు మార్చి 13తో

అమెరికా మార్కెట్లు విలవిల

Saturday 21st March 2020

డోజోన్స్‌ 913 పాయింట్లు పతనం మూడేళ్ల కనిష్టానికి మార్కెట్లు ఆర్థిక మాంద్య భయాలు గత వారం ఎస్‌అండ్‌పీ 15 శాతం డౌన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సహాయక ప్యాకేజీ, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల భారీ కోత వంటి అంశాలు ఇన్వెస్టర్లలో జోష్‌ను నింపలేకపోయాయి. వెరసి వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు యథావిధిగా పతనమయ్యాయి. డోజోన్స్‌ 915 పాయింట్లు(4.6 శాతం) పడిపోయి 19,174 వద్ద ముగిసింది. తద్వారా 2017 కనిష్టానికి చేరింది. ఇక ఎస్‌అండ్‌పీ 4.3 శాతం

Most from this category